ముఖ్యమంత్రి జగనన్న ఎంపిక చేసిన అభ్యర్థి ఎం. వీరాంజనేయులును గెలిపించుకుందాం..రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..

సీఎం జగనన్న పాలనలో ప్రతి గడపకు మేలు.

-ముఖ్యమంత్రి జగనన్న ఎంపిక చేసిన అభ్యర్థి ఎం. వీరాంజనేయులును గెలిపించుకుందాం.

-ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉందాం.

◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.

-కలసికట్టుగా పార్టీ కోసం పని చేద్దాం.. జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం.

◆ శింగనమల వైస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

ప్రతి గడపకు మేలు చేస్తున్న సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆలూరు సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు పిలుపునిచ్చారు.

నార్పల మండల కేంద్రంలోని కాలనీలలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పర్యటించారు.

ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా ఆలూరు సాంబ శివారెడ్డి.. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కుల వృత్తులకు జగనన్న  ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వారి వర్గానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారని వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

పార్టీలకతీతంగా ప్రజలు ఏ పార్టీకి ఓటేశారో కూడా చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన జగనన్న ఎన్నికల గుర్తు 'ఫ్యాన్' పేద ప్రజల గుండెచప్పుడు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ పార్టీ తరుపున వీరాంజనేయులును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

 వీరాంజనేయులు మాట్లాడుతూ, ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి పథంలో నిలువాలన్న లక్ష్యంతో జగనన్న అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి మరింత ఎక్కువ జరగాలంటే  జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవటానికి మనమందరం కలిసికట్టుగా పని చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమాలను మరింత దగ్గర చేయడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికలలో మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్సీపీ తోనే సాధ్యం.. సింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.

సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్సీపీ తోనే సాధ్యం.. సింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..

రాష్ట్రంలో వైస్సార్సీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని వీరాంజనేయులు అన్నారు.

శింగనమల మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.

కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..సీఎం జగనన్న పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి అందించారని అందుకే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నామన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలతోపాటు చెప్పనివి కూడా చేసి చూపించారన్నారు. చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిస్థాయిలో నెరవేర్చాడా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ పథకాలు అందాలంటే గతంలో అధికారుల చుట్టూ తిరిగేవారన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చాక ఇంటి దగ్గరికే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని రాబోయే ఎన్నికలలో ప్రజలు వైఎస్సార్సీపీ కి ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగనన్నను మరోసారి చేసి వారికి సరైన బుద్ధి చెబుతారన్నారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పేదల సొంతింటి కల తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..

పేదల సొంతింటి కల తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..

ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల తీర్చడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఆలూరు సాంబ శివారెడ్డి, శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు.

జగనన్న రిజిస్ట్రేషన్‌ చేయించిన ఇంటి స్థలం హక్కు పత్రాలను  స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి వారు లబ్ధిదారులకు అందజేశారు.

సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ పథకం ద్వారా పేదలకు సొంతిళ్లు ఉండాలనే అభిలాషతో ప్రతి పేద కుటుంబానికి ఒకటిన్నర సెంటు భూమిని ఉచితంగా ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించిందన్నారు. 

మండల వ్యాప్తంగా సుమారు 1,855 మందికి స్థలాలు ఇవ్వగా, వాటిలో ప్రస్తుతం1,159 మందికి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ హక్కు పత్రాలను అందిస్తున్నామన్నారు. ఈ పత్రాలు శాశ్వత భూహక్కు పత్రాలుగా చెలామణి అవుతాయన్నారు. ఈ హక్కు పత్రాలపై బ్యాంకు రుణాలు పొందవచ్చునని లేదా విక్రయించుకోవచ్చన్నారు. దీనిపై లబ్ధిదారునికి పూర్తి హక్కును కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతుందన్నారు.

పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పిన చంద్రబాబు తన ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ మోసం చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు వస్తున్నాడని ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే రాబోయే ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామన్నారు. సమన్వయకర్త ఎం. వీరాంజనేయులును మీరందరూ ఆశీర్వదించి మరోసారి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు జగనన్న ఆర్థిక చేయూత: ఆలూరు సాంబ శివారెడ్డి..

బాధిత కుటుంబాలకు జగనన్న ఆర్థిక చేయూత: ఆలూరు సాంబ శివారెడ్డి..

ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి అన్నారు.

అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని బాధిత కుటుంబాలకు ఆలూరు సాంబ శివారెడ్డి, సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

బాధిత కుటుంబాలు, వారి ఆర్థిక సమస్యలను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దృష్టికి తీసుకురావటంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 17 కుటుంబాలకు రూ.25.31 లక్షలు మంజూరు చేయించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ఆలూరు సాంబ శివారెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

దుర్గం గ్రామం అంగనవాడి సెంటర్ నందు పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ సాకే రామాంజనేయులు..

నార్పం మండలం శిద్ధరాచర్ల గ్రామపంచాయతీ దుర్గం గ్రామం  అంగనవాడి సెంటర్ నందు పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ సాకే రామాంజనేయులు పాల్గొని పలుగుపిల్లలకి పోలియో చుక్కల మందును వేయడం జరిగినది

 ఈ సందర్బంగా సర్పంచు రామాంజినేయులు మాట్లాడుతు తమపిల్లలు ఆరోగ్యంగా ఉన్న ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది

  పుట్టిన పిల్లలనుండి5 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలకు పోలియో రాకుండా నివారించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమం దేశంవ్యాప్తంగాచెపట్టడం జరిగిందని అన్ని ఆసుపత్రులలోను బస్సుస్టేషన్లలోను రైల్వే స్టేషన్లలోను వేయ్యబడతాయి అందులో భాగంగా ఆదివారం అందరు పోలియో చుక్కలు వారి పిల్లలకు తప్పకుండా పిల్లలందరికి వారి తల్లులు నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించి పిల్లలకు పోలియో రాకుండ నివారించి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డుమెంబర్ కురవ ఉజ్జినప్ప వైద్యసిబ్బంది అమృతాంజలి .శివకూమార్ MLHP పరిదాబానుఏఎన్ఎం , అంగన్ వాడి టిచర్లు బాలమ్మ సువర్ణ.తృనిత రాధ లు ఆయాలు సాకేపెద్దక్క గంగమ్మ దేవక్క ఆశావర్కర్లు వీరణారాయణమ్మ అంజలి సునిత గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

పల్స్ పోలియో కేంద్రంలో పిల్లలకు పోలి చుక్కలు వేస్తున్న ఎంపీపీ దాసరి సునీత ..

బుక్కరాయసముద్రం గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల యందు ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కేంద్రంలో పిల్లలకు పోలి చుక్కలు వేస్తున్న ఎంపీపీ దాసరి సునీత గారు ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి దామోదరమ్మ గారు సి హెచ్ ఓ గారు ఏఎన్ఎంలు అంగన్వాడి కార్యకర్తలు వైసిపి నాయకులు బుల్లెట్ నారాయణస్వామి గారు పాల్గొన్నారు బుక్కరాయసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలలోనూ అంగన్వాడి కేంద్రాలలోనూ మరియు పంచాయతీ ఆఫీసుల దగ్గర పల్స్ పోలియో చుక్కలు నిర్వహించడం జరిగింది 4213 మంది పిల్లలకు గాను 4176 పిల్లలకు పల్స్ పోలియో చుక్కలం వేయడం జరిగింది 99.12% శాతం మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది మిగతా పిల్లలకు రేపటి నుంచి ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని వైద్యాధికారిని తెలియజేశారు

రైతులను ప్రోత్సహించడానికి రాతి దూలం పోటీలు.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి...

రైతులను ప్రోత్సహించడానికి రాతి దూలం పోటీలు.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.

గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామం పామిడి పెన్నానది సమీపంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ క్షేత్రపాల కొండ శింగరప్ప స్వామి తిరుణాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్యయకర్త ఎం. వీరాంజనేయులు స్వామి వారిని దర్శించుకున్నారు.

గ్రామస్తుల ఆధ్వర్యంలో రాతి దూలం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సాంబ శివారెడ్డి, వీరాంజనేయులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులను ప్రోత్సహించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దుల రాతి దూలం పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు.

గతంలో కల్లూరు నుంచి కొండపై కొలువైన సింగరప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దృష్టికి తీసుకురావడంతో ఆమె వెంటనే స్పందించి నూతనంగా తారురోడ్డు నిర్మించారన్నారు.

కొండపైకి రోడ్డు నిర్మించడంతో గ్రామస్తులు భక్తులు ఎమ్మెల్యే దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ జెడ్పి సీఈవో శ్రీమతి వైఖోమ్ నిదియ దేవి..

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ జెడ్పి సీఈవో  శ్రీమతి వైఖోమ్ నిదియ దేవి గారు, చెదుళ్ల గ్రామపంచాయతీలో ప్రారంభించడం జరిగింది, అలాగే బుక్కరాయసముద్రం ఎంపీపీ స్కూల్ దగ్గర మండల ప్రజా పరిషత్ చైర్మన్ దాసరి సునీత గారు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, అలాగే బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీ నందు ఉన్న అంగన్వాడి సెంటర్ నందు గ్రామ సర్పంచ్ కుమారి పార్వతి గారు ప్రారంభించడం జరిగింది, ఈ పల్స్ పోలియో సందర్భంగా మొబైల్ టీం సెంట్రల్ యూనివర్సిటీలో నూతన బిల్డింగ్ నిర్మాణ కార్యక్రమం కొరకు వచ్చిన కార్మికుల పిల్లలకు వైద్యాధికారి డాక్టర్ స్వాతి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది, అలాగే మకరసముద్రం గాంధీనగర్ అంగన్వాడి సెంటర్ నందు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మన్నేరు కొండమ్మ గారు ప్రారంభించడం జరిగింది , ప్రాథమిక ఆరోగ్యక కేంద్ర పార్టీలో ఉన్న అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు హెల్త్ విన్న సెంటర్ ల నందు ప్రజాప్రతినిధులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది

ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయల విరాళం..

శింగనమల నియోజకవర్గం

ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయల విరాళం..

 

శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి శ్రీమతి ముంటిమడుగు కాంతమ్మ & కీర్తి శేషులు ముంటిమడుగు ఎల్లారెడ్డి కుమారులు ముంటిమడుగు శ్రీకాంత్ రెడ్డి, ముంటిమడుగు కేశవరెడ్డి, ముంటిమడుగు శ్రీనివాస్ రెడ్డి అక్షరాల 111116 లక్ష పదకొండువేల నూట పదహారు రూపాయలు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో కేశవాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు శ్రీరాములు, సువర్ణమ్మ, జన్నె కృష్ణయ్య ,సద్దల నాగరాజు, మాజీ సర్పంచ్ నల్లప్ప, హరిజన నాగన్న, బందెల నాగరాజు, దాసరి వెంకటేశు, సద్దల వెంకటరాముడు, జన్నే పెద్ద అది నారాయణ, మందమీద సుబ్బన్న, క్లస్టర్ ఇంచార్జ్ అంజి, తదితరులు పాల్గొన్నారు.

హలో వికలాంగ్ చలో అమరావతి మార్చ్ 9న తరలిరండి.. ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజనేయులు

హలో వికలాంగ్ చలో అమరావతి మార్చ్ 9న తరలిరండి.. ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజనేయులు పిలుపు

ఈరోజూ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రము మండల కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఉన్న వికలాంగులు ఈనెల9న మన రాష్ట్రంలోని వికలాంగుల సమస్యలపై మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఆవరణ దగ్గర వికలాంగుల మహాగర్జన చేయాలని సంకల్పించిన మందకృష్ణ మాదిగ వికలాంగుల డిమాండ్లను ఈరాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల అందరి కోసం జరుగుతున్నటువంటి ఈ మహాసంగ్రామానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది వికలాంగులు పాల్గొని ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేకులకుంట రామాంజనేయులు కొండన్న నారాయణ మల్లేష్ కాసెప్ప నాగేష్ తదితరులు పాల్గొని పిలుపునిచ్చారు