కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 300 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి
వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాజాకీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది -భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్
[Streetbuzz News Crime journalist]
సూర్యాపేట జిల్లా:
(మునగాల ఫిబ్రవరి 08):- బడ్జెట్లో వికలాంగులకు అధిక నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి బడ్జెట్లో వికలాంగులకు భరోసా కల్పించేలా నిధులు కేటాయించకుంటే బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క ఇంటిని ముట్టడిస్తామని మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కు విజ్ఞప్తి చేసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు గురువారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మునగాల మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలిసారి ప్రవేశపెట్టనన్న బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 300 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అయిన బట్టి విక్రమార్కను తమ సంఘం ఆధ్వర్యంలో కలిసి విజ్ఞప్తి చేశామని తమ విజ్ఞప్తి మేరకు వికలాంగుల సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క నిధులు కేటాయించాలి లేకుంటే బడ్జెట్ మంత్రి బట్టి ఇంటిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతోని అల్లాడిపోతుందని గత ప్రభుత్వ హయాంలోనూ ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు వికలాంగుల సంక్షేమ శాఖకు పైసా ఇవ్వకుండా వికలాంగులు సమాజాన్ని విస్మరించడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజ్యం పాలయిందని వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాజకీయ పార్టీల మనగుడా ప్రశ్నార్ధకమే అవుతుందని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతుంది కానీ అట్టడుగున ఉన్న వికలాంగుల సామాజిక వర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న హామీ అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తుందని ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ముందుకు రాకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రాష్ట్ర సాధన ఉద్యమంలో వైకల్యాణీ సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న వికలాంగుల సమాజానికి సంబంధించిన వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని ఇల్లు లేని నిరుపేద వికలాంగులకు ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు కోసం ఏండ్ల తరబడి సబ్సిడీ రుణాల కోసం ఎదురుచూస్తున్న వికలాంగులకు వెంటనే బ్యాంకు లింకేజీ తో సంబంధం లేకుండా రుణాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని వికలాంగుల పెన్షన్ 6000 వేలకు పెంచాలని వికలాంగుల మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. ఇటీవల నల్గొండలో జరిగిన వికలాంగుల దినోత్సవ సభలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వికలాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందంటూ గొప్పలు చెప్పటం శుభపరిణామామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల కోసం నల్లగొండ సీటును త్యాగం చేస్తానని చెప్పారని మంత్రికి వికలాంగుల సమాజంపై చిత్తశుద్ధి ఉంటే వికలాంగుల జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న భువనగిరి నల్లగొండ అసెంబ్లీ స్థానాలను వికలాంగులకు కేటాయించేలా కాంగ్రెస్ అధిష్టానం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.సంఘం మునగాల మండల అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్, తిమ్మారెడ్డి గూడెం మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ,సైదిరెడ్డి, సంఘం నాయకులు బలుపూనూరి శ్రీనివాస్ రెడ్డి, తిమ్మరెడ్డి, ఏసు రెడ్డి,ఎర్ర నాగలక్ష్మి ,కేతిరేడ్డి పిచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Feb 09 2024, 07:37