కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కారు, టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు

ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లి, కూతురుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు

మాజీ ముఖ్యమంత్రి శరత్ పవార్ కు ఈసి షాక్

లోక్ సభ ఎన్నికలు దగ్గర కొస్తున్న వేళ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు బిగ్ షాక్ తగిలింది.

ఎన్నికల సంఘం మహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ,ఎన్‌సీపీ,గా అధికారి కంగా గుర్తించింది. ఆరు నెలల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది.

శాసనసభలో మెజారిటీ నిరూపించుకున్న నేపథ్యంలో ఎన్సీపీ గుర్తు అజిత్ వర్గానికే చెందుతుందని ఈసీ తెలిపింది

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం తమ పార్టీకి కొత్త పేరు పెట్టుకునే వీలు కల్పిస్తు న్నట్లు ఈసీ పేర్కొంది. పార్టీ సింబల్ అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది

నేడు ఢిల్లీకి చంద్రబాబు

ఇవాళ చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళాను న్నారు. పొత్తులపై చర్చించ డానికి ఢిల్లీ రమ్మని చంద్ర బాబుకి అమిత్ షా ఆహ్వానం పంపారు

ఈ రాత్రికి అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ కానున్నారు.చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

టీడీపీతో పొత్తు పెట్టుకోవా లని హైకమాండు కు ఇప్ప టికే మెజార్టీ ఏపీ బీజేపీ నేతల సూచించారు

వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఈ నెల 9వ తేదీ లోపు కమిటీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం

వ్యూహం చిత్రాన్ని సెన్సార్‌ బోర్డు కమిటీ మరోసారి వీక్షించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు

వ్యూహం సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన తెదేపా

ఇరువైపులా ముగిసిన వాదనలు

ఈ నెల 9వ తేదీ లోగా సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సెన్సార్‌ బోర్డును ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

విద్యారత్న అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయురాలు శాంతిలత

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న శాంతి లత కు జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేఐసి స్వేచ్ఛాంద సంస్థ ప్రకటించిన విద్యారత్న అవార్డును మంచిర్యాల జిల్లా సీనియర్ అడ్వకేట్ KV, ప్రతాప్ ఆదివారం అందజేసి సాలువతో ఆమెను ఘనంగా సన్మానించారు.

మంచిర్యాల జిల్లా కేంద్రం లోని నస్పూర్ కాలనీ నరసయ్య భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జేసీఐ 3వ ఇన్ఫోలేషన్ శిరోమణి సెమినార్ ను జెసిఐ చైర్మన్ అరుముళ్ల రాజు. ఆధ్వర్యంలో నూతన జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్ నాయకత్వంలో సెమినార్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ జోన్ ప్రెసిడెంట్ గోవింద్ డాక్టర్ వెంకటేష్ పాలాకుల విపి ఆయుష్ కంపటి అనిల్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గావిచ్చేసిన మంచిర్యాల జిల్లా ఎంప్లా యిమెంట్ ఆఫీసర్ కౌశిక వెంకట్ రమణహాజరై ఆయన ప్రసంగించారు

విద్యారత్న అవార్డుకు ఎంపికైన శాంతిలతను ఆమె బంధువులు స్నేహితులు, తోటి ఉపాధ్యాయులు, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడునిసత్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

భారత మాజీ ఉప రాష్ట్రపతి పద్మ విభూషన్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మంత్రి జూపల్లి కృష్ణారావు శుభాకాంక్షలు చెప్పి సన్మానం చేశారు

అంతేకాదు ఫిబ్రవరి 4వ తేదీన పద్మ పురస్కార విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్మాన కార్యక్రమం ఉంటుందని దానికి తప్పక హాజరు కావాలని వెంకయ్యను మంత్రి ఆహ్వానించారు

అంతేకాదు ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవినీ జూపల్లి కలిశారు అనం తరం శుభాకాంక్షలు చెప్పి శాలువాతో సత్కరించారు సత్కార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు

కాగా ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాల‌కు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రముఖ సినీనటుడుమెగాస్టార్‌ చిరంజీవి ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య తోపాటు

సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య కేతావత్‌ సోమ్‌లాల్‌శిల్పకారుడు స్తప‌తి ఆనందాచారిని రాష్ట్ర ప్రభుత్వం ఘ‌నంగా స‌త్కరించ‌నుందిఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హ‌రికృష్ణ ఉన్నారు

దూకుడు పెంచిన కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు

కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై కరీంనగర్ పోలీసులు శుక్రవారం దృష్టిసారించారు. ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి స్కూల్ వాహనాలను పరిశీలిస్తు న్నారు

స్కూల్ బస్‌లు ఆటోల ఫిట్‌నెస్ చెక్ చేయడంతో పాటు ఇన్స్యూరెన్స్ డ్రైవర్ ట్రాక్‌ను చెక్ చేస్తున్నారు స్కూల్ వాహనాలపై గతంలో ఏమైనా యాక్సి డెంట్ కేసులు నమోదు అయ్యాయా డ్రైవర్‌పై చరిత్రపై ఆరా తీస్తున్నారు

అలాగే సదరు వాహనాల పెండింగ్ చలాన్లను పరిశీలి స్తున్నారు. ఇన్స్యూరెన్స్ క్లియర్ చేయని వాహనా లను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన ఈ స్పెషల్ డ్రైవ్ 10 గంటలవరకు కొనసాగింది

తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు మరోసారి స్పెషల్ డ్రైవ్ ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు

గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన

గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనకొనసాగింది. ఈ నేపథ్యంలో

గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు ప్రత్యేక అధికారులుగా కొనసాగ నున్నారు

మండలంలోని కేశవపట్నం కొత్తగట్టు రాజాపూర్ లో ఎంపీడీవో శ్రీవాణి

మొలంగూర్ వంకాయ గూడెంలో ఎమ్మార్వో అనుపమ

లింగాపూర్ తాడికల్ చింతగుట్ట మఖ్తలో ఎంపీఓ బషీరుద్దీన్

మిగతా గ్రామాల్లో వివిధ అధికారులు రానున్నారు

రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్‌లు ఈరోజు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని వుమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీగా బదిలీ చేశారు

ఆమె స్థానంలో తెలంగాణ మల్టీ జోనల్‌-2 ఐజీపీగా పనిచేస్తున్న తరుణ్‌ జోషిని రామగుండం సీపీగా నియమించారు

ఈ మేరకు డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు

మెగా కంపెనీలో స్థానిక మహిళా ఉద్యోగుల నిరసన

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పార్వతీ పంప్ హౌస్ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న మెగా కంపెనీ మరియు దాని సబ్ కాంట్రాక్టర్ గా ఉన్న పాల్కన్ కంపెనీ మరియు సెక్యూరిటీ కంపెనీలలో శ్రమదోపిడితో పాటు తక్కువ వేతనాలు ఇవ్వడమే కాకుండా స్థానిక ఉద్యోగులను మహిళలను అకారణంగా ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ, ఫాల్కన్ కంపెనీకి సంబంధించిన మహిళల ఉద్యోగులను అకారణంగా తొలగించడంతో సంవత్సరం నుండి కంపెనీ చుట్టూ తిరుగుతున్నారని, రెండుసార్లు నిరసన తెలుపగా కంపెనీ యజమాన్యం, మెగా కంపెనీ వారు తిరిగి ఉద్యోగాలకు తీసుకుంటానని హామీ ఇచ్చి తీరా ఉద్యోగానికి వచ్చేసరికి పని కల్పించకుండా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు

 అంతేకాకుండా మహిళలను అక్కడ ఉన్న సూపర్వైజర్ మానసికంగా వేధిస్తూ అవమానాలకు గురి చేస్తున్నాడని మహిళలు కంపెనీ వారికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు

 ఈ విషయంపై గురువారం మళ్లీ మెగా కంపెనీలో తొలగించబడిన మహిళలు నిరసన చేపట్టారు