మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతిద్దాం.. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మళ్ళీ గెలిపిద్దాం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతిద్దాం
జగనన్న సీఎంగా ఉంటేనే సక్రమంగా పథకాలు
"ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మళ్ళీ గెలిపిద్దాం
పొత్తులు పెట్టుకున్న పార్టీలను నమ్మొద్దు
శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని చేరువ చేసిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని వీరాంజనేయులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పుట్లూరు మండలం కందిగోపుల, చింతకుంట, చాలవేముల, రంగరాజుకుంట, కుమ్మనమల, తురకవానిపల్లి, కొండగారికుంట, రంగినేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలసి వీరాంజనేయులు నిర్వహించారు.
గ్రామాల్లో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు ఇలానే సక్రమంగా అందుతాయని రానున్న ఎన్నికలలో మీ అందరి ఓటు "ఫ్యాన్" గుర్తుపై వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతినెల ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వాలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లి అందించే పింఛన్ల పంపిణీని టిడిపి నేతలు అడ్డుకున్నారన్నారు. పేదల ఉసురు చంద్రబాబునాయుడుకు తగలకుండా మానదన్నారు. ఎన్నికలవేళ ప్రజలను మోసం చేయడానికి టిడిపి నేతలు ఇంటి దగ్గరికి వస్తున్నారని వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మంచి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తమ ఓటు ఫ్యాన్ గుర్తుకే అంటున్న వృద్ధులు
తెల్లవారుజామున నిద్రలేవక మునుపే ఇంటి దగ్గరే కుటుంబ పింఛన్ అందిస్తూ వృద్ధులు, వితంతువులు, వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన తమ మనవడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా గెలవలేరన్నారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్న తమలాంటి వృద్ధుల కడుపు కొట్టిన చంద్రబాబుకు మా ఉసురు తప్పకుండా తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 05 2024, 07:13