ఇంటింటికి కుళాయిల ఏర్పాటు చేసి నీటి సమస్య పరిష్కరిస్తాం... ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు..
శింగనమల నియోజకవర్గం,పుట్లూరు మండలం,తిమ్మాపురం గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శింగనమల నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు,ముంటిమడుగు కేశవరెడ్డి గారు.* *తిమ్మాపురం గ్రామం నందు నీటి సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎన్నోసార్లు ఎంతోమందికి వినతి చేసిన నీటి సమస్య పరిష్కారం చేయలేదు.
ఈరోజు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా బండారు శ్రావణి శ్రీ గారు టిడిపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లినప్పుడు నీటి కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు*.
ఈ సందర్భంగా ప్రజల సమస్యలకు బండారు శ్రావణి శ్రీ గారు స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం ఇసుకను అక్రమ రవాణా చేసి వేల కోట్ల రూపాయలు ఆదాయంగా మలుచుకున్నారే తప్ప,భూగర్భ జలాలు ఇంకిపోతున్న పట్టించుకోలేదు*.
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే గ్రామాల యందు ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి,నీటి సమస్య పరిష్కారం చేస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది.*
Apr 01 2024, 20:38