శింగనమలలో పుట్టి పెరిగిన వ్యక్తిని.. ఆశీర్వదించండి.. సేవకుడిగా పని చేస్తా.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
శింగనమలలో పుట్టి పెరిగిన వ్యక్తిని.. ఆశీర్వదించండి.. సేవకుడిగా పని చేస్తా.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
◆ వైఎస్సార్ సీపీది పేదల ప్రభుత్వం
శింగనమల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
గడిచిన 58 నెలల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద, మధ్య తరగతి ప్రజల జీవనస్థితిగతులను మార్చాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు.
శింగనమల మండలం గురుగుంట్ల, వెస్ట్ నరసాపురం, చిన్న జలాలపురం, శివపురం, బండమీదపల్లి, చక్రాయపేట, పోతురాజుకాల్వ గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని వైస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన చేపట్టారు.
గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు వివరించారు. సింగనమల పరిధిలోని బండమీద పల్లిలో పుట్టి పెరిగిన వ్యక్తిని కష్టాలను చూసిన వ్యక్తిని మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించుకుంటే నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవకుడిగా పని చేస్తానని అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకొని, వారి అవసరాలకు అనుగుణంగా పనిచేసే మనసున్న నేత ముఖ్యమంత్రి వైయస్ జగనన్న మాత్రమే అని కొనియాడారు. సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడుకి పేదలంటే చులకనన్నారు. పేదలకు అందిస్తున్న పింఛన్ ని కూడా రాకుండా చేసి వారి కడుపు కొట్టారన్నారు. గ్రామాల్లోకి వెళుతూ ఉంటే అవ్వ తాతలు రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్దని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని వారు చెబుతున్నారన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబునాయుడు కి ఓటు అనే ఆయుధంతో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 02 2024, 09:25