ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం - జిల్లా కాంగ్రెస్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ & మార్క సతీష్,
ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం - జిల్లా కాంగ్రెస్ నాయకులు సొప్పదండి చంద్రశేఖర్ & మార్క సతీష్,
•ప్రతి చెరువును నింపేందుకు కృషి చేస్తాం-యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్ •
[సిద్దిపేట జిల్లా Crime Journalist]
(నారాయణరావుపేట 05-02-2024) :- మండలంలోని జక్కాపూర్ గ్రామంలో బతుకమ్మ చెరువులో గంగమ్మకు పూజ చేసి హారతి ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సొప్పదండి చంద్రశేఖర్ & మార్క సతీష్ మాట్లాడుతూ రంగనాయక సాగర్ ఎడమ కాలువ నుండి దాదాపు 70 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే ద్యేయంగా పెట్టుకున్న ప్రభుత్వ, ఈ ఎడమ కాలువ ద్వారా చిన్నకోడూర్, నారాయణరావుపేట, సిరిసిల్లలోని తంగలపెళ్లి మండలాల రైతులకు వ్యవసాయానికి నీళ్లు అందుతాయని అన్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేవలం పెద్ద కాలువలు మాత్రమే నిర్మించారని, అవ్వి కూడా అక్కడక్కడా పూర్తిగా అవ్వలేదని, దీని వలన చెరువులకు, కుంటాలకు, చెక్ డ్యాంలకు నీళ్ళు తీసుకపోవలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పరిస్థితి ఉందన్నారు. ఈ జక్కాపూర్ కాలువల ద్వారా నారాయణరావుపేట మండలంలోని కొన్ని గ్రామాలకు, తంగలపల్లి మండలంలోని కొన్ని గ్రామాలకు నీళ్లు వెళ్తున్నాయని, అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ త్వరలోనే అధిగమించి ప్రతి చెరువును నింపుతామని అన్నారు. ప్రధానంగా శనిగకుంటా మధిర గ్రామానికి ఆనాటి ప్రభుత్వం ఎలాంటి కాలువను చేయకపోవడం వలన ఈ రోజు సరిపడా నీళ్లు ఉన్న అక్కడికి అక్కడి రైతులకు అందకపోవడం ఇబ్బంది అన్నారు, ఈ విషయం త్వరలోనే మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, శరవేగంగా కాలువల నిర్మాణం జరిగేందుకు కృషి చేస్తామని అన్నారు. అదేవిధంగా రైతులు ఎవ్వరు కూడా ఈ నీళ్ళ విషయంలో గందరగోళనికి గురి కావద్దని, ఎలాంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకువస్తే, మంత్రుల మాట్లాడతాం అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, బుచ్చెల్లి రవి, ఎల్లం, మండల నాయకులు రాగుల అశోక్, పల్లె పర్శరాములు, గ్రామ అధ్యక్షులు బోయిని బాలయ్య, ఉపాధ్యక్షులు మాట్ల రాజు, నిరుగొండ దేవయ్య, పల్లె ప్రశాంత్, సారుగు హరికృష్ణ, దాసరి కాంతయ్య, జక్కుల కనకయ్యా, పనుగట్ల ఆంజనేయులు, కంకణాల రమేష్,విట్టల్, ఎండి హైమద్, గుండెలి వేణు తదితరులు పాల్గొన్నారు.
Feb 06 2024, 07:44