Venkatesh1

Apr 03 2024, 10:45

ముంటి మడుగు కేశవరెడ్డి కాట్టప్ప గారి రామలింగారెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసి నా గెలుపునకు కృషి చేయాలని కోరిన MP అభ్యర్థి

అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ ) MP అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారు ముంటిమడుగు కేశవరెడ్డి గారి నివాసం లో శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి గారిని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నా గెలుపునకు కృషి చేయాలి అని కోరిన అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి (టీడీపీ -జనసేన -బీజేపీ ) MP అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ గారు*

Venkatesh1

Apr 03 2024, 07:35

ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గెలుపు కొరకు గ్రామాలలో ర్యాలీ నిర్వహించి ప్రచారం చేసిన ఆలం నర్స నాయుడు

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం H సోదనపల్లి, మంగపట్నం గ్రామాలలో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గెలుపు కొరకు గ్రామాలలో ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ వైసీపీ అదికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం అందకారం అయిందని ఒక ఛాన్స్ తో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంను సర్వనాశనం చేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాలేమని రాష్ట్రంలో అప్పుడే హత్యలు, దాడులుకు వైసీపీ పాల్పడుతోందన్నారు. ఏదీ ఏమైనా ఎన్నికలలో టీడీపీదే విజయమన్నారు.వైసీపీ ని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు చిత్తుగా ఓడించాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు.

గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల కుంపటిని చేసారని వచ్చిన నిధలున్ని వైసీపీ నేతలు రంగులు పిచ్చితో టీడీపీ హయంలో నిర్మించిన భవనాలుకు రంగులు వేశారన్నారు.

తమ సొంత పేపరుకు యాడ్స్ రూపంలో ఆస్తిని పెంచడం తప్ప గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు.శిoగనమల నియోజకవర్గం లో ఎక్కడ చేపడుతున్న ప్రచార పర్వంకు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తోంది అని నరసానాయుడు తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 03 2024, 07:24

మీ బిడ్డగా ఆశీర్వదించండి.. సీఎం జగనన్న పాలన అపూర్వం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

మీ బిడ్డగా ఆశీర్వదించండి.. సీఎం జగనన్న పాలన అపూర్వం.. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను మీ బిడ్డగా ఆశీర్వదించి ఓటువేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని వీరాంజనేయులు కోరారు.

నార్పల మండలం చామలూరు, నిలువురాయి, కర్ణపుడికి, కురగానిపల్లి, కేశేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్టీ నాయకులతో కలసి చేపట్టారు.

గ్రామాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్ఛాలు అందజేస్తూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. " ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం నుంచి పొందుతున్న పథకాలు ఏ మేరకు సంతృప్తినిస్తున్నాయి తదితరులు అంశాలు అడిగి తెలుసుకున్నారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ..చివరకు అవ్వాతాతలపై కూడా కుట్రకు పాల్పడిందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో సంక్షేమంతో పాటు పేదప్రజలంతా విద్య, వైద్యానికి దూరమయ్యారన్నారు. వైఎస్ఆర్సిపి పాలన చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్లు, రోడ్లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వంలో చేపట్టినవి కాదా అని టీడీపీని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలలో ప్రజలు మళ్ళీ వైసీపీకి పట్టం కట్టబోతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 03 2024, 07:14

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక.. జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు..

సింగనమల నియోజకవర్గం నార్పల మండలం నిలవురాయి గ్రామంలో టీడీపీ నాయకుడు జనార్దన్ వెంకటేష్ కుటుంబం, కర్ణపుడికి గ్రామంలో టీడీపీ నాయకుడు బుసగాని విశ్వనాథ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు.

జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమానికి ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. 

రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

Apr 02 2024, 09:25

సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్న టీడిపి బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు

సింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో ఎన్నికల ప్రచార నిమిత్తం మేడికుర్తి, నిట్టూరు, పెద్దమల్లెపల్లి ,పీఎం కొండాపురం ,వేములపల్లి గిరమ్మ బావి గ్రామాల్లో పర్యటించి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్న తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు గారు మరియు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మండల కన్వీనర్లు క్లస్టర్ ఇంచార్జిలు యూనిట్ ఇంచార్జిలు బూత్ ఇంచార్జిలు తెలుగుదేశం కార్యకర్తలు మహిళలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Venkatesh1

Apr 02 2024, 06:31

శింగనమలలో పుట్టి పెరిగిన వ్యక్తిని.. ఆశీర్వదించండి.. సేవకుడిగా పని చేస్తా.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

శింగనమలలో పుట్టి పెరిగిన వ్యక్తిని.. ఆశీర్వదించండి.. సేవకుడిగా పని చేస్తా.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

◆ వైఎస్సార్ సీపీది పేదల ప్రభుత్వం

శింగనమల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

గడిచిన 58 నెలల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద, మధ్య తరగతి ప్రజల జీవనస్థితిగతులను మార్చాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండలం గురుగుంట్ల, వెస్ట్ నరసాపురం, చిన్న జలాలపురం, శివపురం, బండమీదపల్లి, చక్రాయపేట, పోతురాజుకాల్వ గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని వైస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన చేపట్టారు.

గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు వివరించారు. సింగనమల పరిధిలోని బండమీద పల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిని కష్టాలను చూసిన వ్యక్తిని మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించుకుంటే నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవకుడిగా పని చేస్తానని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకొని, వారి అవసరాలకు అనుగుణంగా పనిచేసే మనసున్న నేత ముఖ్యమంత్రి వైయస్ జగనన్న మాత్రమే అని కొనియాడారు. సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడుకి పేదలంటే చులకనన్నారు. పేదలకు అందిస్తున్న పింఛన్ ని కూడా రాకుండా చేసి వారి కడుపు కొట్టారన్నారు. గ్రామాల్లోకి వెళుతూ ఉంటే అవ్వ తాతలు రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్దని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని వారు చెబుతున్నారన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబునాయుడు కి ఓటు అనే ఆయుధంతో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 01 2024, 20:38

ఫర్టిలైజర్ దుకాణం యజమాని వీరభద్ర(40) దారుహత్య..

అనంతపురం జల్లా నార్పల మండల కేంద్రంలో ఫర్టిలైజర్

దుకాణం యజమాని వీరభద్ర(40)ను

దారుహత్య.. 

సమీప బంధువులు హత్య చేసినట్టు

సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Venkatesh1

Apr 01 2024, 06:57

ఇంటింటికి కుళాయిల ఏర్పాటు చేసి నీటి సమస్య పరిష్కరిస్తాం... ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు..

శింగనమల నియోజకవర్గం,పుట్లూరు మండలం,తిమ్మాపురం గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శింగనమల నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు,ముంటిమడుగు కేశవరెడ్డి గారు.* *తిమ్మాపురం గ్రామం నందు నీటి సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎన్నోసార్లు ఎంతోమందికి వినతి చేసిన నీటి సమస్య పరిష్కారం చేయలేదు.

ఈరోజు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా బండారు శ్రావణి శ్రీ గారు టిడిపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లినప్పుడు నీటి కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు*.

ఈ సందర్భంగా ప్రజల సమస్యలకు బండారు శ్రావణి శ్రీ గారు స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం ఇసుకను అక్రమ రవాణా చేసి వేల కోట్ల రూపాయలు ఆదాయంగా మలుచుకున్నారే తప్ప,భూగర్భ జలాలు ఇంకిపోతున్న పట్టించుకోలేదు*.

చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే గ్రామాల యందు ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి,నీటి సమస్య పరిష్కారం చేస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది.*

Venkatesh1

Apr 01 2024, 06:47

గార్లదిన్నె మండలం కె కె. తాండ గ్రామంలో "పల్లె నిద్ర" చేసిన.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

నవరత్నాలతో ప్రజల సంక్షేమం మెరుగు..

శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

రాష్ట్రంలో వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలతో ప్రజల సంక్షేమం మెరుగుపడిందని వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం కె కె. తాండ గ్రామంలో "పల్లె నిద్ర" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

స్థానిక ప్రజలతో కలిసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో చేసిన మంచిని ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని జగనన్న నింపుకున్నారన్నారు. ఇలాంటి గొప్ప పాలన మళ్లీ మనకు రావాలి అంటే రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అనంతరం గ్రామంలో బస చేశారు.

Venkatesh1

Apr 01 2024, 06:40

సామాన్యుడిని.. ఆశీర్వదించండి.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

సామాన్యుడిని.. ఆశీర్వదించండి.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి సామాన్య పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ద బాధ్యత అప్పగించారని తనను గెలిపించాలని ఎం. వీరాంజనేయులు కోరారు.

గార్లదిన్నె మండలం ముకుందాపురం, యర్రగుంట్ల, కేకే తాండ, కొట్టాలపల్లి, కామలాపురం గ్రామాల్లో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబుళేసు, మాజీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులుతో కలసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.

గ్రామాల్లోని పార్టీ శ్రేణులు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల లబ్దిని వివరిస్తూ, నిరుపేదను దీవించి "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలను అందజేస్తూ అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని వలంటీర్ల వ్యవస్థతో మన రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించి అగ్రగామిగా నిలిచిందన్నారు. సీఎం జగనన్న పై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. వలంటీర్లపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వా, తాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతారని ఈసీ తన నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. జగనన్న పరిపాలనలో ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాలు అందించడం వల్ల చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఇలాంటి నీచ పనులకు పాల్పడుతున్నారన్నారు. పేదల ఉసురు తగులుతుందన్నారు. ఇలాంటి ఘాతకానికి తలపడుతున్న టిడిపికి ఓటు వేసే ప్రసక్తే లేదని ప్రజలు చెబుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో అసెంబ్లీ స్థానానికి తనకు, ఎంపీ అభ్యర్థి గా శంకర్ నారాయణ కు "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.