చరిత్రలో నిలిచిపోయేలా జగనన్న పాలన.. సంక్షేమ పాలన కొనసాగలంటే.."ఫ్యాన్"కు ఓటు వేయాలి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
చరిత్రలో నిలిచిపోయేలా జగనన్న పాలన.. సంక్షేమ పాలన కొనసాగలంటే.."ఫ్యాన్"కు ఓటు వేయాలి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు
దేశ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందించారని, ప్రజలు ఓట్లు వేసి పట్టం కట్టాలని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
పుట్లూరు మండలం శనగలగూడూరు, తక్కళ్లపల్లి, పోతిరెడ్డిపల్లి, గాండ్లపాడు, ఎస్.తిమ్మాపురం, కొండేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.
గ్రామాల్లోని ప్రజలు, పార్టీ శ్రేణులు శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలను, వృద్ధులను పలకరిస్తూ, జగనన్న పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలతో, పింఛన్లులతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి "ఫ్యాన్"గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ కరపత్రాలు అందజేశారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ఊసే లేకుండా ప్రజలను అన్ని విధాలా మోసం చేసారని తెలియజేశారు. జగనన్న పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. గెలుపు కోసం ఆయన ఇలా ఎన్ని పార్టీలతో కలసి వచ్చిన ఫలితం శూన్యం అన్నారు. జగనన్న ఐదేళ్లలో అందించిన ప్రజారంజక పాలనను చూసిన టీడీపీ, జనసేన,బీజేపీ ఓటమి భయంతో పొత్తులతో వస్తున్నారన్నారు. అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న బాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Apr 24 2024, 07:45