మీ సేవకుడిగా వచ్చా... ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
మీ సేవకుడిగా వచ్చా... ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
◆ సామాన్యునికి ప్రజల నీరాజనం
◆ వాలంటర్లపై ప్రతిపక్షాల కపట ప్రేమ
◆ గతంలో కక్ష సాధించి ఇప్పుడు కనికరం చూపుతారా?
మీ సేవకుడిగా వచ్చా నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ప్రజలను అభ్యర్థించారు.
శింగనమల మండలం పెరవలి, పెద్ద జలాలపురం గ్రామాల్లో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, ఏడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, మాజీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, లింగాల రమేష్, మరియు పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు నిర్వహించారు.
ఆయనకు అడుగడుగునా హారతులు పడుతూ, పూల వర్షం కురిపిస్తూ ప్రజలు స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో సాగిన ప్రచారయాత్రలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. గడప గడపకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రభుత్వం నుంచి అందించిన సంక్షేమ లబ్దిని వివరించారు. రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్"గుర్తుకు ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ..ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించే గ్రామ వలంటీర్లను ఒకప్పుడు గోనె సంచులు మోసేవారు అని నానా మాటలు ఆడి కక్ష సాధించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్వరం మార్చి కపట ప్రేమ చూపుతున్నారన్నారు. వాలంటీర్ల సేవలను దూరం చేసిన ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పడంతో పాటు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితిల్లో ప్రాణాలకు తెగించి వలంటీర్లు ప్రజలకు సేవలు అందించారన్నారు. అలాంటి వ్యవస్థని కించపరుస్తూ మాట్లాడి వేతనాలు పెంచుతాం, వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పడం గాయం చేసి మందు రాసినట్టుగా ఉందన్నారు. ప్రతిపక్షాల మాటలు ప్రజలు, వలంటీర్లు గాని నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగనన్న గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, చేసిన అభివృద్ధిని చూసి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను ఆశీర్వదిస్తే, నియోజకవర్గంలోని ప్రజలకు సేవకుడిగా పని చేస్తూ, అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 13 2024, 07:45