తెలంగాణలో 40 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

రెవెన్యూ శాఖలో మరో భారీ కుదుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 40 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీవో స్థాయి అధికారులకు పెద్దగా పనులేం లేవన్న అభిప్రా యం నెలకొన్నది. కానీ ఇప్పుడీ బదిలీల తీరును బట్టి త్వరలోనే భూ పరిపాలనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయని సమాచారం.

దీర్ఘకాలికంగా ఒకే చోట పని చేస్తోన్న వారిని, ఆరోపణలు ఎదుర్కొన్న వారికి స్థానచ లనం లభించింది. అలాగే ఇద్దరిని హెచ్ఎం డీఏలోకి తీసుకోవడం గమనార్హం. ఇంకొందరిని భూ సేకరణ బాధ్యతలు అప్పగించారు.

వెయిటింగ్‌లో ఉన్న వారిని కూడా అకామిడేట్ చేయడం గమనార్హం. ఈ బదిలీ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

మెట్ పల్లి జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామ శివారులోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పట్టుకున్నట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.

గోదావరినది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి రెండు ట్రాక్టర్లు పట్టుకొని స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై కిరణ్ తెలిపారు..

చేపల మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్సీ

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల చేపల మార్కెట్ ను కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం పరిశీలించారు.

అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావా లన్నారు.

చేపల మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తా అని అయన హామీ ఇచ్చారు.

శ్రీకాకుళంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే టార్గెట్‌గా ప్రతిపక్ష టీడీపీ కదలి రా సభలు నిర్వహి స్తోంది.

ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా ఈ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళంలోని ఎనభై అడుగుల రోడ్డులో ఈ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

పార్టీ శ్రేణులతో పాటు సుమారు లక్ష మంది ప్రజలు సభకు హాజరయ్యేలా టీడీపీ ప్లాన్ చేసింది. అయితే 2013లో ఇదే స్థలంలో చంద్రబాబు ఆఖరి సభను ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు.

ప్రస్తుతం అదే స్థలంలో మళ్లీ సభను ఏర్పాటు చేయడం తో.. రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారనే సెంటిమెంట్‌తో టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు సభ ప్రారంభమై.. సాయంత్రం ఐదున్నర గంటలకు పూర్తవుతుందని టీడీపీ శ్రేణులు తెలిపారు.

హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు

హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటి స్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరుకానున్నారు.

జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషద పరికరాల ప్రోత్సహకాలపై చర్చలు జరపనున్నారు.

తెలంగాణలో వెలుగులోకి మరో కుంభకోణం.. రైతుబంధు, రైతుబీమా నిధులు గోల్‌మాల్‌ ఈ అంశాలపై పరిశోధన చేస్తున్న స్టార్ట్ అప్ సంస్థలకు ప్రోత్సహకాలు, చేయూతపై కీలక నిర్ణయలు తీసుకో నున్నారు.

నేటి నుంచి మూడు రోజుల పాటు బయో ఆసియా సదస్సు జరగనుంది. ఇక, ఈ సదస్సుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాను న్నారు.

ఈ సదస్సులో రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించను న్నారు.

సూక్మా జిల్లాలో ఎన్ కౌంటర్

ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌం టర్‌లో నక్సలైటు హతమై నట్లు తెలిసింది.

బుర్కలంక గ్రామం సమీపాన శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. సంఘటన ప్రదేశం నుంచి నక్సల్ మృతదేహాన్ని, మజిల్ లోడింగ్ గన్‌ను స్వాధీనం చేసుకున్నామని సుక్మా ఎస్‌పి కిరణ్ జి చావన్ చెప్పారు.

నక్సల్ వివరాలు ఇంకా తెలియవలసి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు సాగుతోందని తెలిపారు.

సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్లు

రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

పదోన్నతుల ఫైల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయడంతో ఉత్తర్వులు వెలువడాయి.

ఐజీ స్టీఫెన్ రవీంద్ర కు అడిషనల్ డీజీపీగా పదోన్నతి కల్పించారు. హైదరాబాద్ క్రైమ్స్ లో డిఐజి గా పనిచేస్తున్న ఏవి. రంగనాథ్ కు, సి ఏ ఆర్ లో డిఐజిగా పనిచేస్తున్న వి.సత్యనారాయణ, రామగుండం సిపి గా పని చేస్తున్న ఎం. శ్రీనివాస్, ఎస్ఐబి చీఫ్ గా పని చేస్తున్న బడుగుల సుమతి, టూరిజం ఎండిగా పనిచేస్తున్న రమేష్ నాయుడు, ఇంటలిజెన్స్ లో డీఐజీ గా పనిచేస్తున్న కార్తికేయ లకు ఐజిగా పదోన్నతి కల్పిస్తూ యధా స్థానంలో పనిచేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు.

డీఐజీలుగా పనిచేస్తున్న న్యాలకొండ ప్రకాష్ రెడ్డి, జోయల్ డేవిస్ లకు సూపర్ టైమ్ స్కేల్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు...

Tulasi Reddy: తాలిబన్‌ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారు..

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారని, సీఎంకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వార్తలు రాసినా దాడులు చేయిస్తున్నారని, ఇంత అనాగరికమైన చర్యలకు ముఖ్యమంత్రే బాధ్యడని ఏపీసీసీ నేత తులసి రెడ్డి (Tulasi Reddy) అన్నారు..

ఈ సందర్బంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జగన్ ప్రతి పక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను చంపాలన్నారని, తరువాత తనపై విమర్శలు చేస్తే కొట్టండంటూ పిలుపు ఇచ్చారని, మొన్న చొక్కా మడత పెట్టి కార్యకర్తలను రెచ్చ గొట్టారని, తాలిబన్‌ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారని మండిపడ్డారు..

ఆంధ్రజ్యోతి (Andhrajyothy), ఈనాడు (Eenadu) విలేకరులపై దాడి హేయమైన చర్య అని, సీఎంగా ఉంటూ దాడులను ప్రోత్సహిస్తూ రెచ్చ గొడుతున్నారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అరాచక వ్యక్తిని ప్రజలు ఓడించాలని పిలుపిచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన తెలుగు భాష వైభవంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. మాతృ భాషను మృత భాషగా మారుస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన తెలుగు భాషకు పూర్వ వైభవాన్ని తేవాలన్నారు. భవిష్యత్తు తరాలకు తెలుగులో ఉన్న కమ్మదనం గురించి చెప్పాలని, తెలుగు నేర్పమంటే... ఇంగ్లీషు వద్దా అని వాదించే మూర్ఖులు ఉన్నారని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు..

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్

పాకిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది.

సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్ (పిఎంఎల్- నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)ల మధ్య ఒప్పందం కుదిరింది.

ఈ మేరకు పిఎంఎల్-నవాజ్ పార్టీ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవిని, పిపిపి కో చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షతన పదవిని చేపడతారు.

దాదాపు 100కుపైగా నియోజకవర్గాల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించినా, వారు విఫలమయ్యారని షరీఫ్ చెప్పారు.

తమ సంకీర్ణ ప్రభుత్వానికి ముత్తహీద క్వామీ మూవ్ మెంట్- పాకిస్తాన్, పాకిస్తాన్ ముస్లింలీగ్, ఇష్టెకామ్ ఏ పాకిస్తాన్ పార్టీల మద్దతు ఉంటుందన్నారు...

500కే గ్యాస్ సిలిండర్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్‌పై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఈ రెండు పథకాలను త్వర లోనే ప్రారంభించ నున్నట్లు చెప్పారు.

అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.త్వరలోనే రెండు గ్యారంటీలు అమలు

అందుకు కసరత్త

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచారు. తాజాగా.. మరో రెండు గ్యారంటీల అమలకు రెడీ అయ్యారు. ఈ మేరకు రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు.

తాజాగా.. ఈ పథకాల అమలుపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించేవారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని చెప్పారు. గ్యాస్‌ సిలిండర్‌కు రూ.500 రాయితీ ఇస్తామని అన్నారు. అందుకు సంబంధిన కసరత్తు జరుగుతోందని త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు.