శ్రీ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మార్క అనిల్ గౌడ్



కరీంనగర్ జిల్లా:

[ Streetbuzz News Crime journalist ]


(కరీంనగర్ ):- కరీంనగర్ పట్టణంలో బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న మార్క అనిల్ గౌడ్. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఇన్చార్జ్ పురమండ్ల శ్రీనివాస్ గార్లు స్వామి వారి కండువాను వారికి కప్పారు.
పోగోట్టుకున్న మోబైల్ ఫోన్ లను తిరిగి బాధితులకు అప్పగించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా


పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ CEIR టెక్నాలజీతో సహాయంతో ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి బాధితులకు అప్పగించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా



సిద్దిపేట జిల్లా:


[ Streetbuzz News Crime journalist ]


(గజ్వేల్) :- పోగోట్టుకున్న మోబైల్ ఫోన్స్ లను తిరిగి బాధితులకు అప్పగించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ గజ్వేల్ కి చెందిన కల్లూరి ప్రసన్న, ఆపిల్ ఫోన్, తీగుల్ గ్రామానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి యొక్క వివో మొబైల్ లను, సెల్ ఫోన్స్ పోయినాయని ఫిర్యాదు చేయగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసి, బ్లాక్ చేయడం జరిగింది. ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఆదివారం బాధితుడికి ఫోన్ అందజేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఎవరైతే ఫోన్ పోగొట్టుకుంటే మరియు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని , మరియు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని తెలిపిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా.
శివాజీ విగ్రహం ప్రాంతం పరిశీలించిన ఏసీపీ బాలాజీ

[ Crime journalist ]

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల కోసం సిద్ధం అవుతున్న శివాజీ విగ్రహం ప్రాంతం,శ్రీ ఉమా మహేశ్వర ఆలయం పరిసరాలను ఆదివారం పరిశీలించిన ఏసీపీ.బాలాజీ,సిఐ. సైదా.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ జయంతి వేడుకలు శాంతి యుతంగా నిర్వహించుకోవాలని శోభాయాత్ర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని వ్యక్తిగత శ్రద్ద తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.
అంతా చేసింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే-సభలో గులాబీ పార్టీనే -ఏకిపారేసిన ఉత్తమ్


[ Crime journalist ]


(తెలంగాణ రాష్ట్రం):- ఏర్పాటు సాగునీటి రంగంపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగం కొనసాగుతున్న సందర్భంగా నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం ఏర్పాటు నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. 2014-23 మధ్య ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.1.81 లక్షల కోట్లు అని.. ఒక్కో ఎకరానికి అయిన ఖర్చు రూ.11 లక్షలు అని చెప్పుకొచ్చారు. గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి ఖర్చు 12 రెట్లు పెరిగిందన్నారు. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి కావడానికి రూ.1.75 లక్షల కోట్లు కావాలన్నారు. వల్లే తెలంగాణ వచ్చినా కూడా నీళ్ల దోపిడీ ఆగలేదన్నారు. గత పదేళ్ల పాలనలో నీళ్ల దోపిడీ పెరిగిందని ఆరోపించారు. గత పాలకులు ఇంజినీర్లు, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజినీరింగ్‌ ఆలోచన చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. కృష్ణా జలాల్లో న్యాయబద్ధంగా రావాల్సిన వాటా సాధనలో విఫలమయ్యారన్నారు. కృష్ణా జలాల్లో మన వాటా కోసం గత ప్రభుత్వం పట్టుపట్టలేదని.. బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం వల్లే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఓంపీలు వచ్చాయన్నారు. కేసీఆర్‌ విధానాల వల్లే హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కృష్ణా బేసిన్‌లో న్యాయంగా తెలంగాణకు 68 శాతం వాటా రావాలన్నారు. 550 టీఎంసీల జలాలు తీసుకోవాలనే స్పృహ నాటి పాలకులకు లేదన్నారు. సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగింతకు గత ప్రభుత్వమే సూచనప్రాయంగా అంగీకరించిందని మంత్రి చెప్పుకొచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.38,500 కోట్లతో కాంగ్రెస్ రూపకల్పన చేసిందన్నారు. 16.4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రతిపాదన చేసిందన్నారు. గత పాలకులు వేల కోట్ల పనులను పక్కన పెట్టి రూ.38,500 కోట్ల నుంచి రూ.81 వేల కోట్లకు పెంచిందని మండిపడ్డారు. కృష్ణా జలాల నిర్వాకం, గోదావరిపై బ్యారేజ్‌ల వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం చిన్నాభిన్నమైందన్నారు. రూ.1.8 లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై భారం పెరిగిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో చేసిన అప్పులు, వడ్డీల వల్ల రాష్ట్ర ఖజానా అప్పుల భారంతో కుంగిపోయిందన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింతపై 2014 వరకు నీటిపారుదల రంగానికి ఖర్చు రూ.54,234 కోట్లు అని తెలిపారు. బీఆర్ఎస్‌ పాలనలో నీటిపారుదలకు ఖర్చు రూ.1.81 లక్షల కోట్లు అని అన్నారు. కొత్తగా వచ్చే ఆయకట్టు 15.81 లక్షల ఎకరాలు అని.. ఒక్కో ఎకరం సాగుకు సగటు ఖర్చు రూ.11.45 లక్షలుగా చెప్పుకొచ్చారు. 2015 నుంచి కొన్ని ఏళ్లు 299 టీఎంసీలకే గత ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. మరి కొన్నేళ్లు 50 శాతం వాటా రావాలని ప్రతిపాదించారన్నారు. తెలంగాణకు రావాల్సిన 68 శాతం వాటా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయలేదని మండిపడ్డారు. అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి భేటీ జరిగిన 2016 సెప్టెంబర్‌ 21న ఏపీకి 511, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారన్నారు. 2020 అక్టోబర్‌ 6న రెండో భేటీలో కేసీఆర్ పాల్గొన్నారన్నారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేస్తుందని నిర్ణయం చేశారన్నారు. 2021 జులై 15న కేఆర్‌ఎంబీపై కేంద్రం గెజిట్‌ విడుదల చేసిందని తెలిపారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలని నోటిఫికేషన్‌లో ఉందన్నారు. ప్రాజెక్టులు పూర్తికాగానే వాటి పరిధిని కేఆర్‌ఎంబీకికి అప్పగించాలని నోటిఫికేషన్‌లో నిబంధన ఉందని తెలిపారు. కేంద్రం గెజిట్‌ను గత ప్రభుత్వం అసలు సవాల్‌ చేయలేదన్నారు. గత ప్రభుత్వం సవాల్‌ చేయకపోవడంతోనే నోటిఫికేషన్‌ అమలైందని, కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు బీఆర్‌ఎస్‌ మొగ్గు చూపిందని మంత్రి పేర్కొన్నారు. 15,16వ కేఆర్‌ఎంబీ భేటీల్లో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌రావు పాల్గొన్నారని.. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింతకు అంగీకరించారన్నారని తెలిపారు. ఎన్నికల వేళ ఏపీ పోలీసులు సాగర్‌ను ఆక్రమించే యత్నం చేశారని.. పోలీసుల సాయంతో ఏపీ అక్రమంగా నీటిని విడుదల చేసిందని మండిపడ్డారు. ఏపీ చర్యపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిశ్శబ్దం వహించిందన్నారు. గత డిసెంబర్‌ 1న నీటిపారుదల కార్యదర్శి స్మితా సబర్వాల్‌.. కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారని.. శ్రీశైలం, సాగర్‌ను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు అంగీకారం తెలిపారని చెప్పుకొచ్చారు. • ప్రాజెక్టులను పూర్తి చేస్తాం • పాలమూరు ఎత్తిపోతల నిధులకు కేంద్రం హామీ లభించిందన్నారు. కడెం ప్రాజెక్ట్‌ నిర్వహణ లోపంతో 65 వేల ఎకరాల్లో క్రాప్‌ హాలిడే ప్రకటించారన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 15 టీఎంసీలకు మించి నీరు తీసుకెళ్లకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టడి చేయలేకపోయిందన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని ఈ ఏడాది ఏడు లక్షల ఆయకట్టుకు నీరందిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.
ఇంటింటి దేవతలు ఇంటికే పసుపు కుంకుమ ప్రసాదాలు - దాసరి ప్రవీణ్ కుమార్ నేత_డిసిసి అధికారప్రతినిధి కరీంనగర్ - హుస్నాబాద్ నియోజకవర్గం



సమ్మక్క- సారలమ్మ భక్తులకు మన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప కానుక

భక్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేస్కుంటే మీ ఇంటికే ఆర్టీసి కార్గో ద్వార అమ్మవార్ల మేడారం ప్రసాదం


అమ్మవార్ల ప్రసాదంతో పాటు,పసుపు, కుంకుమలు పంపిణీ


దేవాదాయ శాఖతో ఆర్టీసీ బప్పందం

21 నుండి 25 వరకు బుకింగ్


ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు:
040-69440069
040-69440000
040-23450033


[  Crime journalist ]

(తెలంగాణ రాష్ట్రం):- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచనల మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోలేని భక్తులకు ప్రసాదం(బంగారం) అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ బుకింగ్‌ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుక్‌ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుంది.తెలంగాణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.దాసరి ప్రవీణ్ కుమార్ నేత.డిసిసి అధికారప్రతినిధి కరీంనగర్ -హుస్నాబాద్ నియోజకవర్గం.
జాతర కమిటీలో అనర్హుల పేర్లతో లెటర్ ప్యాడ్ - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జాతర కమిటీ డైరెక్టర్లు


•-అనర్హుల పేర్లను తొలగించాలంటూ పలువురి డిమాండ్•



•రెండుగా చీలిన రెండు గ్రామాల డైరెక్టర్లు •


•వేర్వేరుగా వనదేవతల జాతర నిర్వహణకు ఏర్పాట్లు•


[  Crime journalist ]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన నిర్వహించే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీలో అనర్హుల పేర్లతో లెటర్ ఫ్యాడ్ ముద్రించడంతో జాతర కమిటీ డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1977 సంవత్సరంలో ముల్కలపల్లి గ్రామానికి చెందిన వారు కొంతమంది..మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన వారు కొంతమంది వనదేవతలైన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ కోసం డైరెక్టర్లుగా మరియు సభ్యులుగా చేరి..కొంత రుసుంతో సభ్యత్వం పొంది..జాతర కమిటీని ఏర్పాటు చేసుకుని..జాతర ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు తీర్మానం చేసుకున్నామని, అప్పటి నుండి ఒక మారు జాతర కమిటీ చైర్మన్ పదవిని ముల్కలపల్లి గ్రామానికి కేటాయిస్తే..మరోమారు మొగుళ్ళపల్లికి కేటాయించేలా ఒప్పందం చేసుకున్నామని, డైరెక్టర్లు ఎన్నుకున్న వారితో వనదేవతల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేవారమని డైరెక్టర్లు తెలిపారు. కానీ ఈనెల 21 నుండి ప్రారంభమయ్య శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని చిచ్చు రగల్చారు. అయిన మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి గ్రామాల డైరెక్టర్లు జాతర కమిటీని ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఆ కమిటీని కాదని..అనర్హుల పేర్లతో, జాతర ఉత్సవాలకు సంబంధం లేని వారితో లెటర్ ప్యాడ్ ముద్రించడం ఏంటని డైరెక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జాతర కమిటీలో రాజకీయ నాయకుల జోక్యం మరింత ఎక్కువవ్వడంతో జాతర ఉత్సవాలు సజావుగా జరిగేలా లేవని గ్రామాలలో చర్చించుకోవడం గమనార్హం. జాతర కమిటీలో అనరుల పేర్లను ఎలా చేర్చారని, లెటర్ ప్యాడ్ ఎవరు ముద్రించారని, దీనికి బాధ్యులు ఎవరని డైరెక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా రెండు గ్రామాల డైరెక్టర్లు ఎవరికి వారుగా చీలి వేర్వేరుగా వనదేవతల జాతర నిర్వహణ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. రాజకీయ నాయకుల ప్రమేయం రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టడం కొసమెరుపు. ఇప్పటికైనా రాజకీయం నాయకుల జోక్యం తగదని, రాజకీయ నాయకుల జోక్యంతో గిరిజన దేవతల జాతర సజావుగా జరగకుండా గొడవలు సృష్టించే విధంగా ఉన్నాయని మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు .
కారణజన్ముడు..తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రుడి జన్మదిన వేడుకలు



మండల కేంద్రంలో కేక్ కట్ చేసి..స్వీట్లను పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

[  Crime journalist. ]

(మొగుళ్ళపల్లి):- మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కారణజన్ముడిగా..తెలంగాణ జాతిపితగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, జడ్పిటిసి జోరుక సదయ్య, సర్పంచుల ఫోరం ప్రస్తుత మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, వైస్ ఎంపీపీ పోలినేని రాజేశ్వర్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి..స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి..తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన స్పాప్నికుడు..తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన అపర భగీరథుడు..ప్రతి ఇంటికి సంక్షేమం అనే నినాదంతో బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో..నిండు నూరేళ్లు..సుఖ సంతోషాలతో ఉండాలని..ప్రజల దీవెనలతో మళ్లీ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని ఆ దేవదేవున్ని వేడుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మంద సుధాకర్, పిడిసిల్ల మాజీ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మొగుళ్ళపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఏలేటి నరసింహ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పెద్ద కొమటీపల్లి గ్రామ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కత్తి రాజు గౌడ్, చిట్యాలవ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ముడుపు రవీందర్, నాయకులు చెక్క శ్రీధర్, పొతంగల్ జనార్ధన్, లడే శివాజీ, మంగలపల్లి శ్రీనివాస్, దేవునూరి కుమారస్వామి, బోల్లెపల్లి తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

•శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొడారి రమేష్ యాదవ్•

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

[ Crime journalist. ]


మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన ఎస్ ఐ తీగల మాధవ్ గౌడ్ ను బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొడారి రమేష్ యాదవ్, పోలీస్ స్టేషన్ లోని తన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. మండలంలో ఎలాంటి క్రైమ్ రేట్ పెరగకుండా ఉండేందుకు పోలీసులకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీ ఆర్ ఎస్ నాయకుడు ముడుపు రవీందర్ తదితరులున్నారు.
అయోధ్య రాముని పేరుతో బిజెపి రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న - మార్క అనిల్ గౌడ్


దైవాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటే భవి‌ష్యత్తులో వినాశం తప్పదు - మార్క అనిల్ గౌడ్


•అయోధ్య రాముని పేరుతో బిజెపి రాజకీయం చేయడం హిందువుగా వ్యతిరేకిస్తున్న - మార్క అనిల్ గౌడ్•

•అయోద్య రామ మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా హిందువుగా గర్విస్తున్నాను•




•నీతి,నిజాయితీ,ధర్మంతో ఉత్తమమైన పాలనతో జగత్తును పరిపాలించిన ఆ జగదాభిరాముడు అందరివాడు. అలాంటి రాముని పవిత్రమైన చరిత్రకు నేడు అపవిత్రమైన రాజకీయ భూతాన్ని ఆపాదించకండి•

•మతాన్ని, దైవాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే భవిష్యత్తులో వినాశనం తప్పదు•

Central NEWS:


[ Crime journalist. ]



బిజెపి మతంతో,దైవంతో రాజకీయం చేయకుండా గత పది సంవత్సరాల పాలనలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రభుత్వ పాలనలో ప్రజా ఆమోదయోగ్యమైన సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశారు ప్రజలకు వివరించండి. అంతేకానీ సర్వ మతాల నిలయమైన భారత దేశంలో మత రాజకీయాలు చేయకండి. హిందూ ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుని స్మరణ చేస్తు అన్య మతస్తులను, వారి సంప్రదాయాలను గౌరవించే హిందువుల మనోభావాలను మతం పేరుతో దెబ్బతీయవద్దు.మార్క అనిల్ గౌడ్ .
సైబర్ నేరగాళ్లు -ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు జాగ్రత్త - పోలీస్ కమిషనర్



తెలంగాణ:

[ Crime journalist. ]

(సిద్దిపేట జిల్లా):-

*లోన్ యాప్,, లాటరి, పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి.* *గూగుల్లో సెర్చ్ చేసి ఆన్లైన్ ట్రాన్జక్షన్ చేయకండి, ఆన్లైన్లో యాప్ ల గురించి వెతకకండి, డబ్బులు పంపించి మోసపోకండి* *టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి* *ఈ సంవత్సరం ఈ రోజు వరకు ₹ 19,40,750/- లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది. త్వరలో విడతలవారీగా సంబంధిత బాధితుల అకౌంట్లో, బ్యాంకుల ద్వారా జమవుతాయి.* *పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., అధికారి* సైబర్ నేరగాళ్లు -ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు •ఓటిపి మోసాలు• •ఈ మెయిల్స్ ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటన పట్ల జాగ్రత్తగా ఉండండి• •సంస్థల నకిలీ ఈమెయిల్ ఐడి లతో జాగ్రత్తగా ఉండండి• •ఆన్లైన్ షాపింగ్ మోసాలతో జాగ్రత్తగా ఉండండి• •రుణ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి• •డెబిట్/ క్రెడిట్ కార్డ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి• •లాటరీ మెయిల్స్/ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలి• •మొబైల్స్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి• •మీతోనే తప్పు చేయిస్తారు, మీ అకౌంట్ లోని డబ్బులు దోచేస్తారు జాగ్రత్త• •రాజకీయ నేతల హీరోల ఫోటోలతో ఆన్లైన్ ఓటింగ్ పేరుతో మోసం• •పెట్టుబడులు పెడతామంటూ ఫేస్బుక్ ద్వారా ఆకర్షిస్తారు జాగ్రత్త• •ప్రేమ చిత్రాలను సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్మెయిల్• •అనధికార లింకులను నొక్కితే మీ ఫోన్ హ్యాకర్ కంట్రోకు వెళుతుంది జాగ్రత్త • •భీమా కంపెనీల పేరుట మోసాలు• •ఈ ఫైలింగ్ & ఇన్కమ్ టాక్స్ రిఫండ్ పేరిట మోసాలు• •విదేశాల నుంచి మాట్లాడుతున్నట్లు సృష్టించి వాట్సప్ వేదికగా సైబర్ మోసాలు• •లక్కీ డ్రాలో ఎంపికైనట్లు ఎర వేసి మోసాలు• •ఈ కామర్స్ ఫ్రాడ్• •ఇంపెర్సొననేషన్- చీటింగ్ ఫ్రాడ్• •ఫేక్ ఆర్డర్స్• •ట్రేడింగ్ ఫ్రాడ్• •సైబర్ స్టాకింగ్ (సెక్టోరేషన్) ఫ్రాడ్• •అడ్వటైజ్మెంట్ పోర్టల్ ఫ్రాడ్• •సెల్ టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్• •చైల్డ్ ప్రోనోగ్రఫీ• •మాట్రిమోనిల్ ఫ్రాడ్• *పై సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరం జరగగానే 1930 కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలి* *1. మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడు* గుర్తుతెలియని సైబర్ నేరగాడు ఫేస్బుక్లో ఫోర్ వీలర్ అమ్మకానికి ఉన్నదని కాంటాక్ట్ నెంబర్ పంపించగా అది నమ్మిన సదరు బాధితుడు వివరాలు అడగగా ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఫోటో మరియు ఆర్ సి తదితర వాహనం యొక్క పేపర్లు పంపించగా అది నమ్మిన సదరు బాధితుడు ఫైబర్ నేరగాడు చెప్పిన విధంగా ట్రాన్స్పోర్ట్ చార్జి జీఎస్టీ తదితర ఖర్చులు ఉంటాయని డబ్బులు పంపిస్తే వాహనం డెలివరీ చేస్తానని చెప్పగానే సదరు బాధితుడు సైబర్ నేరగాడు పంపించిన ఫోన్ నెంబర్ కు గూగుల్ పే ఫోన్ పే ద్వారా 97,649/- రూపాయలు పంపించాడు. తదుపరి ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది అనుమానం వచ్చిన సదరు బాధితుడు జాతీయ సైబర్ సెల్ నెంబర్ 1930 ఫోన్ చేసి వివరాలు తెలిపి ఫిర్యాదు చేయడం జరిగింది.