UPSC విజేతలకు అభినందనలు తెలియజేసిన: సీఎం రేవంత్ రెడ్డి

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2023 తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

ఈ ఫలితాల్లో ఏపీ, తెలం గాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. కాగా, UPSC ఆల్ ఇండి యా సర్వీసెస్‌ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియ జేశారు.

జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన పాల మూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్స్‌కు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.

Kadapa:నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

ontimitta Kodanda Ram Temple: కడప జిల్లాలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి కర్నూల్‌ లోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి..

నేటి నుంచి ఈనెల 25 వరకు జరగనున్నారు బ్రహ్మోత్సవాలు. ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసింది టిటిడి..

ఇవాళ ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానుంది. ఈ నెల 20న హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు రాముల వారు.

అలాగే.. ఈ నెల 21న గరుడసేవ నిర్వహణ ఉండనుంది. ఈ నెల 22న పండు వెన్నెలలో జరగనున్న కళ్యాణ వేడుకలు ఉంటాయి. ఈ నెల 26న పుష్ప యాగంతో ముగియనున్నాయి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు..

అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పుల కలకలం

అన్నమయ్య జిల్లా దారుణం జరిగింది. అన్నమయ్య జిల్లా గుర్రం కొండ లో నాటు తుపాకీ కాల్పుల కలకలం రేపింది. గుర్రం కొండ మండలం తుమ్మల గొంది లో అన్నదమ్ముల మధ్య భూ వివాదం నెలకొంది..

ఈ తరుణంలోనే తమ్ముడు విశ్వనాథ్ పై అన్న జయప్ప నాటు తుపాకీ తో కాల్పులు జరిపాడు.

అయితే.. గాయపడ్డ విశ్వనాథ్ ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విశ్వనాథ్ పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం..

శ్రీ రామనవమి సందర్భంగా యాత్రకు విరామం.. 

తణుకు తేతలిలో రాత్రి బస చేసిన సీఎం జగన్.

తిరిగి రేపు ఉదయం తేతలి నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర.

Election Campaign: కృష్ణాజిల్లాలో చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం (Election Campaign) ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి..

ఈ క్రమంలో తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవణ్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రజాగళం (Prajagalam) ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన (Pedala), మచిలీపట్నం (Machilipatnam)లో రోడ్డు షో (Road Show), బహిరంగ సభలు (Meetings) నిర్వహిస్తారు..

ఈ నేపథ్యంలో చంద్రబాబు బుధవారం సాయంత్రం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి పెడనకు ప్రత్యక హెలికాప్టర్‌లో రానున్నారు. నాలుగు గంటలకు పెడన బస్ స్టాండ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మచిలీపట్నంకు బయలుదేరి వెళతారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మచిలీపట్నంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు..

ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో వారాహి విజయభేరి సభ జరగనుంది..

ఛత్తీస్‌గఢ్‌‌ అటవీ ప్రాంతంలో మళ్ళీ భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌‌లో అడవిలో మళ్ళీ ఈరోజు భారీ ఎన్‌ కౌంటర్ జరిగింది.

ఎదురు కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందగా..ఓ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.

కాంకేర్‌ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది.

ఘటనాస్థలంలో ఏకే 47, రైఫిల్‌ను పోలీసు లు స్వాధీనం చేసుకు న్నారుకాంకేర్‌ జిల్లా ఎస్పీ ఇంద్ర కల్యాణ్ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ధృవీకరించారు.

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్రమంత్రి

బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు.

కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.

మూడు సార్లు ఎంపీగా పనిచేసిన సముద్రాల వేణుగోపాల చారి... వాజ్‌పెయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు.

జనవరి 5న తెలంగాణ నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు వేణుగోపాల చారి..

AP:ఎల్లుండి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ఢిల్లీ: ఏపీలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక, మే 13వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. 

కాగా.. ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్‌ జరుగనుంది. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. 

షెడ్యూల్‌ ఇలా..

ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ..

ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ..

 

ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన..

 

ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం..

మే 13న పోలింగ్..

జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు.

భద్రాద్రి గోదావరి 2వ వంతెనపై రాకపోకల ప్రారంభం

భద్రాద్రి వాసుల కష్టాలు సగం తీరినట్టే. గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మించిన రెండో వంతెన ప్రారంభమైంది.

కలెక్టర్‌ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్‌రాజ్‌ ప్రారంభించగా.. ఉన్నతాధికారులు నూతన వంతెనపై తమ వాహనాలు నడిపారు. మిగతా వాహన దారులు సారపాక వైపు నుంచి భద్రాచలం వైపునకు రాకపోకలు సాగించారు.

2015 ఏప్రిల్‌ 1వ తేదీన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, అప్పట్లో రాష్ట్ర రహదారు లు, భవనాల శాఖామంత్రి గా ఉన్న తుమ్మల నాగేశ్వర రావు ఈ వంతెనకు శంకుస్థా పన చేశారు.

అనంతరం వివిధ కారణా లతో నిర్మాణం జాప్యం కాగా.. ఇటీవల మళ్లీ మంత్రి పదవి చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు పనులను పూర్తి చేయించేందుకు చొరవచూపారు.

శ్రీరామనవమికల్లా కొత్త వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించ డంతో అధికారులు పనులు వేగవంతం చేయించారు. ఇప్పటికే ఉన్న పాత బ్రిడ్జితో పాటు దీన్ని పూర్తిస్థాయిలో ప్రయాణికులు, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.

వంతెన అందుబాటులోకి రావడంతో భద్రాచలం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు రవాణా సమస్య కాస్త తీరినట్టేనని అంటున్నారు. స్థానిక ప్రజలు...

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయమ్మ కన్నుమూత

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తల్లి అనసూయమ్మ సోమవారం సాయంత్రం కన్నుమూశారు.

వయసు మీదపడడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె అనారోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.

అనసూయమ్మ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క, మాజీ ఎంపి కెవిపి రామచంద్రారావుతో పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీ ఇంటికి వెళ్లి ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు...