తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 29 2024, 16:03

జగిత్యాల జిల్లాలో నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ శివారులో కళ్యాణ్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పాంటించు కొని ఆత్మహత్య చేసుకు న్నాడు.

గురువారం రాత్రి ఇంట్లో నుండి వెళ్లిన యువకుడు గ్రామ శివార్లలోని కోళ్ల ఫారంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఈరోజు ఉదయం ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు ఆదారాలు సేకరి స్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 29 2024, 16:01

గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఈ వేసవి నుంచి కూలి పెరగనుంది.వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త వేత నం అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వు లు జారీ చేసింది.

దీంతో రోజుకు రూ 272 అందుతున్న కూలి రూ.300 కు పెరగనుంది.ఈ నిర్ణయం తో మండలంలో 11,079 వేల మంది కూలీలకు లబ్ది చేకూరనుంది.అయితే కూలీలకు మూడేళ్ళుగా వేసవి భత్యం ఇవ్వకపోగా ఈసారి కూలి పెంపుతో సరిపెట్టారు.

ఉపాధిహామీ పథకం నిర్వ హణలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొ చ్చింది.ఇప్పటికే సాప్ట్ వేర్ ను పూర్తిగా తన ఆధీనం లోకి తీసుకుని పనిదినాల లక్ష్యాలు కేటాయింపులను పర్యవేక్షిస్తుంది.

పనులకు వచ్చే కూలీల సంఖ్య ఆధారంగా గ్రామం, మండలం, జిల్లా లక్ష్యాలను నిర్దేశిస్తుండగా రాష్ట్ర ప్రభు త్వం మరిన్ని పనిదినాలు పెంచేది.మూడేళ్ళుగా ఈ లక్ష్యాల మేరకు కూలీలకు పనులు కల్పిస్తున్నారు.

ఉపాధిహామీ పథకంలో మార్పు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏటా మాదిరిగానే 2024-25 ఆర్థిక సంవత్స రానికి కూలీల వేతనాలు పెంచుతూ నిర్ణయించిం ది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో రూ.28 కు పెంచింది.

గత సంవత్సరం రూ.15 మాత్రమే పెంచగా ఈసారి ఇంకాస్త ఎక్కువ పెంచగా కొత్త వేతనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 18:52

గండిపేట కార్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవిం చింది.

ఖానాపూర్‌లోని ఓ కార్ల గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగిసిపడటంతో గోదాంలో ఉన్న కార్లన్నీ మంటల్లో తగలబడ్డాయి.

గోదాంలో 25 కార్లు ఉండ గా.. అవన్నీ పూర్తిగా దగ్ధ మయ్యాయి. భారీ మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించిం ది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమా పక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చేం దుకు శ్రమిస్తున్నారు.

కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 12:58

Justice NV Ramana: రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

కృష్ణా జిల్లా: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి (Former Chief Justice) జస్టిస్ ఎన్వీ రమణ ( Justice NV Ramana)కు విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు (Chalasani Anjaneyulu), మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు (Dasari Balavardhana Rao), అమరావతి మహిళలు (Amaravati Womens), రైతులు (Farmers) ఘన స్వాగతం పలికారు..

ఈ సందర్భంగా మాజీ సీజేఐకు అమరావతి రైతులు, మహిళలు.. వినతిపత్రం అందజేశారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ అమరావతి మహిళా రైతులు తమ కష్టాలు చెప్పారని, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన1563 రోజులు నుంచి ఉద్యమం చేస్తున్నామని రైతులు వెల్లడించారన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారని, రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను కూడా వచ్చానని చెప్పారు.

రైతుకు భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని, రైతు భూమి కోల్పోవడం సామాన్యమైన విషయం కాదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రైతులు భూములు ఇచ్చి నేరస్థుల్లా కోర్టులో నిలబడి అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేస్తారని అనుకుంటున్నానన్నారు. వాళ్లకు న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. ఆలస్యం అయినప్పటికీ తప్పక న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాని.. వారి ఉద్యమ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 12:55

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు..

ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలివెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిలప్రియను, టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అఖిలప్రియను పోలీసులు అదులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. వినతిపత్రిం ఇచ్చేందు వస్తే అరెస్ట్ చేయడమేంటని తెలుగు తమ్ముళ్లు పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంవో స్పందించలేదని తెలిపారు. అందుకే నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇద్దామని వచ్చానన్నారు. వినతిపత్రం ఇస్తే శాంతిభద్రతల సమస్య ఎలా అవుతోందని ప్రశ్నించారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 12:54

భర్తను కొట్టి చంపిన భార్య

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఈరోజు దారుణం జరిగింది. భర్తను కట్టేసి కొట్టి చంపింది ఓ భార్య. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో గురువారం జరిగింది.

రోజు తాగి వచ్చితరచు గొడవ చేస్తున్నాడని నెపంతో భర్త హేమంత్ ని చంపింది భార్య రోహితి. పడుకున్న భర్త పై వేడి నీళ్ళు పోసిన భార్య రోహితి….

అనంతరం కొట్టడంతో తీవ్ర గాయాలతో జిల్లా ఆస్పత్రిలో చేరిన తర్వాత భర్త హేమంత్ చికిత్స పొందుతూ తెల్లవారు జామున మృతిచెందాడు. 

కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి లో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తోంది రోహితి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు 3 టౌన్ పోలీసులు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 12:20

మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిబాబు నియామకం

మంథని బార్ అసోసియే షన్ అధ్యక్షుడిగా బుధ వారం కెవిఎల్ఎన్ హరి బాబు ఈ ఎన్నికతో పదవసారి ఎన్నికయ్యారు.

మంథని బార్ అసోసియే షన్ ప్రధాన కార్యదర్శిగా ముస్కుల సహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రఘోతం రెడ్డి, సహాయ కార్యదర్శిగా విజయ్ కుమార్, కోశాధి కారిగా అంజనేయులు, లైబ్రరీ కార్యదర్శిగా ఆర్ల నాగరాజు, సాంస్కృతిక కార్యదర్శిగా కటకం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 28 2024, 11:28

రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య

బాసర రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య కలకలం లేపింది.బుధవారం రాత్రి నాగర్సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే ట్రైన్ కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడింది.

మృతురాలు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువతిగా గుర్తించారు. నిషిత డిగ్రీ కాలేజీలు చదువుతున్నట్లు ఐడి కార్డు ద్వారా తెలుస్తోంది.

మృతుడి వివరాలు తెలియ రావడం లేదు. రైల్వే పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొ ని మృతదేహాలను స్వాధీ నం చేసుకొని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 18 2024, 10:44

ప్రధాని మోడీపై ఈసీ కి ఎంపీ ఫిర్యాదు

ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్నికల సంఘానికి TMC రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే సోమవారం ఫిర్యాదు చేశారు.

రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉప యోగించి, ఎన్నికల నియ మావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.

ప్రధాని మోదీపై తాను చేసిన ఫిర్యాదు కాపీని గోఖలే సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ కారణంగానే 1975లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించినట్లు గుర్తు చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 18 2024, 10:42

రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది.

నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం దిలో ముగ్గురికి ఈడీ నోటీ సులు ఇచ్చింది.

సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేయడంతో పాటు మద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై వారిని ప్రశ్నించనున్నట్లు సమా చారం.

కాగా కవిత అరెస్టును సవాల్‌ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు.