నేను సైతం అనే కార్యక్రమం లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు
రిమ్మనగూడ గ్రామపంచాయతీ పక్కన ఉన్న గల్లీలో నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు
[ Streetbuzz News Crime journalist ]
సిద్దిపేట జిల్లా:
(గజ్వేల్ నియోజకవర్గం 13పిబ్రవరి) :- రిమ్మనగూడ గ్రామంలో గ్రామపంచాయతీ పక్క గల్లిలో గత కొన్ని రోజుల క్రితం ఒక దొంగతనం జరిగింది అట్టి విషయంలో గజ్వేల్ సిఐ సైదా గ్రామాన్ని సందర్శించి కాలనీ రక్షణ గురించి నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గల్లి వాసులకు తెలపగా గల్లీలో ఉన్న పెద్దలు అందరూ కలిసి నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం రోజు వాటిని గజ్వేల్ సీఐ సైదా ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐ సైదా మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గల్లీ పెద్దలను అభినందించి.సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సిసి కెమెరాలు ఉన్న గ్రామాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని తెలిపినారు. గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు. మరియు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో కలసి గ్రామంలో పోలీస్ శాఖ తరపున ఏమైనా రక్షణ అవసరాలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా వెంటనే తెలపాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు బెల్ట్ షాపులు, గుట్కాలు, ఎవరైనా అమ్మితే మరియు గ్రామంలో పేకాట ఆడితే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ బి. సైదా .
Feb 14 2024, 04:44