పోలీసు కళాఘఙబృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం
[ Streetbuzz News Crime journalist ]
సిద్దిపేట జిల్లా:
(గజ్వేల్ 10 ఫిబ్రవరి):- గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్గూర్ గ్రామంలో" పోలీస్ కళా బృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యాక్రమం నిర్వహించారు.ఈ కార్యాక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ఎస్ఐ పరశురాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్(సిఐ) సైదా మాట్లాడుతూ మూఢనమ్మకాలు నమ్మవద్దు,ఈ టెక్నాలజీ ప్రపంచంలో భానుమతి వాళ్లు చేశారు, వీళ్ళు చేశారు అంటే నమ్మవద్దు ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రిలో చూపించుకోవాలి,
చిన్నచిన్న తగాదాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి,
గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
జిల్లాలో చిన్న పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగులు వచ్చినాయని సోషల్ మీడియాలో పుకార్లు, షికార్లు చేస్తున్నారు, అలాంటి వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ప్రవేశించలేదని, గ్రామాలలో, పట్టణాలలో ఎవరైనాఅనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సంఘవిద్రోహశక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా బ్యాంకు వివరాలు ఏటీఎం కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు.వాట్సప్ కు మరియు ఫోన్ కు ఎలాంటి మెసేజ్ వచ్చిన ఓపెన్ చేయవద్దు స్పందించవద్దని తెలిపారు.
ప్రభుత్వం పెండింగ్ చాలాన్ లపై రహితీ ప్రకటించినందున చాలా పెండింగ్ ఉన్న వాహనదారులు తేదీ: 15-02-2024 వరకు ప్రభుత్వము గడవు విధించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
15వ తేదీ తర్వాత ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులను గుర్తించి మొత్తం డబ్బులు కట్టించడం జరుగుతుంది
పోలీస్ కళా బృందం కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా మూఢనమ్మకాల పై మరియు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు గురించి, పేకాట ఆడుట వలన కుటుంబలో జరుగుతున్న పరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలు గురించి, ఈమధ్య జరుగుతున్న ఆత్మహత్యలు గురించి,
మరియు వృద్ధులైన తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ , షీ టీమ్స్ జరుగుతున్న సైబర్ నేరాల గురించి పాటల ద్వారా, సిడిల ద్వారా కళాబృందం సభ్యులు బాలు, రాజు, రవీందర్, తిరుమల, పాటల రూపంలో మరియు నాటకం రూపంలో ప్రజలను చైతన్య పరిచినారు.చిన్నచిన్న ఆస్తి తగాదాలకు పోయి ప్రాణాలు తీసుకోవద్దని ఆలోచించకుండా క్షణికావేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తాయని ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, పరిష్కారం కాని సమయంలో పోలీస్ స్టేషన్ కు రావాలని ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మనిషి కక్షలు కారుణ్యాలతో ఏ పని చేయవద్దని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధం. టోల్ ఫ్రీ నెంబర్లు 1930, కాల్ చేయాలని సూచించారు.
ప్రజలు ఎవరైనా తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు CEIR పోర్టల్ (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ద్వారా అట్టినెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందని, దాని గురించి తెలియని వారు మీ సేవ కేంద్రంలో లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు అప్లోడ్ చేసుకోవాలని సూచించారు కావున ప్రజలు ఈ CEIR అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, గ్రామ కారోబర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Feb 14 2024, 04:03