గార్లదిన్నె మండలం కె కె. తాండ గ్రామంలో "పల్లె నిద్ర" చేసిన.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
నవరత్నాలతో ప్రజల సంక్షేమం మెరుగు..
శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
రాష్ట్రంలో వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలతో ప్రజల సంక్షేమం మెరుగుపడిందని వీరాంజనేయులు అన్నారు.
గార్లదిన్నె మండలం కె కె. తాండ గ్రామంలో "పల్లె నిద్ర" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
స్థానిక ప్రజలతో కలిసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో చేసిన మంచిని ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని జగనన్న నింపుకున్నారన్నారు. ఇలాంటి గొప్ప పాలన మళ్లీ మనకు రావాలి అంటే రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అనంతరం గ్రామంలో బస చేశారు.
Apr 01 2024, 06:57