Crimejournalist

Feb 10 2024, 06:47

ఎస్, బి,ఐ బ్యాంక్ లో భారీ చోరి

[Streetbuzz News Crime journalist]

కాకినాడ జిల్లా :

(ప్రత్తిపాడు మండలం):- ఉత్తరకంచి ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 30 లక్షల నగదు,రూ. కోటిన్నర విలువ చేసే బంగారం అపహరణకు గురైంది. బ్యాంక్ వెనుక భాగంలో కిటికీ డ్రిల్స్ను గ్యాస్ కట్టర్తో తొలగించి దుండగులు బ్యాంకులోకి చొరబడినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Crimejournalist

Feb 10 2024, 06:39

ఏపీలో *డీఎస్సీ* నోటిఫికేషన్ విడుదల

BIG BREAKING NEWS:

 

[Streetbuzz News Crime journalist]

6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

 2,280 SGT పోస్టులు

 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు

 1264 టీజీటీ పోస్టులు

 215 పీజీటీ పోస్టులు

 42 పిన్సిపల్ పోస్టులు

ఈ నెల 12 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది

ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తాం - మంత్రి బొత్స

Crimejournalist

Feb 10 2024, 06:29

ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ జంగా కృష్ణ మూర్తి ఆత్మీయ సమావేశం

[Streetbuzz News Crime journalist]

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ జంగా కృష్ణ మూర్తి ఆత్మీయ సమావేశం

భారీ ర్యాలీగి గురజాల నియోజకవర్గ నలుమూలల నుండి తరలి వచ్చిన జంగా అభిమానులు

సమావేశంలో జంగా కృష్ణ మూర్తి కామెంట్స్

పేద కుటుంబానికి చెందిన తనని ఇంతగా ఆదరించిన వారికి జంగా కృతజ్ఞతలు తెలిపారు

తన ఆవేదన పంచుకోవటానికే ఆత్మీయ సమావేశం ఏర్పాటు :జంగా

1999 శాసన సభ్యుడిగా 

ఉన్న రోజు నుండి నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉన్నాను 

బడుగు బలహీన వర్గాలకు సేవ చేసా కనుకే ఇంతగా ఎదిగా :జంగా

1998లో పార్లమెంట్ ఎన్నికల్లో రోశయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం జరిగింది అని అన్నారు

నియోజకవర్గంలో బిసి అభ్యర్ధి ఉంటే బాగుంటుందని రోశయ్య,జనార్దన్ రెడ్డి సీటు ప్రకటించరు

ఆరోజు గెలుపు కాంగ్రెస్ పార్టీ, నా యస్సి,యస్టి,బిసీల కృషి

1999లో ప్రతిపక్షంలో ఉన్నాము

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం సమయంలో జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేయాలని పాదయాత్ర చేసాం :జంగా

ఆరోజుల్లో జండా పట్టుకున్న సమయంలో నవ్విన వ్యక్తులు ఈరోజు నియోజకవర్గం లోపెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసాను కాని ఎక్కడ భయపడలేదు

2017 వరకు కార్యకర్తల కోసం పనిచేసి వారికి అండగా ఉన్న, అనేక కేసులు బరించా

వైసీపీ కోసం బీసి వర్గాల కోసం రాష్ట్ర మంతటా పాదయాత్ర చేసా

2019 ఎన్నికల ముందు MLC ఇస్తానంటే ఎన్నికల్లో చేయనని ఎన్నికల తర్వాత ఇవ్వమన్న వ్యక్తి కాసు మహేష్ రెడ్డి అని ఆరోపించారు

పిడుగురాళ్ల బహిరంగ సభలో నియోజకవర్గాన్ని గెలిపించుకుంటామని మాట నిలబెట్టుకున్నామని అన్నారు

ఎన్నికల అనంతరం నాలుగు సంవత్సరాలు కనీసం ఏ కార్యక్రమానికి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు

అనేక ఇబ్బందులు గురిచేసారని నా దగ్గరకు వచ్చిన వారిని ఇబ్బందులు పెట్టడం చేసారు

పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారిని పక్కడపెట్టి తన ఆదాయం కోసం, వ్యపారాల కోసం నడుస్తున్నారు

గామాలపాడులో ఆసరా కార్యక్రమానికి సర్పంచ్ అయిన తన కుమారుడికి కనీసం సమాచారం ఇవ్వకుండా అవమానించారు

10సంవత్సరాలు ఏ ఒక్క అధికారి నైనా , పోలీసులలైనా కొట్ట మని చెప్పానా

నేడు మన పార్టీకి సంబందించిన కౌన్సిలర్ ని పోలీస్ స్టేషన్లో కొట్టించడం ఏమిటి అని ప్రశ్నించారు

బిసి సామాజిక వర్గం వ్యక్తి పై ఇంతడి దుర్మార్గమా అని అన్నారు

నేడు నియోజకవర్గ పరిస్థితి దృష్ట్యా చాలా బాదగా ఉందన్నారు

 వైసీపీ పెద్దల దృష్టిలో కి తీసుకు వెల్లిన్నా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్ష తో నా రాజకీయ ప్రస్థానం మొదలైందో ఆ ఆశయాల కోసం ముందు సాగుతానన్నారు

నేడు వస్తున్న కధనాలను ఖండించారు

నా పోరాటం ఆత్మగౌరవ పోరాటం అన్నారు 

 తెదేపా లో చేరతాడని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు

ఈ సమావేశం నా ఆవేదన పంచుకోవటానికి , ఆత్మీయుల సలహాలకోసం అన్నారు

భవిష్యత్తు లో తీసుకునే నిర్ణయానికి నా వెన్నంటే ఉంటారని ఆకాంక్షించారు

నా నైజం నమ్మిన వ్యక్తులకు మోసం చెయ్యడం కాదని నమ్మితే ప్రాణమైనా ఇస్తాన్ననారు

వారి లాగా ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య ఏరుదాటాక బోడి మల్లయ్య అనడం కాదన్నారు

ఎవరు భయపడవద్దని మీకు నేను అండగా ఉన్నానన్నారు

ఎన్నికల్ల సమయంలో అందరూ వస్తారని తరువాత పట్టించుకోరని కానీ జంగా అలాకాదు ఎప్పుడు ఓకే లాగే ఉంటాడు

ఎవరైతే మీకు అండగా ఉంటారో వారికి అండగా ఉండాలన్నారు.

Crimejournalist

Feb 10 2024, 06:22

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన పిడిశెట్టి రాజు

ప్రధాని నరేంద్రమోడీ కీ కృతజ్ఞతలు తెలిపిన 

- సామజిక కార్యకర్త, పివి సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా : 

హుస్నాబాద్ నియోజకవర్గం:

 

(కోహెడ మండలం 09 ఫిబ్రవరి ) :- భారతదేశ నూతన ఆర్థిక సంస్కరణల పితామాహుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరించడం పట్ల ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పిడిశెట్టి రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మేధావులు, తెలుగు తొలి ప్రధాని పివి నరసింహారావు కీ భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా చేసిన కృషిని ఆయన సమానంగా గుర్తుంచుకుంటారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించింది, దేశం యొక్క శ్రేయస్సు మరియు అభివృద్ధికి బలమైన పునాది వేసింది. ప్రధానమంత్రిగా నరసింహారావు పదవీకాలం భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు తెరిచిన ముఖ్యమైన చర్యలతో గుర్తించబడింది, ఇది ఆర్థిక అభివృద్ధి యొక్క కొత్త శకాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా, భారతదేశం యొక్క విదేశాంగ విధానం, భాష మరియు విద్యా రంగాలకు ఆయన అందించిన సహకారం భారతదేశాన్ని క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా దాని సాంస్కృతిక మరియు మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా అతని బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతుంది.

ఆ మహానుభావుడికి మరియు మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పీతామాహుడు ఏం ఏస్ స్వామినాథ్ లకు భారతరత్న ప్రకటన పట్ల భారత కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తూ గతంలో పివికి భారతరత్న ఇవ్వాలనీ వంగర నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కీ 2019లో వినతిపత్రం సమర్పించామని, వారిపై ఉన్నా గౌరవం, భక్తితో ప్రస్తుతం కోహెడ మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో పీవీ నరసింహారావు కాలనీ, మార్గ్ పెట్టడం జరిగిందనీ రాజు పేర్కొన్నారు.

Crimejournalist

Feb 09 2024, 22:42

ఇసుక అక్రమ రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు*

ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రజ్ఞాపూర్ గ్రామ శివారు రాజీవ్ రహదారి, గౌరారం గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కన అక్రమంగా డంపు చేసిన ఇసుకను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

గజ్వేల్ నియోజకవర్గం:

(వర్గల్ ఫిబ్రవరి 09) :- శుక్రవారం మధ్యాహ్నం సమయమున ప్రజ్ఞాపూర్ గ్రామ శివారు రాజీవ్ రహదారి, గౌరారం గ్రామం గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక డంపు చేసినారని నమ్మదగిన సమాచారం పైసిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది వెళ్లి ఇసుక డంపులను గుర్తించి  గజ్వేల్ పోలీసులకు, గౌరారం పోలీసులకు అప్పగించిన సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.

ఇసుక డంపు చేసిన నిందితుల వివరాలు

1. గుడికందుల నరేందర్, ప్రజ్ఞాపూర్ గ్రామం

2. గుడికందుల గణేష్, దాతర్ పల్లి, గజ్వేల్ మండలం.

3. బక్కల యాదగిరి, గ్రామం రాయరం, మండలం కుకునూరుపల్లి.

4. శ్రీరామ్ కృష్ణ, గ్రామం ప్రజ్ఞాపూర్.

5. గోపాల్ కృష్ణ, గ్రామం దాతర్ పల్లి, మండలం గజ్వేల్.

6. మామిండ్ల స్వామి, గ్రామం వర్గల్.   

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Crimejournalist

Feb 09 2024, 22:26

విద్యార్థినీ విద్యార్థులకు దంత పరిక్షలు నిర్వహించిన కామినేని దంత కళాశాల వైద్యులు

[Streetbuzz News Crime journalist]

నల్లగొండ జిల్లా:

(నకిరేకల్ నియోజకవర్గం):- కామినేని దంత వైద్య కళాశాల వైద్యులు నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్టంగూర్ పాఠశాల విద్యార్థులకు దంత వైద్య పరీక్షను నిర్వహించారు .

6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 380మందిబాలబాలికలకుదంతవైద్యపరీక్షలను నిర్వహించారు.అందులో సుమారు 140 మంది విద్యార్థులకుదంత సమస్యలను గుర్తించారు. వారికి వచ్చేవారం కామినేని దంత వైద్య కళాశాలలో దంత చికిత్సలు చేస్తామని వైద్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ అంబటి అంజయ్య, దంతవైద్యులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 09 2024, 21:20

ఇంకా అధికారంలో ఉన్నట్లే బీఆర్ఎస్ నేతల ఫీలింగ్..మంత్రి పొన్నం

[Streetbuzz News Crime journalist]

(హైదరాబాద్బీ ):- ఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని, మేము ఏం చెబితే అది వినాలనే ఫీలింగ్‌‌లో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారన్నారు. రూ. 535 కోట్ల విలువ గల బస్ ఫెయిర్స్‌ని ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు కూ. 15వేలు ఇవ్వాలని హరీష్ రావు అంటున్నారని, మరి బీఆర్ఎస్ హయంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చలాన్ల పేరుతో వేల రూపాయలు వసులు చేశారని ఆరోపించారు.సభని తప్పుదోవ పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారని, అటో డ్రైవర్లను బీఆర్ఎస్ నేతలే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు.బస్సులు ప్రయాణికుల దగ్గరకు వెళ్లడం లేదని, ప్రయాణికులే బస్సుల దగ్గరకు ఆటోల ద్వారా వస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Crimejournalist

Feb 09 2024, 21:06

శ్రీ కషిమి కోటరామ్ జి కాలు సర్జరీ జరిగిందని తెలిసి వారిని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువనాయకులు

[Streetbuzz News Crime journalist]

ఆంధ్రప్రదేశ్:

(శ్రీకాకుళం ఫిబ్రవరి 09):- శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక రెల్ల వీది లో శ్రీ కషిమి కోట రామ్ జి గారి కాలు సర్జరీ జరిగింది అని తెలిసిన వెంటనే వారిని పరామర్శించిన శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు, మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీ గొండు శంకర్, ఉత్తరాంధ్ర కళ్యాణ్ రామ్, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్రి మధు,శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కోశాధికారి ఇప్పిలి తిరుమల రావు, ప్రసాద్, అన్నేపు ధనుంజయ్, మురళి, ఈశ్వరరావు, అలిగి ప్రసాద్, శ్రీనివాసరావు, నాగయ్య, బద్రారావు, రాజు, మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మి రాజ్యం,TNSF నియోజకవర్గం ప్రసిడెంట్ రెడ్డి గిరిజా శంకర్, అరసవిల్లి టీడీపీ నాయకులు కొయ్యన రామ్ మోహన్ రావు, రాయి కిరణ్, నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి గొండు శ్యామ్ సుందర్ రావు, గార మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకట రమణ మూర్తి, నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి చెన్న రమణ,బైరి మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, రంది రాజు,సాధు పరమేష్, తంగి నర్సింగరావు, సాధు అజయ్, మల్ల రమణయ్య, గుండ మురళి, శిమ్మ శ్యామ్ సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 09 2024, 20:56

ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని సంతకాల సేకరణ

[Streetbuzz News Crime journalist]

సిద్దిపేట జిల్లా:

(కొండపాక ఫిబ్రవరి 09 ) :- కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిన రైతన్న కార్మిక వ్యవసాయ కౌలీల సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అమ్ముల బాల నర్సయ్య అన్నారు. శుక్రవారం రోజున వెలికట్ట గ్రామంలో సంతకాల సేకరణ,కరపత్రాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాలనర్సయ్య మట్టాడుతూ కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాల హామీని విస్మరించడంతో నేడు ఉద్యోగ కల్పన పడిపోయిందని,నిరుద్యోగం 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని శ్రామిక కుల నిజ వేతనాలు20 శాతం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ లను కార్మిక హక్కులను కాలరాస్తుందని అన్నారు. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్త పలకలనీ పెట్టుబడిదారుల లాభాల కోసం తిరిగి 12గం.ల పని విధానం అమల్లోకి తెస్తుంధన్నారు. భవన నిర్మాణ కార్మికుల ద్వారా వస్తున్న సేపు డబ్బులను ఇతర పథకాలకు మళ్లించి కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఇవ్వడం లేదని ప్రశ్నించినారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఎర్పాటు చేసి వ్యవసాయ కూలీల గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తగ్గించటం ఎంటాన్నారు.ఈ నేపధ్యంలో దేశంలోనికార్మిక,రై తాంగం,వ్యవసాయ కూలీలు మరియు సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు అమ్ముల పరుశరాములు,పబోజు లక్ష్మి నర్సయ్య,ఎర్ర సత్తయ్య,నర్సింహ రవి,ఎల్లమ్మ గారి నాగయ్య,భూమని నర్సయ్య,నాంపల్లి యాదయ్య,ముత్తనిశేఖర్,అమ్ముల పరుశరాములు, దొబ్బబాలయ్య,శ్రీనివాసు,బాలనర్సయ్య,ఎల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 09 2024, 10:47

జిల్లాలో జరుగుతున్న జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -పోలీస్ కమిషనర్


జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ ఎగ్జామ్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడమ్

[ Streetbuzz News Crime journalist ]

(సిద్దిపేట జిల్లా) :-  తేదీ: 10-02-2024 నాడు జవహర్ నవోదయ విద్యాలయ IX & XI ప్రవేశ పరీక్ష, (ఎంట్రన్స్ టెస్ట్) సిద్దిపేట జిల్లాలో ఉన్న (07) కేంద్రాల వద్ద సి.ఆర్.పి.సి 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. తేది 10-02-2024 నాడు ఉదయం 0800 నుండి సాయంత్రం 4:00 గం: వరకు అమల్లో ఉన్నదని మరియు పరీక్ష జరుగు సమయములో పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. మరియు పోలీస్ అధికారులు ఇబ్బంది పరీక్ష సమయంలో పెట్రోలింగ్ చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పరీక్ష సమయానికి గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ,ఎటువంటి మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రాలు

1. సెంట్ మేరీస్ విద్యానికేతన్ ప్రజ్ఞాపూర్

2. సెంట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్ గజ్వేల్

3. తెలంగాణ మోడల్ స్కూల్ సంగాపూర్ రోడ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్

4. జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్

5. గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్

6. జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ ప్రజ్ఞాపూర్

7. జవహర్ నవోదయ విద్యాలయం వర్గల్