వైఎస్సార్సీపీ తో ఇంటింటా సంక్షేమాభివృద్ధి.. టీడీపీ హామీలను నమ్మి మోసపోవద్దు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరా
వైఎస్సార్సీపీ తో ఇంటింటా సంక్షేమాభివృద్ధి.. టీడీపీ హామీలను నమ్మి మోసపోవద్దు.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి
ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరా.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంటింటా సంక్షేమాభివృద్ధి జరిగిందని, ఎన్నికలు దగ్గర పడటంతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తారని, వాటిని నమ్మి మోసపోవద్దని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు కోరారు.
పుట్లూరు మండలం మడ్డిపల్లి, నారాయణరెడ్డిపల్లి, సూరేపల్లి, గొల్లపల్లి, అరకటవేముల, కొండాపురం గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలసి ఆయన గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
గ్రామాల్లో ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతూ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. జగనన్న చేసిన ఐదేళ్ల పాలనలో అందిన సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు గుర్తు చేశారు. "ఫ్యాన్ " గుర్తు కు ఓటు వేసి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను గెలిపిస్తే మీ అందరి సేవకుడిగా పనిచేస్తూ, అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ..2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక నెరవేర్చకుండా ప్రజలను నిండా ముంచారని గుర్తు చేశారు. టీడీపీ వారు నెరవేర్చలేని అబద్ధపు హామీలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. జగనన్న ఐదేళ్లలో చేసిన సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి ధైర్యంగా ఫలానా చేసామని చెప్పుకుంటున్నామని, టిడిపి పాలనలో ప్రజలకు చేసిన ఒక్క మేలునైనా ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు.
మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి "ఫ్యాన్" ప్రభంజనం ఖాయమన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల ఇబ్బందులను చూసిన ముఖ్యమంత్రి జగనన్న పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Apr 15 2024, 06:47