ఇంకా అధికారంలో ఉన్నట్లే బీఆర్ఎస్ నేతల ఫీలింగ్..మంత్రి పొన్నం
[Streetbuzz News Crime journalist]
(హైదరాబాద్బీ ):- ఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని, మేము ఏం చెబితే అది వినాలనే ఫీలింగ్‌లో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారన్నారు. రూ. 535 కోట్ల విలువ గల బస్ ఫెయిర్స్‌ని ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు కూ. 15వేలు ఇవ్వాలని హరీష్ రావు అంటున్నారని, మరి బీఆర్ఎస్ హయంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చలాన్ల పేరుతో వేల రూపాయలు వసులు చేశారని ఆరోపించారు.సభని తప్పుదోవ పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారని, అటో డ్రైవర్లను బీఆర్ఎస్ నేతలే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు.బస్సులు ప్రయాణికుల దగ్గరకు వెళ్లడం లేదని, ప్రయాణికులే బస్సుల దగ్గరకు ఆటోల ద్వారా వస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Feb 09 2024, 22:26