నిరుపేదలకు పెత్తందారులకు మధ్య వ్యత్యాసాన్ని గమనించండి..ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
నిరుపేదలకు పెత్తందారులకు మధ్య వ్యత్యాసాన్ని గమనించండి
◆ మీ బిడ్డగా ఆశీర్వదించండి..సేవకుడిగా పని చేస్తా
ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ సంక్షేమాన్ని అడ్డుకుంటున్న కూటమి
◆ ప్రజలకు మంచి చేయని చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు.
నిరుపేదకు పెత్తందారులకు మధ్య వ్యత్యాసాన్ని గమనించి, కష్టం విలువ తెలిసిన నిరుపేద అయిన తనను రానున్న ఎన్నికలలో ఆశీర్వదించి గెలిపించాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, మీ అందరికీ సేవకుడిగా పనిచేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
గార్లదిన్నె మండలం కోటంక, బూదేడు, సంజీవపురం, కృష్ణాపురం గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమాన్ని అడుగడుగునా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని శింగనమల వీరాంజనేయులు అన్నారు.
ముందుగా గుంటికింద సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఫాదర్ ఫెర్రర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంటింటికీ వెళ్లి జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికలలో "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కరపత్రాలను ఓటర్లను అభ్యర్థించారు.
వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమాన్ని అడుగడుగునా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో జరిగిన మేలుని ప్రజలు మర్చిపోలేదన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు చేసిన సంక్షేమాన్ని ధైర్యంగా టిడిపి వాళ్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలతో పొంతనలేని హామీలు ఇస్తూ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. పొత్తులతో వస్తున్న టీడీపీ కూటమిని ప్రజలు నమ్మరన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలలో భాగంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే అందించిన జగనన్నకు మరోసారి ముఖ్యమంత్రిగా పట్టం కట్టటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 16 2024, 06:14