రేపు పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ నామినేషన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేప థ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతు న్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 23 న‌ పిఠాపురం అసెంబ్లీ స్థానా నికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు.

రేపు ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగ య వరకు వేల మందితో ర్యాలీగా తరలి వెళ్లి పవన్‌ నామినేషన్‌ వేస్తారని వెల్ల డించారు.

అదే రోజు సాయంత్రం ఉప్పాడలోని ప్రధాన కూడలిలో భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారని చెప్పారు.

ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు......

నేడు మణిపూర్‌ 11 పోలింగ్‌ కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్‌

మణిపూర్‌లోని ఇన్నర్‌ మణిపూర్‌ పార్లమెంట్‌ స్థానంలో రీపోలింగ్‌ ఈరోజు ప్రశాంతంగా జరుగుతు న్నది.

లోక్‌సభ తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న జరిగిన పోలింగ్‌లో.. ఇన్నర్‌ మణిపూర్‌లోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకు న్నాయి.

దీంతో ఆ పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయిం చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభ మైంది.

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓట్లర్లు బారులు తీరారు. ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఖురాయ్ నియోజకవర్గం లోని మొయిరంగ్‌కంపు సాజేబ్, తొంగమ్ లైకై, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని క్షేత్రీగావ్‌లో నాలుగు, థోంగ్జులో ఒకటి, ఉరిపోక్‌లో మూడు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కొంతౌజామ్‌లో ఒక పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్ జరుగుతున్నది.

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

లోక్ స‌భ ఎన్నిక‌లు స‌మీ పిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌చా రం లో సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌చారంలో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా అభ్య‌ర్థు ల గెలుపు కోసం ప్ర‌చారంతో పాటు నామినేష‌న్ ప్ర‌క్రియ‌ లో కూడా పాల్గొంటున్నారు.

కాగా, ఇవాళ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌టించ‌ను న్నారు. ఆయా అభ్య‌ర్థులకు మ‌ద్ధ‌తుగా ప్ర‌చారం చేయ‌ నున్నారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటి స్తారు. ఆత్రం సుగుణ,జీవ న్ రెడ్డి , సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ల కార్యక్రమా లకు రేవంత్ హాజరుకాను న్నారు.

భారీ ర్యాలీతో తరలి వెళ్లి ఈ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు.ఇవాళ ఉదయం ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ సభ, మధ్యాహ్నం నిజామాబాద్‌లో, సాయం త్రం మల్కాజ్‌గిరిల‌లో ఎన్ని క‌ల ప్ర‌చారంపాల్గొను న్నారు..

నేడు తెలంగాణ భవన్ లో బి ఆర్ ఎస్ పార్టీ కీలక సమావేశం

ఇవాళ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమా వేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాజర వుతారు.

ఈ భేటీలో ఎంపీ అభ్యర్థు లకు కేసీఆర్‌ బీ ఫారాలు అందజేయనున్నారు. ఎన్ని కల్లో పోటీ చేసే అభ్యర్థులకు రూ.95 లక్షల విలువైన చెక్కులు ఇవ్వనున్నారు.

బీ ఫారాల అందజేత తర్వాత కేసీఆర్ పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించను న్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై అభ్యర్థులకు గులాబీ బాస్ దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నూ కేసీఆర్ భేటీ కానున్నారు...

సినీ హాస్య నటుడు రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతి

రఘుబాబు కారు ఢీకొని నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పానగల్ రహదారి పైన బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందారు.

టూటౌన్‌ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్‌ రావు (48) సమీపంలోని లెప్రసీకాలనీ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వద్దకు బుధవారం సాయం త్రం వాకింగ్‌ కోసం పానగల్‌ బైపాస్‌ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.

వ్యవసాయ క్షేత్రం వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు కారు ను స్వయంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు.. వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టారు.

దీంతో జనార్దన్‌రావు ఎగిరి డివైడర్‌ మీద పడ్డారు. తల, ఛాతి భాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జనార్దన్‌రావు భార్య నాగమణి ఫిర్యాదు తో రఘుబాబును అదుపు లోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసినట్లు సీఐ డానియేల్‌ తెలిపారు...

UPSC విజేతలకు అభినందనలు తెలియజేసిన: సీఎం రేవంత్ రెడ్డి

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2023 తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

ఈ ఫలితాల్లో ఏపీ, తెలం గాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. కాగా, UPSC ఆల్ ఇండి యా సర్వీసెస్‌ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియ జేశారు.

జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన పాల మూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్స్‌కు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.

Kadapa:నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

ontimitta Kodanda Ram Temple: కడప జిల్లాలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి కర్నూల్‌ లోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి..

నేటి నుంచి ఈనెల 25 వరకు జరగనున్నారు బ్రహ్మోత్సవాలు. ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసింది టిటిడి..

ఇవాళ ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానుంది. ఈ నెల 20న హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు రాముల వారు.

అలాగే.. ఈ నెల 21న గరుడసేవ నిర్వహణ ఉండనుంది. ఈ నెల 22న పండు వెన్నెలలో జరగనున్న కళ్యాణ వేడుకలు ఉంటాయి. ఈ నెల 26న పుష్ప యాగంతో ముగియనున్నాయి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు..

అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పుల కలకలం

అన్నమయ్య జిల్లా దారుణం జరిగింది. అన్నమయ్య జిల్లా గుర్రం కొండ లో నాటు తుపాకీ కాల్పుల కలకలం రేపింది. గుర్రం కొండ మండలం తుమ్మల గొంది లో అన్నదమ్ముల మధ్య భూ వివాదం నెలకొంది..

ఈ తరుణంలోనే తమ్ముడు విశ్వనాథ్ పై అన్న జయప్ప నాటు తుపాకీ తో కాల్పులు జరిపాడు.

అయితే.. గాయపడ్డ విశ్వనాథ్ ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విశ్వనాథ్ పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం..

శ్రీ రామనవమి సందర్భంగా యాత్రకు విరామం.. 

తణుకు తేతలిలో రాత్రి బస చేసిన సీఎం జగన్.

తిరిగి రేపు ఉదయం తేతలి నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర.

Election Campaign: కృష్ణాజిల్లాలో చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం (Election Campaign) ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి..

ఈ క్రమంలో తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవణ్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రజాగళం (Prajagalam) ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన (Pedala), మచిలీపట్నం (Machilipatnam)లో రోడ్డు షో (Road Show), బహిరంగ సభలు (Meetings) నిర్వహిస్తారు..

ఈ నేపథ్యంలో చంద్రబాబు బుధవారం సాయంత్రం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి పెడనకు ప్రత్యక హెలికాప్టర్‌లో రానున్నారు. నాలుగు గంటలకు పెడన బస్ స్టాండ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మచిలీపట్నంకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మచిలీపట్నంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు..

ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో వారాహి విజయభేరి సభ జరగనుంది..