చండూరు గురుకుల పాఠశాలలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి

NLG: అంబేద్కర్ 134వ జయంతి ని పురస్కరించుకొని, నల్లగొండలోని చండూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆకుల బిక్షమయ్య అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు గ్యార యాదగిరి, ఉపాధ్యక్షులు అద్దంకి కిరణ్,శీను, సుష్మ, చంద్రయ్య, రాధిక, తదితరులు పాల్గొన్నారు.

NLG: మర్రిగూడ మండలంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి

మర్రిగూడ: మండల కేంద్రంలో, నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షులు నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో, స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షులు పందుల రాములు,బీసీ సంఘ అధ్యక్షులు చెరుకు శ్రీరామ్,మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య,ఈద అభి సందేశ్,ఈద కాశి,పగడాల రఘు,గ్యార హరికృష్ణ, ఆవుల ప్రభుదాస్,వడ్డే వెంకటేష్, కొండల్,సిప్పంగి శ్రీను,శంకర్,అజయ్, శివరాజ్, ప్రభుదాస్ పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NALGONDA DIST

నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో గడ్డం వెంకట్ రెడ్డి, దాసోజు యాదగిరి చారి లకు సన్మానం

నల్లగొండ: జిల్లా బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన గడ్డం వెంకట్ రెడ్డి మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన దాసోజు యాదగిరి చారి లను శనివారం బిజెపి జిల్లా కార్యాలయంలో శాలువ తో సన్మానించిన, బిజెపి పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్శిత్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణు, గడ్డం మహేష్, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్, ఆవుల మధు, బాకీ నరసింహ, గుండ్లపల్లి శాంతి స్వరూప్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను అందించిన వైఆర్పి ఫౌండేషన్

నల్గొండ: పట్టణంలోని JBS ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతి విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షల కోసం YRP ఫౌండేషన్ వారు పరీక్ష ప్యాడ్స్ అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల హెడ్మాస్టర్ నిర్మల్ రెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం మొత్తం.. YRP ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: డ్రగ్ కేసులలో శిక్షల శాతం పెరిగేలా పని చేయాలి: అడిషనల్ ఎస్పీ

నల్లగొండ: డ్రగ్ కేసులలో శిక్షల శాతం పెరిగేలా పని చేయాలని అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ చందనా దీప్తి ఆదేశాల మేరకు ఏఎస్పి రాములు నాయక్ ఆధ్వర్యంలో, కోర్టు డ్యూటీ అధికారులకు ఎన్డీపీయస్/డ్రగ్స్ కేసులలో శిక్షల పురోగతి పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రతి కేసులో తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా నమ్మకం పెరుగుతుందని అన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్న తోటి స్నేహితులు

శాలిగౌరారం మండలం, చిత్తలూరు గ్రామానికి చెందిన ఎర్ర సుధాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఇవాళ ఆయన దశదిన కర్మ సందర్భంగా టెన్త్ 1999 బ్యాచ్ స్నేహితులు కార్యక్రమంలో పాల్గొని మిత్రుడికి నివాళులు అర్పించారు.

కూరెళ్ల యాదగిరి పూర్వ విద్యార్థులను ఏకం చేసి పేదరికంలో ఉన్న మిత్రుడు ఎర్ర సుధాకర్ కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. సుధాకర్ కు భార్య ముగ్గురు, ఆడపిల్లలు ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ శౌరిరెడ్డి కి నివాళులు అర్పించిన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి

NLG: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ ప్రభుత్వ ఫిజికల్ డైరెక్టర్ గాదె శౌరిరెడ్డి దశదిన కర్మ సందర్భంగా ఈరోజు నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కుంభం రామ్ రెడ్డి పాల్గొని..  శౌరిరెడ్డి చిత్రపటానికి పుష్పాలను సమర్పిస్తూ ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా వ్యాయామ విద్య విభాగానికి, మరియు ఎంతోమంది యువతీ యువకులను గొప్పక్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో శౌరిరెడ్డి పాత్ర చాలా గొప్పదని ఆయన సేవలను కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో మాజీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కుంభం నర్సిరెడ్డి, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు, ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, లింగయ్య, రాములు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Download Streetbuzz news app

ఈనెల 21న ఆలేరు లో ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక

నల్లగొండ: ఈనెల 27 నుండి 30 తేదీ వరకు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో 10 వ రాష్ట్రస్థాయి పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు.

దానికి అనుగుణంగా ఈనెల 21 న ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నామని, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనదలచిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ఆధార్ కార్డుతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు జాయింట్ సెక్రెటరీ గడసంతుల మధుసూదన్ (సెల్ నెంబర్ 90009-89671) మరియు అసిస్టెంట్ సెక్రటరీ మద్ది కర్ణాకర్ (సెల్ నెంబర్ 94925-72900) లను సంప్రదించాలని సూచించారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Download Streetbuzz news app

నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆరవ వార్షికోత్సవ డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆరవ వార్షికోత్సవ డైరీ ఆవిష్కరణ శనివారం జరిగింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో వారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, ఆధ్వర్యంలో టి యు డబ్ల్యూ జే -143 నాంపల్లి మండల శాఖ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, ఎరెడ్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Download Streetbuzz news app

మర్రిగూడెం మండలంలో కురిసిన చిరుజల్లులు...

నల్గొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో సాయంత్రం ఐదు గంటల సమయంలో చిరుజల్లులు కురిసాయి. వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిన ప్రకారం ఇవాళ వర్షం కురిసింది. ఉదయం అంతా ఓ మోస్తారు గా ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రం సమయానికి ఒక్కసారిగా చల్లబడి, చిరుజల్లులు కురవడం మొదలయ్యింది. దీంతో వేసవి వేడి నుండి కాస్త ఉపశమనం కలిగినట్లు అయ్యింది.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG