విద్యుత్ షాక్ తో తాటి కమ్మల గుడిసె దగ్దం కావడంతో వారి కుటుంబానికి బియ్యం అందజేసిన జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు


తాటికమ్మలగుడిసే విద్యుత్ షాక్ తో పూర్తి గా దగ్ధం అవ్వగా జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్ వారి కుటుంబానికి బియ్యం అందజేశారు.

[ Streetbuzz News Crime journalist]

నల్లగొండ జిల్లా:

(నకిరేకల్ నియోజకవర్గం):-

 కట్టంగూర్ గాంధీనగర్ జంగాల కాలనీ లో పర్వతం సైదులు తాటి కమ్మలగుడిసె విద్యుత్ షాక్ తో పూర్తి గా దగ్ధం ఐన విషయం తెలిసిన జిల్లా కాంగ్రెస్ యవజన నాయకులు ముక్కాముల శేఖర్ యాదవ్ పరిశీలించి వారి కుటుంబానికి బియ్యం అందజేశారు.వారి వెంట మాజీ వార్డ్ నెంబర్ ఏనుగు సైదులు,పర్వతం మహేష్,సిరిసల ఉపేందర్, కాలేం సైదులు, నర్సింగ్ సంతోష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణా పై, డంపులపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా కుకునూరు పల్లి గ్రామ శివారులో రెండు ట్రాక్టర్లల్లో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా మరియు వంటిమామిడి గ్రామ శివారులో అక్రమ ఇసుక డంపులను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు

[ Streetbuzz News Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ నియోజకవర్గం 12-పిబ్రవరి ):- .కుకునూరు పల్లి గ్రామ శివారులో రెండు ట్రాక్టర్లల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం పై సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది వెళ్లి దాడి చేసి రెండు టాక్టర్లను పట్టుకొని కుకునూరుపల్లి పోలీసులకు అప్పగించగా వారు విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారని, మరియు ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని వంటిమామిడి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక డంపులు ఉన్నాయని నమ్మదగిన సమాచారం రాగా వెళ్లి పట్టుకుని ములుగు పోలీసులకు అప్పగించారు. వారు తదుపరి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారని ,ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

వ్యాపారాల నుండి దాసరం గుట్టను కాపాడాలని కోరుతూ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ వారికి వినతి*

[ Streetbuzz News Crime journalist]

[సిద్దిపేట కలెక్టరేట్]

రియలేస్టేట్:

(సిద్దిపేట జిల్లా):- తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఉన్న దాసరం గుట్టను కబ్జా చేస్తున్నారని వారి నుండి గుట్టను కాపాడాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బద్దీపడిగా కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం రోజున ప్రజావాణి లో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ కు సీపీఎం అద్వర్యం లో వినతిపత్రాన్ని అందజేశారు.

వందల సంవత్సరాల నుండి దాసారం గుట్ట కొమురవేల్లి మల్లన్న గుడి పరిధి లో ఉందని దీని సర్వేనెంబర్ 305 లో 22 ,ఎకరాల 10 గుంటల భూమి దొరల కాలం నుండి ప్రభుత్వ భూమిని దేవాలయానికి వచ్చే విధంగా చూసేంతవరకు ఈ భూమిని బ్లాక్ లిస్టులో పెట్టాలని కావున దేవాలయం ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా ఈ భూమిని కొమరవెల్లి మల్లన్నకు తీసుకోవాలని అప్పటివరకు ఈ భూమి క్రయవిక్రయాలు జరగకుండా ఆపాలని కొమరవెల్లి మండల అన్ని గ్రామాల నుండి ప్రజలు కోరుకుంటున్నారని కావున సీపీఎం కొమురవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టులో ఈ భూమిని కొమురవెల్లి మల్లన్నకు కేటాయించాలని కేసు కూడా ఉందని పలుమార్లు దేవాలయ ఈఓ గారిని కలిసి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగిందని, కొమురవెల్లి మల్లన్న వసతి గృహాలకు గుట్ట పైకి వెళ్లే రోడ్లకు దాదాపు 7 కోట్ల రూపాయలు రోడ్లకు ఖర్చు పెట్టినారని అయినా ఆ డబ్బులు వృదా అయినవి తప్ప ఉపయోగం లొకి రాలేదు. ప్రజా ప్రతినిధులు వాళ్ల స్వప్రయోజనాలకు కమిషన్లకు కకృతి పడి మల్లన్నకు భూములు తీసుకోవడంలో విఫలమైనారు , డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు దేవాలయానికి పెద్ద ఆస్తి వచ్చేది కావున ఇప్పటికైనా ప్రభుత్వ వారధిగా ప్రధానంగా అధికారులుగా ఈ భూమిని దేవస్థానానికి వచ్చే విధంగా క్రయవిక్రయాలు జరగకుండా భూమిని బ్లాక్ లిస్ట్లో పెట్టించి కొమురవెల్లి మల్లన్న కు దాసారం గుట్ట ని హిటాచీల ద్వారా గుట్టను పారదోలుతున్నారని కావున తక్షణం ఈ భూమిని మల్లన్న ఆస్తిగా మార్చడం కోసం తగిన ఆదేశాలు ఇచ్చేంతవరకు భూమిని కాపాడడం కోసం సిపిఎం కొమురవెల్లి, మల్లన్న భక్తులను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలను ఏకం చేసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కావున ఈ భూమిని బ్లాక్ లిస్టు పెట్టించి క్రయవిక్రయాలు జరగకుండా మన కొమురవెల్లి దేవస్థానానికి తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చి న్యాయం చేయగలరని అలాగే సుమారు పది ఎకరాల భూమి గుట్ట పక్కకు పార్కింగ్ స్థలం ఉపయోగంగా దీని ద్వారా దేవాలయానికి ఆదాయం

వస్తుందని దేవాలయానికి పెద్ద ఆస్తిఅని

దేవాలయంకు అప్పగించాలని వారు కోరారు . ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దాసరి ప్రశాంత్, తడూరి రవీందర్ , తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి కరాటే చాంపియన్ పోటీలకు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి దనసరి సీతక్క

అభివృద్ధి పనుల అభివృద్ధి కు శంకుస్థాపన చేసిన మంత్రి దనసరి సీతక్క,పలు అధికారులు

[ Streetbuzz News Crime journalist ]

ములుగు జిల్లా:

(ఏటూరునాగారం ):- ఐ,టి,డి,ఏ ఏటూరునాగారం ప్రాజెక్టు అధికారి అంకిత్ ఐఏఎస్ అధికారి, గౌరవ తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ స్త్రీ,శిశు సంక్షేమ మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారితో ఏజెన్సీ లోని ఆదివాసుల అభివృధి పనులు ఏటూరునాగారం మండలం లోని బుట్టరం నుండి ఎలిసెట్టిపల్లి రోడ్ పై కి.మి.0/200 వద్ద హై లెవల్ వంతెన నిర్మాణ, మరియు రోడ్డు పనుల విలువ రూపాయలు 4కోట్ల 5 లక్షల పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఏటూరునాగారం అకులవారీ ఘనపురం లోని గిరిజన భవన్ లో ఐ,టీ,డీ,ఏ ఏటూరునాగారం అధ్వర్యంలో జరుగుతున్న 6వ తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ పోటీలకు ముఖ్య అతిథిగా అంకిత్ ఐ,ఏ,ఎస్ అధికారి పాల్గోని దీపారాధన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన

విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందు ఉండాలని గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఐటీడీఏ ఏటూరునాగారం తరుపున అన్నిరకాల సహకారం ఉంటుందని తెలిపారు.. అలాగే కరాటే పోటీలకు వస్తున్న 600 మంది విద్యార్థినీ, విద్యార్థులకు 40 మంది కోచ్ లకు భోజన సదుపాయంతో పాటు వసతి ఏర్పాట్లను, కావాల్సిన భాహుమతుల ను కూడా ఐటీడీఏ ఏటూరునాగారం తరుపున అంకిత్ ఐఏఎస్ అధికారి ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ నెల 14 వ తేదీన బుదవారం రోజు జకారం గట్టమ గుడి వద్ద జరిగే ఎదురు పిల్ల పండుగకు ఐటీడీఏ ఏటూరు నాగారం ప్రోజెక్ట్ అధికారి అంకిత్ ఐఏఎస్ అధికారి గార్లను నాయకపొడ్ గట్టమ్మ దేవత పూజారులు ఆహ్వానించారు.

యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు - మొగుళ్ళపల్లి ఎస్ఐ .తీగల మాధవ్ గౌడ్*

-సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- మొగుళ్ళపల్లి ఎస్ఐ .తీగల మాధవ్ గౌడ్

[ Streetbuzz News Crime journalist ]

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

(మొగుళ్లపల్లి ):- యువత చెడు వ్యసనాల బారీన పడి తమ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మొగుళ్ళపల్లి మొగుళ్ళపల్లి ఎస్ఐ.తీగల మాధవ్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, యువకులు చదువుతోపాటు క్రమశిక్షణగా మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు, డయల్ 100, బాల్య వివాహాలు, బాలకార్మికులు, సిసి కెమేరాలు, గుట్కా, గంజాయి డ్రగ్స్ వాడకం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా యువకులు చెడు వ్యసనాల బారీన పడి వారి బాబీ భారత జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని, 1930 సైబర్ టోల్ ఫ్రీ నంబర్ గురించి అవగాహన ఉండాలన్నారు.

సీఐ మల్లయ్యకు ఆత్మీయ సన్మానం*

-శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న నారగోని స్వప్న-మురళి గౌడ్

[ Streetbuzz News Crime journalist]

(వరంగల్ జిల్లా):- వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలను స్వీకరించిన పి మల్లయ్యను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మశాఖ మంత్రి కొండా సురేఖ-మురళీల సూచన మేరకు వరంగల్ నగర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నారగోని స్వప్న-మురళి గౌడ్ లు ఆదివారం తన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి..పుష్పగుచ్చం అందించి..స్వీట్లు తినిపించి..శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నారగోని స్వప్న మురళి గౌడ్ లు మాట్లాడారు. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీలో క్రైమ్ రేట్ పెరగకుండా ఉండేందుకు పోలీసులకు సహకరిస్తామని తెలిపారు.

ఆసుపత్రి ని సందర్శించిన ఇన్స్పెక్టర్ సైదా

[ Streetbuzz News Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

ప్రభుత్వ

((గజ్వేల్ ):- గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు స్టాఫ్ నర్స్ తో కలసి భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ అధికారులకు తెలియపరచాలని నోటీస్ బోర్డ్ లో గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన పోలీస్ అధికారుల సిబ్బంది యొక్క సెల్ నెంబర్లు అతికించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలు కూడా సమన్వయం పాటించాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఏదైనా ట్రీట్మెంట్ విషయంలో సమస్య ఉంటే పోలీసులకు తెలియపరచాలని సూచించారు.

పోలీసు కళాఘఙబృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం

[ Streetbuzz News Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ 10 ఫిబ్రవరి):- గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్గూర్  గ్రామంలో" పోలీస్ కళా బృందం చే ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యాక్రమం నిర్వహించారు.ఈ కార్యాక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, ఎస్ఐ పరశురాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్(సిఐ) సైదా మాట్లాడుతూ మూఢనమ్మకాలు నమ్మవద్దు,ఈ టెక్నాలజీ ప్రపంచంలో భానుమతి వాళ్లు చేశారు, వీళ్ళు చేశారు అంటే నమ్మవద్దు ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రిలో చూపించుకోవాలి,

చిన్నచిన్న తగాదాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి,

గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

జిల్లాలో చిన్న పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగులు వచ్చినాయని సోషల్ మీడియాలో పుకార్లు, షికార్లు చేస్తున్నారు, అలాంటి వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ప్రవేశించలేదని, గ్రామాలలో, పట్టణాలలో ఎవరైనాఅనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సంఘవిద్రోహశక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా బ్యాంకు వివరాలు ఏటీఎం కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు.వాట్సప్ కు మరియు ఫోన్ కు ఎలాంటి మెసేజ్ వచ్చిన ఓపెన్ చేయవద్దు స్పందించవద్దని తెలిపారు.

ప్రభుత్వం పెండింగ్ చాలాన్ లపై రహితీ ప్రకటించినందున చాలా పెండింగ్ ఉన్న వాహనదారులు తేదీ: 15-02-2024 వరకు ప్రభుత్వము గడవు విధించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 

15వ తేదీ తర్వాత ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులను గుర్తించి మొత్తం డబ్బులు కట్టించడం జరుగుతుంది

పోలీస్ కళా బృందం కనువిప్పు అనే కార్యక్రమం ద్వారా మూఢనమ్మకాల పై మరియు మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు, కుటుంబ కలహాలు గురించి, పేకాట ఆడుట వలన కుటుంబలో జరుగుతున్న పరిణామాలను, వరకట్నం వలన జరుగుతున్న సంఘటనలు గురించి, ఈమధ్య జరుగుతున్న ఆత్మహత్యలు గురించి, 

మరియు వృద్ధులైన తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ , షీ టీమ్స్ జరుగుతున్న సైబర్ నేరాల గురించి పాటల ద్వారా, సిడిల ద్వారా కళాబృందం సభ్యులు బాలు, రాజు, రవీందర్, తిరుమల, పాటల రూపంలో మరియు నాటకం రూపంలో ప్రజలను చైతన్య పరిచినారు.చిన్నచిన్న ఆస్తి తగాదాలకు పోయి ప్రాణాలు తీసుకోవద్దని ఆలోచించకుండా క్షణికావేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తాయని ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దలతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, పరిష్కారం కాని సమయంలో పోలీస్ స్టేషన్ కు రావాలని  ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మనిషి కక్షలు కారుణ్యాలతో ఏ పని చేయవద్దని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధం. టోల్ ఫ్రీ నెంబర్లు 1930, కాల్ చేయాలని సూచించారు.

ప్రజలు ఎవరైనా తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు CEIR పోర్టల్ (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ద్వారా అట్టినెంబర్ను www.ceir.gov.in వెబ్సైటులోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందని, దాని గురించి తెలియని వారు మీ సేవ కేంద్రంలో లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు అప్లోడ్ చేసుకోవాలని సూచించారు కావున ప్రజలు ఈ CEIR అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, గ్రామ కారోబర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ

[ Streetbuzz News Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(కొండపాక 10 ఫిబ్రవరి):- మండలంలోని మూడు గ్రామాలకు సంబంధించిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గతంలో ప్రమాదవశాత్తు చనిపోగా వారికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున వచ్చాయి.అంకిరెడ్డిపల్లి గ్రామంలో మహమ్మద్ అన్వర్ ,రాంపల్లి గ్రామంలో చిట్యాల రాములు,రవీంద్ర నగర్ విశ్వనాధ్ పల్లి గ్రామంలో గొడుగు దేవవ్వ కు ఈ ముగ్గురికి ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యాక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ శ్రీ "చిట్టి దేవేందర్ రెడ్డి,మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ,గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

గజ్వేల్ పట్టణంలో ఉన్న పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఏసిపి రమేష్

[ Streetbuzz News Crime journalist ]

సిద్దిపేట జిల్లా:

(గజ్వేల్ 10 ఫిబ్రవరి):- జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ ఎగ్జామ్) గజ్వేల్ పట్టణంలో ఉన్న పరీక్షా కేంద్రాలను సందర్శించిన గజ్వేల్ ఏసిపి యం. రమేష్. ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు.పరీక్షా కేంద్రం చుట్టుపక్కల 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఐదుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ గుమి కూడా వద్దని సూచించారు.