ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని సంతకాల సేకరణ
[Streetbuzz News Crime journalist]
సిద్దిపేట జిల్లా:
(కొండపాక ఫిబ్రవరి 09 ) :- కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అయిన రైతన్న కార్మిక వ్యవసాయ కౌలీల సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అమ్ముల బాల నర్సయ్య అన్నారు. శుక్రవారం రోజున వెలికట్ట గ్రామంలో సంతకాల సేకరణ,కరపత్రాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాలనర్సయ్య మట్టాడుతూ కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాల హామీని విస్మరించడంతో నేడు ఉద్యోగ కల్పన పడిపోయిందని,నిరుద్యోగం 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని శ్రామిక కుల నిజ వేతనాలు20 శాతం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ లను కార్మిక హక్కులను కాలరాస్తుందని అన్నారు. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్త పలకలనీ పెట్టుబడిదారుల లాభాల కోసం తిరిగి 12గం.ల పని విధానం అమల్లోకి తెస్తుంధన్నారు. భవన నిర్మాణ కార్మికుల ద్వారా వస్తున్న సేపు డబ్బులను ఇతర పథకాలకు మళ్లించి కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఇవ్వడం లేదని ప్రశ్నించినారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఎర్పాటు చేసి వ్యవసాయ కూలీల గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తగ్గించటం ఎంటాన్నారు.ఈ నేపధ్యంలో దేశంలోనికార్మిక,రై తాంగం,వ్యవసాయ కూలీలు మరియు సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు అమ్ముల పరుశరాములు,పబోజు లక్ష్మి నర్సయ్య,ఎర్ర సత్తయ్య,నర్సింహ రవి,ఎల్లమ్మ గారి నాగయ్య,భూమని నర్సయ్య,నాంపల్లి యాదయ్య,ముత్తనిశేఖర్,అమ్ముల పరుశరాములు, దొబ్బబాలయ్య,శ్రీనివాసు,బాలనర్సయ్య,ఎల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.
Feb 09 2024, 21:06