Venkatesh1

Apr 13 2024, 07:28

నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించిన ముంటిమడుగు కేశవరెడ్డి గారు, బండారు కిన్నెర శ్రీ..

నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించిన ముంటిమడుగు కేశవరెడ్డి గారు, బండారు కిన్నెర శ్రీ..

శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఇబుది జమ్మన్న కు చెందిన చిని, మామిడి, మొక్కజొన్న పంటలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.విషయం తెలుసుకున్న శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటి సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి అన్న గారు బండారు కిన్నెర గారు బాధిత కుటుంబానికి పరామర్శించి 20000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రైతు 6 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నాడు చేతికి వచ్చిన పంట కాలిపోవడంతో రైతు బోరున విలపించాడు దాదాపు 5 లక్షల వరకు ఆస్థి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. జమ్మన్న ను ప్రభుత్వం ఆదుకోవాలని ముంటిమడుగు కేశవరెడ్డి గారు బండారు కిన్నెర శ్రీ గారు కోరారు.

ఈ కార్యక్రమం లో గార్లదిన్నె మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 13 2024, 07:19

పల్లె నిద్రతో.. పల్లె ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..

పల్లె ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే అభ్యర్థి వీరా..

ప్రజా సమస్యల పరిస్కారమే లక్హ్యంగా శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు "పల్లె నిద్ర" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగా ఆయా గ్రామాల్లో రాత్రి సమయంలో ప్రజలతో మమేకమై గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆరాతీసి వాటి పరిస్కారంపై దృష్టి సారించారు. ప్రతి పల్లెలోను వీరాంజనేయులు చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

యల్లనూరు మండలంలోని వాసాపురం గ్రామంలో " మన ఊరికి మన వీరా" వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారం అనంతరం ఎస్సీ కాలనీ "పల్లె నిద్ర" కార్యక్రమం చేపట్టారు.

అక్కడ ప్రజలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. స్థానికులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో రేషన్, పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయ లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలను మీ అందరి దీవెనలతో రానున్న ఎన్నికల్లో మెజారిటీతో గెలిపించిన వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. 

ప్రజలంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Venkatesh1

Apr 13 2024, 07:11

వైఎస్సార్సీపీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.. గత పాలనకు, జగనన్న పాలనకు తేడా గుర్తించాలి..వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ..

వైఎస్సార్సీపీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.. గత పాలనకు, జగనన్న పాలనకు తేడా గుర్తించాలి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని, ప్రతిఒక్కరూ " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేయాలని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు పిలుపునిచ్చారు.

యల్లనూరు మండలం కోడుమూర్తి, చిలమకూరు, అచ్యుతాపురం, బొప్పేపల్లి, వాసాపురం, కూచివారిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి ఆయన నిర్వహించారు.

ఇంటింటికీ తిరుగుతూ జగనన్న చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారన్నారు. గత పాలనకు, జగనన్న పాలనకు తేడా గుర్తించి, గడప వద్దకే సంక్షేమం కావాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. రానున్న ఎన్నికల్లో " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ కరపత్రాలు అందజేశారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..ప్రతిపక్ష టీడీపీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలను నేరుగా అందించిన ఘనత వైస్సార్సీపీకే దక్కుతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి రహితంగా ప్రభుత్వ పథకాలను అందించటం జరిగిందన్నారు. జగనన్న నేతృత్వంలో పారదర్శక పాలనను చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నాడన్నారు.

రాష్ట్రంలో జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. ప్రజలను మోసగించేందుకు వస్తున్న చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. ఎన్ని కూటములతో వచ్చినా ప్రజల అండ ఉన్నంతవరకు జగనన్నని ఏమీ చేయలేరన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా సంక్షేమ పథకాలు అందుతున్నాయని రానున్న ఎన్నికలలో జగనన్నకు తమ ఓటు వేస్తామని ప్రజలు వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 12 2024, 09:15

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నివాసంలో టీడీపీ అసమ్మతిగా ఉన్న కోట్లవర్గీయులతో కలిసి చర్చిస్తున్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె.రామలింగారెడ్డి.

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం లద్దగిరి గ్రామంలో మాజీముఖ్యమంత్రి కుమారుడు మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి నివాసంలో టీడీపీ అసమ్మతిగా ఉన్న కోట్లవర్గీయులతో కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (కోడుమూరు నియోజకవర్గ పరిశీలకుడు) కాటప్పగారి రామలింగారెడ్డి గారు*

Venkatesh1

Apr 12 2024, 09:03

బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం ..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం చాములూరు, నిలువురాయి గ్రామాలలో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకటనరసానాయుడు గారు,ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు.

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ వైకాపా నాయకులు ప్రజాధరణ పొందలేక పోయారని జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలకు తీవ్ర వ్యతిరేకత వస్తోందని, అందువల్లనే నాయకులు, కార్యకర్తలు వైసిపిని వీడి టీడీపీలో చేరుతున్నారని కూటమి లక్ష్యాలు టీడీపీ ప్రజాకార్షక పధకాలను మెచ్చి టీడీపీకి మద్దతు తెలుపుతున్నారని రానున్న ఎన్నికల్లో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి విజయం ఖాయమని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా గెలుస్తునారు.జగన్ అధికారం చేపడితే రాష్ట్రం మరో బీహార్ అవుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు కు ఓటు వేయాలని గ్రామస్థులను ఆలం నరసానాయుడు తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 12 2024, 08:49

మీ సేవకుడిగా వచ్చా... ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

మీ సేవకుడిగా వచ్చా... ఆశీర్వదించండి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

◆ సామాన్యునికి ప్రజల నీరాజనం

◆ వాలంటర్లపై ప్రతిపక్షాల కపట ప్రేమ

◆ గతంలో కక్ష సాధించి ఇప్పుడు కనికరం చూపుతారా?

మీ సేవకుడిగా వచ్చా నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ప్రజలను అభ్యర్థించారు.

శింగనమల మండలం పెరవలి, పెద్ద జలాలపురం గ్రామాల్లో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, ఏడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, మాజీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, లింగాల రమేష్, మరియు పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు నిర్వహించారు.

ఆయనకు అడుగడుగునా హారతులు పడుతూ, పూల వర్షం కురిపిస్తూ ప్రజలు స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో సాగిన ప్రచారయాత్రలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. గడప గడపకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రభుత్వం నుంచి అందించిన సంక్షేమ లబ్దిని వివరించారు. రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్"గుర్తుకు ఓటు వేసి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించే గ్రామ వలంటీర్లను ఒకప్పుడు గోనె సంచులు మోసేవారు అని నానా మాటలు ఆడి కక్ష సాధించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్వరం మార్చి కపట ప్రేమ చూపుతున్నారన్నారు. వాలంటీర్ల సేవలను దూరం చేసిన ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పడంతో పాటు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితిల్లో ప్రాణాలకు తెగించి వలంటీర్లు ప్రజలకు సేవలు అందించారన్నారు. అలాంటి వ్యవస్థని కించపరుస్తూ మాట్లాడి వేతనాలు పెంచుతాం, వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పడం గాయం చేసి మందు రాసినట్టుగా ఉందన్నారు. ప్రతిపక్షాల మాటలు ప్రజలు, వలంటీర్లు గాని నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగనన్న గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, చేసిన అభివృద్ధిని చూసి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను ఆశీర్వదిస్తే, నియోజకవర్గంలోని ప్రజలకు సేవకుడిగా పని చేస్తూ, అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 12 2024, 08:39

మామిడితోట, మొక్కజొన్న, సినీతోటలకు నిప్పు ...

సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ ఎస్ కొండకింద కొట్టాల బేడ బుడగ జంగాల కులస్థుడు జమ్మన 6 ఎకరాల గల మామిడితోట మొక్కజొన్న సినీతోటని నిప్పు అట్టించడం జరిగింది. ఇందులో బాగంగా పంట నష్టము భారీ స్థాయిలో జరిగిందని రైతు తెలియజేశారు. పరిశీలించిన పోలీసులు

Venkatesh1

Apr 11 2024, 16:14

రంజాన్ పండుగ సందర్భంగా దండు శ్రీనివాసులు గారి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముస్లీం యువత..

రంజాన్ పండుగ సందర్భంగా దండు శ్రీనివాసులు గారి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముస్లీం యువత..

శింగనమల : ముస్లిం సోదర సోదరీమణులు పవిత్రంగా అల్లా స్మరణతో, భక్తి పారవశ్యంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి, నెలవంక రాకతో పండుగ వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిం సోదర సోదరీమణులు జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి కార్యాలయంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా దండు శ్రీనివాసులు మాట్లాడుతూ..... రంజాన్ పండుగ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని చెప్పారు. అల్లా అనుగ్రహం కోసం 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండడం గొప్ప విషయమన్నారు. ఇస్లాం అంటే మత సామరస్యానికి ప్రతీక అని ప్రతీ ఒక్కరు ప్రవక్త అడుగుజాడల్లో నడవాలని. ఆ అల్లా చల్లని దీవెనలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో ముస్లీం యువత బాబావలి,దాదు,సర్పయాజ్ మౌలా, అమీనాబీగారిమహ్మద్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, బిసి సెల్ పార్లమెంటు అధికార ప్రతినిధి బండి పరుశురాం బిసి సెల్ శింగనమలనియోజకవర్గ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, శింగనమల మండల తెలుగు యువత అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, మల్లిఖార్జున, దాసరి వెంకటరమణ, రంగస్వామి, దండు ప్రకాష్, నాయీ బ్రాహ్మణ సాధికారత కమిటీ సభ్యులు వెంకటప్ప, తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 11 2024, 11:21

ఉగాది ఉత్సవాల్లో తీవ్ర విషాదం..

ఉగాది ఉత్సవాల్లో తీవ్ర విషాదం..

కర్నూలు :ఉగాది ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

చిన్నటేకూరులో ప్రభ లాగుతుండగా విద్యుత్ షాక్ తగిలి 17 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

షాక్కు గురైన పిల్లలు రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

వెంటనే చిన్నారులను కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Venkatesh1

Apr 11 2024, 08:10

కోడుమూరు నియోజకవర్గ పరిశీలకుడు రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డిని సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకుడు రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలవకప్పి పుష్పగుచ్చాంతో ఆహ్వానించిన కోడుమూరు నియోజకవర్గ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ) MLA అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారు