రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది.

నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం దిలో ముగ్గురికి ఈడీ నోటీ సులు ఇచ్చింది.

సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేయడంతో పాటు మద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై వారిని ప్రశ్నించనున్నట్లు సమా చారం.

కాగా కవిత అరెస్టును సవాల్‌ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు.

నేడు జగిత్యాలలో విజయ సంకల్ప సభ: హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

తెలంగాణ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు జగిత్యాలలో జరగనున్న విజయ సంకల్ప సభకు హాజరు కానున్నారు. జగిత్యాలలోని గీతా విద్యా లయ గ్రౌండ్‌లో ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్త య్యాయి.

ఉదయం 11.15 గంటలకు జగిత్యాలకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సభలో మోడీ పాల్గొననున్నారు.

సభ అనంతరం హైదరా బాద్ చేరుకుని మోడీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ సభ సందర్భంగా బందోబస్తుకు 1600 మందిని పోలీసులు మోహరించారు..

ముఖ్యమంత్రి నుదిటి పై గాయం :ఆస్పత్రికి తరలింపు

పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ గురువారం సాయంత్రం ప్రమాదానికి గురయ్యారు. ఆమె నుదిటిపై తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో ముఖ్యమంత్రిని హుటాహుటిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఆమె నుదుటిపై గాటు పడగా, ముఖంపై రక్తం కారుతున్న దృశ్యా లను ఆ ఫొటోలో కనిపించాయి.

మమత ఇంట్లో గాయపడ్డా రని తెలుస్తోంది. వెంటనే కోల్‌కతాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మమతా బెనర్జీకి పెద్ద గాయమైందని.. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు టీఎంసీ ఎక్స్‌లో పేర్కొంది.

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో స్పల్ప భూప్రకంపనలు

ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్పల్పంగా భూప్రకంపనలు సంభవించాయి.

నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాలలో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచే సుకున్నాయి

తిరుపతి జిల్లాలోని దొరవారిసత్రంలో భూమి కంపించింది. రెండు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.

దీంతో ప్రజలు భయాం దోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఈ భూప్రకంపనలపై ఆరా తీస్తున్నారు...

సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫి కేషన్‌ విడుదలైంది.

వీటిలో ఈఅండ్‌ఎం మేనేజ్‌ మెంట్‌ ట్రైనీ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌ లో 42, మేనేజ్‌ మెంట్‌ ట్రైనీ సిస్టమ్స్‌,లో 07, జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌ ట్రైర్‌ గ్రేడ్‌ సీ – 100, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ గ్రేడ్‌ సీ – 24, ఫిట్టర్‌ ట్రైనీ కేటగిరీ -1లో 47, సింగరేణిలో ఎలక్ట్రిషియన్‌ ట్రైనీ కేటగిరీ – 98 పోస్టులు ఉన్నాయి.

ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్‌ 15 నుంచి మే 4వ తేదీ లోపు http://www. scclmines.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సంస్థ సూచించింది.

గ్రూప్‌ - 1 దరఖాస్తుల గడువు పొడిగింపు

TS PSC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 దరఖాస్తుల గడువును మరో రెండు రోజులు పొడిగిం చింది.

షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితో గడువు ముగియనుండగా ఈ గడువును పెంచింది. కాగా ఇప్పటివరకు 2.7లక్ష లకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

అయితే గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య భారీగా తగ్గడం గమనార్హం.

డీఎస్సీ విద్యార్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

డీఎస్సీలో భాగంగా ఎస్జీటీ ఉచిత శిక్షణ, స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణకు దరఖాస్తు లను మార్చి 22 వరకు సమర్పించాలని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ సంచాల కులు డాక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్, జగి త్యాల, పెద్దపల్లి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈరోజు నుంచి మార్చి 22 వరకు www. tsbcstudycircle. cgg. gov. in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు...

తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి : పరీక్షకు హాజరైన విద్యార్థిని

ఇంటర్మీడియట్ పరీక్షలు.

 విద్యార్థులకు తొలి మెట్టే ఈ పరీక్షలు. ఎంతో కష్టపడి చదివితే తప్ప పరీక్షల్లో పాస య్యే అవకాశం ఉండదు. ఎంతో ఒత్తిడిని తట్టుకుని పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. పరీక్షలు బాగా రాయండి అంటూ పిల్లలకు తల్లిదం డ్రుల ఆశీర్వాదం. ఇది ఎప్పుడు జరిగే తంతే. అయితే తాజాగా..

ఈరోజు ఇంటర్ పరీక్షలు ముగియనుండగా కూతుర్ని తీసుకురావడానికి ములుగు జిల్లా నుండి భూపాలపల్లి జిల్లాకు బయలుదేరిన ఓ తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించింది.

ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన రెంటాల సౌమ్య భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోని దామరకుంట సోషల్ వెల్ఫేర్ కాలేజీలో Bipc సెకండ్ ఇయర్ చదువుతుంది .

ఈరోజు అమ్మ వస్తుందన్నా సంతోషంలో కూతురు రొంటాల సౌమ్య కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఈరోజు పరీక్ష రాయడానికి వచ్చింది.

అమ్మ ఇక లేదు రాదు అన్న విషయం తెలియక అమ్మ నా కోసం వస్తుంది అనే సంతోషంలో పరీక్ష పూర్తి చేసింది.

పరీక్ష ముగియగానే పరీక్ష హాల్లో నుండి సంతో షంలో బయటకు వచ్చిన తర్వాత ఆమె కాస్ టీచర్ తో ఈరోజు పరీక్ష బాగా రాశాను మేడం అంటూ నవ్వుతూ చెప్పింది.

 అంతకు ముందు నుండే పరీక్ష హాలు బయట ఆమె బంధువులు ఉండి విద్యార్థిని ని తీసుకుపో వడాన్ని గమనించిన తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

PM Modi: రేపు సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో

హైదరాబాద్: పార్లమెంట్ (Parliament) ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)కు రానున్నారు..

పది రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. మూడు రోజుల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో (Road Show) నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు (BJP Leaders) రోడ్ షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో 1.3 కి.మీ. మేర ప్రధాని రోడ్ షో జరుగుతుంది. అలాగే 16న (శనివారం) నాగర్‌కర్నూల్‌లో మోదీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 18న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు..

TSPSC: ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్

Group-1: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో (గురువారం) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు గత నెల 19న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది..

ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను టీఎస్పీఎస్సీ స్వీకరిస్తోంది. అయితే, ఇప్పటి వరకు 2.7 లక్షలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు TSPSC అధికారులు వెల్లడించారు..

కాగా, గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇక, ఇవాళే.. చివరి రోజు కాబట్టి ఒక్క రోజులో ఎంతలేదన్నప్పటికీ మరో 50 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది..