ఆదరించండి..గెలిపించండి.. ప్రజాసేవకు పూర్తిగా అంకితం అవుతా.. ప్రజలకు, జగనన్నకు బాధ్యుడినై ఉంటా. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
ఆదరించండి..గెలిపించండి.. ప్రజాసేవకు పూర్తిగా అంకితం అవుతా.. ప్రజలకు, జగనన్నకు బాధ్యుడినై ఉంటా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని, నియోజకవర్గంలోని ప్రజలందరు ఆదరించి..గెలిపించాలని వీరాంజనేయులు అన్నారు.
యల్లనూరు మండలం నీర్జాంపల్లి, లక్షుంపల్లి, దంతలపల్లి, గడ్డంవారిపల్లి, లింగారెడ్డిపల్లి, మల్లాగుండ్ల గ్రామాలలో పార్టీ నాయకులతో కలసి "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని ఆయన చేపట్టారు.
ముందుగా గ్రామాల్లో పార్టీ శ్రేణులు నీరాజనం పలుకుతూ స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ, రానున్న ఎన్నికలలో "ఫ్యాన్ "గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలు అందజేస్తూ అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. నిరుపేదలకు తోడుగా సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేసి చూపిస్తున్న ప్రభుత్వం మనదే అన్నారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలందరికీ కులం, మతం, రాజకీయం చూడకుండా సామాజిక న్యాయం చేసిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్పిన మాట ప్రకారం నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసి చూపించారన్నారు. 2014 లో చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. మళ్లీ అదే విధంగా 2024 లో అధికారంలోకి రావడానికి గతంలో చెప్పిన వాగ్దానాలను పదేపదే ప్రజలకు చెబుతూ మళ్లీ మోసం చేయటానికి వస్తున్నారని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.
Apr 03 2024, 07:24