ఉమ్మడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల బండారి శ్రావణి శ్రీ, అంబికా లక్ష్మీనారాయణ గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన.. ఆలం నరసా నాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం కూరగానిపల్లి గ్రామo లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామo లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు
గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు.ఈ కార్యక్రమం లో టీడీపీ జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు,ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని, జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అని మెగా డీఎస్సీ విడుదల చేస్తానని కళ్ళబోల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నాడే తప్ప చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువత గురించి ఒక్క సారి కూడా ఆలోచించలేదని అందుకే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ది చెప్పి తెలుగుదేశం పార్టీ గెలుపుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనాలో రాష్ట్రం ముందుకు వెళ్లకుండా అభివృద్ధిలో వెనక్కు వెళ్లిందని కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పి అభివృద్ధి, పాలనను గాలికి వదిలేశారని, ఒక్క ఛాన్స్ అని నమ్మి ఓట్లేసిన ప్రజలకు గుదిబండలాగా తయారైందని
అందుకే ముందు చూపు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకోవాలని అప్పుడే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పాలన ముందుకు సాగి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Apr 21 2024, 07:57