దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే.. లోకలైజేషన్ అంటే ఏమిటో తెలుసుకోండి.. అర్థం లేని ఆరోపణలు చేయటం మానుకోండి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే.. లోకలైజేషన్ అంటే ఏమిటో తెలుసుకోండి.. అర్థం లేని ఆరోపణలు చేయటం మానుకోండి.
◆ జియోకు....జీవో కు తేడా తెలుసుకోండి
◆ మరోసారి ప్రజలు టిడిపిని ఇంటికి పంపడం గ్యారెంటీ
ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
శింగనమల చెరువుని లోకలైజేషన్ చేసి ఎన్నో దశాబ్దాల కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదని వీటికి సహకరించి పట్టుబట్టి రైతన్నల కలను సహకారం చేసిన ఘనత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి దక్కుతుందని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
గార్లదిన్నె మండలం ఇల్లూరు,ముంటిమడుగు, ఎం.కొత్తూరు, ఎం.కొత్తపల్లి, రాందాసుపేట, అంకంపేట, సిరివరం, గుడ్డాలపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణ, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, మాజీ ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులు, అనంతపురం డిప్యూటీ మేయర్ కోగటం భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులతో కలసి ఆయన నిర్వహించారు.
గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్దిని ఆయా కుటుంబాలకు వివరించారు. జగనన్న ఇంటి దగ్గరికి అన్ని పథకాలు అందిస్తున్నారని ఇలానే ఈ పథకాలు ఇంటి దగ్గరకు రావాలి అంటే మరోసారి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని మీ ఓటును " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలతో గ్రామాల్లో అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు. శింగనమల చెరువుని లోకలైజేషన్ చేసి రైతన్నల కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగనన్నకు, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి రైతన్నలు కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ అభ్యర్థి అర్థం లేని ఆరోపణలు చేస్తూ జియోకి, జీవోకి తేడా తెలియకుండా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కుల,మత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారో లేదో గ్రామాల్లోకి వెళ్లి అనగాలని సూచించారు.
2014 నుంచి 2019 వరకు ప్రజలు టిడిపి పరిపాలన చూసి విసుగు చెంది 2019లో ఇంటికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా టిడిపిని ఇంటికి పంపడం ఖాయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత జగనన్నకు దక్కుతుందన్న విషయాన్ని వారికి గుర్తు చేశారు. ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడడం మంచిదన్నారు. రానున్న ఎన్నికలలో మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న కూర్చోవడం ఖాయమని, శింగనమలలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 11 2024, 08:10