బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం ..
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం చాములూరు, నిలువురాయి గ్రామాలలో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారి గెలుపు కొరకు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ నాయకులు ఆలం వెంకటనరసానాయుడు గారు,ఆకుల ఆంజనేయులు గారు పాల్గొన్నారు.
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.
ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ వైకాపా నాయకులు ప్రజాధరణ పొందలేక పోయారని జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలకు తీవ్ర వ్యతిరేకత వస్తోందని, అందువల్లనే నాయకులు, కార్యకర్తలు వైసిపిని వీడి టీడీపీలో చేరుతున్నారని కూటమి లక్ష్యాలు టీడీపీ ప్రజాకార్షక పధకాలను మెచ్చి టీడీపీకి మద్దతు తెలుపుతున్నారని రానున్న ఎన్నికల్లో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి విజయం ఖాయమని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా గెలుస్తునారు.జగన్ అధికారం చేపడితే రాష్ట్రం మరో బీహార్ అవుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు కు ఓటు వేయాలని గ్రామస్థులను ఆలం నరసానాయుడు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Apr 12 2024, 09:15