విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి యాంటీ హ్యూమన్ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు తదితర అంశాలపై అవగాహన కల్పించిన షీటీ
రాంసాగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన తొగుట సిఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ రఘుపతి, గజ్వేల్ షీటీమ్ బృందం
సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి
అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దు
జిల్లాలో పిల్లలను ఎత్తుకుపోయే బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాకు వచ్చినారని సోషల్ మీడియాలో షికార్లు పుకార్లు వస్తున్నాయి అలాంటి గ్యాంగ్ లు ఏమీ లేవు
గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి
[ Streetbuzz News Crime journalist ]
సిద్దిపేట జిల్లా:
(రాయపోల్ 10 ఫిబ్రవరి):- ఈ సందర్భంగా తొగుట సిఐ లతీఫ్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు
షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, సైబర్ నేరాల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఇవి టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి. గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి. మహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు. విద్యార్థులు యొక్క గోల్ గురించి. అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని అంశాల గురించి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు. మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడినఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100,, సిద్దిపేట షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667434 స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్
9494639498, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరస్తులు పంపే ఏ లింకులు కూడా ఓపెన్ చేయొద్దని, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ రఘుపతి, స్కూల్ హెడ్మాస్టర్ సత్యనారాయణ రెడ్డి, అధ్యాపకులు, గజ్వేల్ షీటీమ్ సిబ్బంది శ్రీరాములు, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు శ్యామల, లావణ్య, కానిస్టేబుళ్లు మహేష్, రామచంద్రారెడ్డి. రాయపోల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి, కానిస్టేబుళ్లు స్వామి, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
Feb 12 2024, 21:44