ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు పేర్కొన్నారు.

గత అక్టోబర్‌లో నిజామా బాద్ పర్యటనలో ప్రధాని 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభిం చిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ పవర్‌ ప్లాంట్‌తో తెలంగాణ ప్రజల గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ అవసరాలను తీరనున్నాయని కిషన్‌ రెడ్డి తెలిపారు.

మార్చి 4న ప్రారంభోత్సవం కానుంది. రూ.11వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా 1600 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీరుతాయని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వివరించారు.

తెలంగాణ ప్రజల విద్యుత్ సమస్యలు తీరడమే కాకుండా, రైతులకు, వాణిజ్య అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం అవుతుందని మంత్రి అన్నారు.

తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు క్రింద 1,600 మెగావాట్ల(2800 MW) సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లను మొదటి విడత (ఫేజ్-I) లో భాగంగా, 2,400 మెగావాట్ల(3800 MW) సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్లను రెండవ విడత (ఫేజ్-II) లో భాగంగా...

పెద్దపల్లి జిల్లా రామ గుండంలో ఏర్పాటు చేయాలని NTPC నిర్ణయం తీసుకుందని. ప్రధాని చొరవతో మొదటి విడత 1600 మెగావాట్ల విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

సూపర్ పోలీస్

2 కిలోమిటర్లు భూజాన మోసుకెళ్ళి ప్రాణాలు ‌కాపాడిన పోలీసు వివరాలు ఇలా ఉన్నాయి..

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ఈరోజు కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవ పడి పొలం వద్దకి వెళ్ళి పురుగుల మందు త్రాగాడు.

అది గమనించిన రైతులు 100కి‌ సమాచారం ఇవ్వగా బ్లూకోర్ట్ సిబ్బంది జయపాల్ అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ ని తన భూజాలపై వేసుకొని పొలాల గట్ల వెంబడి 2 కిలోమీటర్ల మోసుకొని గ్రామంలోకి వెళ్ళాడు.

జమ్మికుంట ఆసుపత్రి కి తరలించగా సురేష్ కి‌ చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

వైసీపీలో చేరిన IAS అధికారి

కర్నూల్ మాజీ కలెక్టర్ ఇంతియాజ్ ఈ రోజు వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇటీవల వీఆర్ఎస్ కు దర ఖాస్తు చేసుకోగా ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఇంతియాజ్ స్వస్థలం కర్నూల్ జిల్లాలోని కోడమూరు. అయితే ఇంతియాజ్ ను కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది.

ఆయనకు ఉన్న పరిచయా లతో గెలవగలరు అని వైసీపీ భావిస్తోంది...

ఉద్యోగం కోసం మాజీ మహిళ హోంగార్డు ఆమరణ దీక్ష

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మాజీ మహిళ హోంగార్డు మామిడి పద్మ గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

తొలగించిన తన హోంగార్డ్ ఉద్యోగం తనకు ఇప్పించా లని ప్రభుత్వానికి, ఉన్నత అధికారులకు గత కొన్ని రోజులుగా వివిధ రూపాలుగా నిరసనలు, ఆందోళనలతో పాటు ప్రభుత్వాన్ని వేడుకుంటు న్నారు.

తన కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి,అనారోగ్యం దృష్ట్యా కొద్దిరోజులుగా ఉద్యోగం రాలేకపోయానని నాపై దయ తలచి పోలీసు అధికారులు తనకు ఉద్యోగం ఇప్పించాలని పద్మ వేడుకుంటుంది....

సిద్దిపేట జిల్లాలో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు

 సిద్దిపేట జిల్లాలో బుధ వారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 92 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

జిల్లావ్యాప్తంగా 44 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం విద్యా ర్థులకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు జరిగింది. సెట్‌ ఏ ప్రశ్న పత్రాన్ని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

జిల్లావ్యాప్తంగా 11,039 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10,328 (94 శాతం) మంది హాజరు కాగా. 711 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్‌ విద్యార్థులకు సంబంధించి 8864 మందికి గాను 8419 మంది (95 శాతం) హాజరు కాగా 95 మంది గైర్హాజరయ్యారు.

ఒకేషనల్‌ విద్యార్థులకు సంబంధించి 2175 మందికి గాను 1909 మంది (88 శాతం) హాజరు కాగా 88 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రగతి ఒకేషనల్ కళాశాల, న్యూ జెనరేషన్ కళాశాల, ఎన్సాన్ పల్లి టీఎస్ డబ్ల్యూఆర్ జే సీ కళాశాల పరీక్షా కేంద్రాలను డీఐఈవో సూర్య ప్రకాష్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.

అదే విధంగా పోలీస్ కమిషనర్ డా. బీ అనురాధ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను సందర్శిం చి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో 40 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

రెవెన్యూ శాఖలో మరో భారీ కుదుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 40 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీవో స్థాయి అధికారులకు పెద్దగా పనులేం లేవన్న అభిప్రా యం నెలకొన్నది. కానీ ఇప్పుడీ బదిలీల తీరును బట్టి త్వరలోనే భూ పరిపాలనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయని సమాచారం.

దీర్ఘకాలికంగా ఒకే చోట పని చేస్తోన్న వారిని, ఆరోపణలు ఎదుర్కొన్న వారికి స్థానచ లనం లభించింది. అలాగే ఇద్దరిని హెచ్ఎం డీఏలోకి తీసుకోవడం గమనార్హం. ఇంకొందరిని భూ సేకరణ బాధ్యతలు అప్పగించారు.

వెయిటింగ్‌లో ఉన్న వారిని కూడా అకామిడేట్ చేయడం గమనార్హం. ఈ బదిలీ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

మెట్ పల్లి జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామ శివారులోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పట్టుకున్నట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.

గోదావరినది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి రెండు ట్రాక్టర్లు పట్టుకొని స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై కిరణ్ తెలిపారు..

చేపల మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్సీ

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల చేపల మార్కెట్ ను కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం పరిశీలించారు.

అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావా లన్నారు.

చేపల మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా అని అయన హామీ ఇచ్చారు.

శ్రీకాకుళంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే టార్గెట్‌గా ప్రతిపక్ష టీడీపీ కదలి రా సభలు నిర్వహి స్తోంది.

ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా ఈ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళంలోని ఎనభై అడుగుల రోడ్డులో ఈ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

పార్టీ శ్రేణులతో పాటు సుమారు లక్ష మంది ప్రజలు సభకు హాజరయ్యేలా టీడీపీ ప్లాన్ చేసింది. అయితే 2013లో ఇదే స్థలంలో చంద్రబాబు ఆఖరి సభను ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు.

ప్రస్తుతం అదే స్థలంలో మళ్లీ సభను ఏర్పాటు చేయడం తో.. రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారనే సెంటిమెంట్‌తో టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు సభ ప్రారంభమై.. సాయంత్రం ఐదున్నర గంటలకు పూర్తవుతుందని టీడీపీ శ్రేణులు తెలిపారు.

హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు

హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటి స్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరుకానున్నారు.

జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషద పరికరాల ప్రోత్సహకాలపై చర్చలు జరపనున్నారు.

తెలంగాణలో వెలుగులోకి మరో కుంభకోణం.. రైతుబంధు, రైతుబీమా నిధులు గోల్‌మాల్‌ ఈ అంశాలపై పరిశోధన చేస్తున్న స్టార్ట్ అప్ సంస్థలకు ప్రోత్సహకాలు, చేయూతపై కీలక నిర్ణయలు తీసుకో నున్నారు.

నేటి నుంచి మూడు రోజుల పాటు బయో ఆసియా సదస్సు జరగనుంది. ఇక, ఈ సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాను న్నారు.

ఈ సదస్సులో రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించను న్నారు.