Venkatesh1

Apr 12 2024, 08:39

మామిడితోట, మొక్కజొన్న, సినీతోటలకు నిప్పు ...

సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ ఎస్ కొండకింద కొట్టాల బేడ బుడగ జంగాల కులస్థుడు జమ్మన 6 ఎకరాల గల మామిడితోట మొక్కజొన్న సినీతోటని నిప్పు అట్టించడం జరిగింది. ఇందులో బాగంగా పంట నష్టము భారీ స్థాయిలో జరిగిందని రైతు తెలియజేశారు. పరిశీలించిన పోలీసులు

Venkatesh1

Apr 11 2024, 16:14

రంజాన్ పండుగ సందర్భంగా దండు శ్రీనివాసులు గారి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముస్లీం యువత..

రంజాన్ పండుగ సందర్భంగా దండు శ్రీనివాసులు గారి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముస్లీం యువత..

శింగనమల : ముస్లిం సోదర సోదరీమణులు పవిత్రంగా అల్లా స్మరణతో, భక్తి పారవశ్యంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి, నెలవంక రాకతో పండుగ వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిం సోదర సోదరీమణులు జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు గారి కార్యాలయంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా దండు శ్రీనివాసులు మాట్లాడుతూ..... రంజాన్ పండుగ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని చెప్పారు. అల్లా అనుగ్రహం కోసం 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండడం గొప్ప విషయమన్నారు. ఇస్లాం అంటే మత సామరస్యానికి ప్రతీక అని ప్రతీ ఒక్కరు ప్రవక్త అడుగుజాడల్లో నడవాలని. ఆ అల్లా చల్లని దీవెనలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో ముస్లీం యువత బాబావలి,దాదు,సర్పయాజ్ మౌలా, అమీనాబీగారిమహ్మద్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ, బిసి సెల్ పార్లమెంటు అధికార ప్రతినిధి బండి పరుశురాం బిసి సెల్ శింగనమలనియోజకవర్గ అధ్యక్షులు బెస్త‌‌‌ నారాయణస్వామి, శింగనమల మండల తెలుగు యువత అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, మల్లిఖార్జున, దాసరి వెంకటరమణ, రంగస్వామి, దండు ప్రకాష్, నాయీ బ్రాహ్మణ సాధికారత కమిటీ సభ్యులు వెంకటప్ప, తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 11 2024, 11:21

ఉగాది ఉత్సవాల్లో తీవ్ర విషాదం..

ఉగాది ఉత్సవాల్లో తీవ్ర విషాదం..

కర్నూలు :ఉగాది ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

చిన్నటేకూరులో ప్రభ లాగుతుండగా విద్యుత్ షాక్ తగిలి 17 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

షాక్కు గురైన పిల్లలు రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

వెంటనే చిన్నారులను కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Venkatesh1

Apr 11 2024, 08:10

కోడుమూరు నియోజకవర్గ పరిశీలకుడు రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డిని సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిశీలకుడు రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలవకప్పి పుష్పగుచ్చాంతో ఆహ్వానించిన కోడుమూరు నియోజకవర్గ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ) MLA అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారు

Venkatesh1

Apr 09 2024, 07:23

ఇఫ్తార్ విందుతో సోదరభావం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

ఇఫ్తార్ విందుతో సోదరభావం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ వైస్సార్సీపీ నాయకులు మొరుసు రమణారెడ్డి మొరుసు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

◆ పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఎంపీ అభ్యర్థి ఎం.శంకర్ నారాయణ, జిల్లా అభ్యర్థులు పైలా నరసింహయ్య, నియోజకవర్గ పరిశీలకులు రమేష్ రెడ్డి.

దైవం పట్ల భక్తి విశ్వాసాలు.. మత సామరస్యం, సోదర భావం, ప్రజల మధ్య ఆత్మీయత ఇఫ్తార్ విందుల ద్వారా పెంపొందుతాయని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ అన్నారు.

నార్పల మండల కేంద్రంలోని దుగుమర్రి రోడ్డులో మొరుసు సోదరుల ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

సాంప్రదాయబద్ధంగా మత పెద్దలతో కలిసి, నేటి దీక్ష విరమణ చేశారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. 

వారు మాట్లాడుతూ... రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందన్నారు. దైవ చింతనలో నియమబద్ద జీవితం గడపడం వల్ల చక్కని క్రమశిక్షణ, ఓర్పు అలవడతాయని చెప్పారు. రంజాన్ మాసంలో అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 09 2024, 07:16

జగనన్నకే జనం మద్దతు.. అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ వైయస్సార్ సీపీ.. వైసీపీ గెలుపు ఖాయం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

జగనన్నకే జనం మద్దతు.. అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ వైయస్సార్ సీపీ.. వైసీపీ గెలుపు ఖాయం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

ప్రజలందరి మద్దతు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని, అన్నీ వర్గాలకు న్యాయం చేసిన వైయస్సార్ సీపీ గెలుపు ఖాయమని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

నార్పల మండలం నర్సాపురం, ఎస్ టీ కాలనీ, నిలితొట్టిపల్లి, దుగుమర్రి, తుంపెర, గంగనపల్లి, గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి ఆయన చేపట్టారు.

గ్రామాల్లోని స్థానికులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగనన్న చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని వివరించారు. ఈ సంక్షేమం ఇలానే కొనసాగలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనమంతా గెలిపించుకోవాలని కోరారు. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ...జగనన్న పాలనలో సమాజంలో అన్నీ వర్గాలకు సమన్యాయం జరుగుతోందన్నారు. అందుకే అన్ని సామాజిక వర్గాల వారుఆయనకు అండగా నిలబడుతున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, తమకు నిజమైన మేలు చేసేది జగనన్నే అని గుర్తిస్తున్నారని వెల్లడించారు. నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి పొందిన పేదలు భవిష్యత్తులో కూడా అవి సజావుగా కొనసాగాలంటే మళ్లీ జగనన్నని గెలిపించుకోవాలన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలతో కూడిన దుష్ప్రచారాలు చేసినా 2024లో ముఖ్యమంత్రిగా జగనన్న అవడం ఖాయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 07 2024, 07:52

జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఆసరా..

జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఆసరా

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల సంక్షేమాభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టి మహిళలకు ఆసరాగా నిలిచారని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

"మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారం అనంతరం బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలో ఎస్సీ కాలనీలో "పల్లె నిద్ర" కార్యక్రమంలో భాగంగా మహిళలతో సమావేశం నిర్వహించారు.

స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరించారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా రక్షణకోసం దిశా యాప్ ను ప్రవేశపెట్టిన ఘనత జగనన్నకు దక్కిందన్నారు. అదేవిధంగా మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు వైఎస్సార్సీపీ ఆసరా, చేయూత, వంటి సంక్షేమ పథకాలు అందించారన్నారు. మహిళల పేరు మీద ఇంటి పట్టా మంజూరు చేపించి వారి సొంత ఉంటి కల నెరవేర్చి ఇంటి రిజిస్ట్రేషన్ చేపించారన్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లులకు అమ్మ ఒడి వర్తింపజేశారన్నారు.

Venkatesh1

Apr 07 2024, 07:47

అమ్మా.. ఆశీర్వదించండి.. సంక్షేమం, అభివృద్ధిని చూసి "ఫ్యాన్" కు ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

అమ్మా.. ఆశీర్వదించండి.. సంక్షేమం, అభివృద్ధిని చూసి "ఫ్యాన్" కు ఓటు వేయండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ టీడీపీ చేసిన వాగ్దానాలను నమ్మకండి

ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను ఆశీర్వదించాలని, ప్రజలందరి దీవెనలు కావాలని కోరారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అందించిన సంక్షేమం, అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికలలో " ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మరియు టిడిపి నెరవేర్చని హామీలతో ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారని వారి మాటలు నమ్మకండి అని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట, రేకులకుంట, గాంధీనగర్ గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో ఆయన నిర్వహించారు.

ముందుగా గ్రామాల్లో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు శాలువాతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని వివరిస్తూ, రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును "ఫ్యాన్" గుర్తుపై వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలను అందజేసి అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న చేసిన మేలుని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ప్రజలను మభ్య పెట్టేందుకు జనసేన, బిజెపి కూటమిగా వస్తున్నారని కూటమిని కుప్పకూల్చి ఇంటికి పంపుదామని పిలుపునిచ్చారు. వైయస్ఆర్ సీపీ పార్టీ పెత్తందారుల పార్టీ కాదు పేదల పార్టీ అని మరోసారి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించి జగనన్న రుజువు చేశారన్నారు. గ్రామాల్లో ఇంటింటా సంక్షేమ పథకాలు అందించడంతో వారి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్న అవడం ఖాయం అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 06 2024, 06:44

గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్సిపి పాలన.. ఆ.. గ్రామంలో పల్లె నిద్ర చేసిన..వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్సిపి పాలన

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పాలన సాగుతోందని శింగనమల వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారం అనంతరం సిరివరం గ్రామంలో "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు.

ఎస్సీ కాలనీలో స్థానికులతో మమేకమౌతూ వారితో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న ,సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న పరిపాలనలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ను వాడుకొని ఎస్సీ, ఎస్టీ లకు ఉచిత కరెంట్ అందిస్తున్నారని, గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని ఆయన తెలిపారు.

అనంతరం కాలనీలో బస చేశారు.

Venkatesh1

Apr 06 2024, 06:37

సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.. రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రమీల..

సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.. రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రమీల.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్న అందిస్తున్న సంక్షేమ పాలన ఇలానే కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని రాష్ట్ర నాటక అకాడమీ చైర్ పర్సన్ సిహెచ్ ప్రమీల అన్నారు.

శింగనమల మండలం లోలూరు, ఆకులేడు, మదిరేపల్లి, నాగులగుడ్డం, తండా, చిన్న జలాలపురం గ్రామాల్లో వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని ఆమె చేపట్టారు.

ఇంటింటికీ తిరుగుతూ సీఎం జగనన్న అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన భర్త వీరాంజనేయులు గెలిపించాలని ప్రజలను విన్నవించుకున్నారు.

ఆమె మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న గత చరిత్రలో ఎన్నడలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. గత టిడిపి పరిపాలనలో ప్రజలకు ఏమి చేయలేక ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు ఆరోపణ చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలలో అనంతపురం పార్లమెంట్ శంకర్ నారాయణను, అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న వీరాంజనేయులును అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.