మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి.

మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి.

మేడారం: [ Crime journalist మేడారం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. మేడారంలో ఎత్తు బంగారాన్ని (బెల్లం) కొనుగోలు చేసిన భక్తుల వివరాలను సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులను ఎక్సైజ్ శాఖ నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని అధికారులు తెలిపారు. గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఈ నిబంధనలు పెట్టామన్నారు. గుడుంబా తయారీకి బెల్లాన్ని విక్రయించిన వారికి రూ. లక్ష జరిమానా విధిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా,ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా చదువు అన్నారెడ్డి

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా చదువు అన్నారెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: [ Crime Journalist ]:

(మొగుళ్ళపల్లి):- మండలంలోని మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన నిర్వహించే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రెండు గ్రామాల జాతర ఉత్సవ కమిటీ డైరెక్టర్లు తెలిపారు. శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా చదువు అన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా మల్సాని నరసింగారావు, బుర్ర మహేందర్, ఎలేటి రాజిరెడ్డి, బుర్ర సదయ్య, బండారి బొందయ్య, రాజయ్య, పడిదల జగ్గారావు, కొడారి ఓదెలు, సహాయ కార్యదర్శులుగా శనిగరపు లింగయ్య, వెన్నెండ్ల రవి, చెక్క కొమురయ్య, పసునూటి సార పాపయ్య, కోశాధికారులుగా వీణవంక నవీన్ కుమార్, రక్తాన్ని గోపాల్ రావు, పడిదల నర్సింగారావు, వీణవంక రాజు, చింతకింది నగేష్, కనికిరెడ్డి మల్లయ్య, వీణవంక రాజన్న, బండారి పోచయ్య, ఓనపాకల బాబు, నల్లభీమ్ మల్లయ్య, గాజుల దామోదర్, బత్తిని శంకరయ్య, వీణవంక నిరంజన్, అన్న సదయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డైరెక్టర్లు తెలిపారు.

కుల గణనకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్ కు ధన్యవాదాలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అనిల్ గౌడ్

కుల గణనకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్ కు ధన్యవాదాలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అనిల్ గౌడ్

తెలంగాణ రాష్ట్రం:

[ Crime journalist ]:-

రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీల జీవిత కాల వాంఛ అయిన కుల గణనకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్ కి ధన్యవాదాలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అనిల్ గౌడ్

మేమెంతో మాకంత అన్న నినాదాన్ని నిజం చేయడంలో కుల గణన తొలి అడుగు

తొలి అడుగుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క గారికి, తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు

అణగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేరాలంటే జనాభా లెక్కలు తేలాలి

అందుకే కుల గణనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది

బీసీలు అంటే వెనకబడ్డ కులాలు కాదు రాష్ట్రానికి, దేశానికి వెన్నెముక వర్గాలు

వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందడానికి ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమే సాక్ష్యం

సంక్షేమమే మా అజెండా.. సమాజిక న్యాయమే మా జెండా

ఏసీబీ కి చిక్కిన మహ్మదాబాద్ ఎస్ఐ.సురేష్

ఏసీబీ కి చిక్కిన మహ్మదాబాద్ ఎస్ఐ.సురేష్

మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ కి చిక్కిన మహ్మదాబాద్ ఎస్సై సురేష్

[ Crime journalist] :-

మహ్మదాబాద్ మం. పగిడాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారునీపై ప్రేమ వ్యవహారంపై మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సురేష్ 50 వేలు డిమాండ్ చేశారు, బాధితులు మొదటగా 30 వేలు చెల్లించగా, మిగతా నగదు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న జిరాక్స్ సెంటర్ యజమాని మూసాకి 20,000 డబ్బులు చెల్లించాలని, లేనియెడల మీ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామాని ఎస్సై బెదిరింపులకు పాల్పడడంతో భాదితులు కృష్ణారెడ్డి ఏసీబీ అధికారులు ఆశ్రయించారు., రాత్రి సమయంలో జిరాక్స్ యాజమానీ మూసాకి బాధితులు 20 వేల డబ్బు చెల్లిస్తూ ఉండడంతో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ,ఎస్సై సురేష్ పై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు

ఆర్థిక స్థితిపై భర్తను భార్య అవహేళన చేయడమూ క్రూరత్వమే : హైకోర్టు

ఆర్థిక స్థితిపై భర్తను భార్య అవహేళన చేయడమూ క్రూరత్వమే : హైకోర్టు

ఆర్థిక స్థితి గురించి భర్తను భార్య తరచుగా ఎత్తిపొడవడం, అవహేళన చేయడం కూడా మానసిక క్రూరత్వమేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

ఇటువంటి క్రూరత్వాన్ని ఎదుర్కొన్న సందర్భాల్లో విడాకులను కోరే హక్కు భర్తకు లభిస్తుందని తెలిపింది.

ఆర్థిక స్థోమతకు మించిన కలలను నెరవేర్చమని భర్తపై భార్య ఒత్తిడి చేయడం సరికాదని న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైత్ , నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

అనవసర అంశాలపై రాద్ధాంతం చేస్తూ భర్తపై భార్య ఒత్తిడిని పెంచడం సరికాదు. దీనివల్ల జీవితంలో సంతృప్తి, ప్రశాంతతలకు చోటులేకుండా పోతుంది. భర్తపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

వైవాహిక జీవితంలో ఉన్నవారు తమ అవసరాలు, కోరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి’’ అని ధర్మాసనం సూచించింది.

భార్య టార్చర్‌ను భరించలేక విడాకుల కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు ఫ్యామిలీ కోర్టు అనుమతించింది. దీన్ని సవాల్ చేస్తూ సదరు మహిళ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది.

విడాకులను పొందేందుకు బాధిత భర్తకు అనుమతి ఇస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది.

తన తల్లిదండ్రుల నుంచి రూ.8వేలు అప్పు తీసుకున్న విషయాన్ని పదేపదే చెప్పి భర్తను భార్య టార్చర్ చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హర్యానా నుంచి ఢిల్లీకి కుటుంబాన్ని షిఫ్ట్ చేయాలని భర్తను ఆమె బలవంత పెట్టడాన్ని కూడా న్యాయస్థానం తప్పుపట్టింది.

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ని గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-గిద్దె రాజేష్

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ని గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-గిద్దె రాజేష్

[Crime journalist]:

[సూర్యాపేట జిల్లా 04-02-2024]:-భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యునిగా గూగుల్ శేఖర్ రెడ్డి నియమించి నియామక పత్రం అందజేసిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ .సంఘం జిల్లా అధ్యక్షులు గా కుర్ర గోపి యాదవ్ నియామకం చేసినట్లు తెలిపారు.భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి BVHPS ను గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు ఆదివారం సూర్యపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామంలో నిర్వహించిన మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సంఘం ఆత్మకూరు మండల అధ్యక్షునిగా పనిచేస్తున్న గోగుల శేఖర్ రెడ్డిని పనితీరును అభినందిస్తూ ఆయనను జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యమే లక్ష్యంగా ఏర్పడిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి BVHPS గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు సంఘం నాయకులు కృషి చేయాలని సంఘంలో నాయకులుగా బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేసే సంఘం బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన గోగుల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ గార్లకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ గార్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూర్యాపేట జిల్లాలో సంఘం బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచాల వెంకటయ్య, ఆరూరి బాబు ,నర్సిరెడ్డి ,లక్ష్మయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు భారీ రాయితీ ఈ నెల 15వ తేదీ వరకు గడువు - సద్వినియోగం చేసుకోవాలి - పోలీస్ కమిషనర్

చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు భారీ రాయితీ ఈ నెల 15వ తేదీ వరకు గడువు - సద్వినియోగం చేసుకోవాలి - పోలీస్ కమిషనర్

సిద్దిపేట జిల్లా [ Crime Journalist 04-ఫిబ్రవరి-2024 ]:- 

(సిద్దిపేట జిల్లా):- జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు తేదీ: 15-02-2024 లోపు సద్వినియోగం చేసుకోగలరని తెలోపిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., అధికారిణి.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు రాష్ట్ర ప్రభుత్వం భారీరాయితీ ప్రకటించడం జరిగిందని ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ చాలన్ డబ్బులు పెండింగ్ ఉన్న వాహనదారులు ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ డబ్బులు చెల్లించాలి.ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలన్ లు చెల్లించాలి.

•ఆన్లైన్ అనగా ఫోన్ పే &

 పే టీం ఏం & గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చు.లేదా మీ సేవ ఈ సేవ లో చెలించవచ్చు.  

తేదీ: 15-02-2024 వరుకు ట్రాఫిక్ చాలన్ లకు.రాయితీ వర్తిస్తుంది•

ద్విచక్ర వాహనలకు 80% శాతం రాయితీ,ఆర్టీసీ బస్సులు ఆటోలకు, తోపుడు బండ్లపై 90% శాతం రాయితీ,నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు 60% శాతం రాయితీ•

•చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి•

echallan.tspolice.gov.inతెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు 15-02-2024 వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వాహనాలపై ఎలాంటి జరిమానా లేకుండా చూసుకోవాలని సూచించారు.15 తారీకు తర్వాత జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ చాలన్ పెండింగ్ వాహనదారులను గుర్తించి పెండింగ్ ఉన్న మొత్తం డబ్బులను కట్టించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

పెద్దపల్లి ఎంపీ టికెట్ నాకే కేటాయించాలని శ్రీ ఉత్తం కుమార్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించిన గవ్వల శ్రీకాంత్

పెద్దపల్లి ఎంపీ టికెట్ నాకే కేటాయించాలని శ్రీ ఉత్తం కుమార్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించిన గవ్వల శ్రీకాంత్ 

హైదరాబాద్:

[ Crime journalist ]

పెద్దపల్లి ఎంపి టికెట్ నాకే కేటాయించాలని శ్రీ ఉత్తం కుమార్ రెడ్డి నీటి పారుదల మరియు సివిల్ సప్లయ్ శాఖ మంత్యులు హైదరాబాద్ గారికి వినతిపత్రం సమర్పించినట్లు గవ్వల శ్రీకాంత్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ రాష్ట్రంలో బలపడటానికి చాల కష్టపడటం జరిగిందని అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చిఎన్నికల ప్రచారంలో పాల్గొనటం జరిగిందని గవ్వల శ్రీకాంత్ అన్నారు. గవ్వల శ్రీకాంత్ నేతకాని సామాజిక వర్గానికి చెందిన నేను కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బలోపేతం చేయడానికి ప్రచారం చేయడం గత పది సంవత్సరాలలో శక్తికి మించి కాంగ్రెస్ పార్టీ బలపడటానికి వివిధ రకాలుగా ప్రజలతో విద్యార్థి యువకులతో మేధావులతో ఉద్యోగులలో చర్చలు జరపడం పత్రికలలో సోషల్ మీడియాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగిందన్నారు. స్థానిక మరియు ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమములో పెద్ద ఎత్తున జరిగిన పోరాటాలలో పాల్గొనడం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో జిల్లా జే ఏ సి చైర్మన్ గా కన్వీనర్ గా అధ్యక్షులుగా పనిచేయడం జరిగిందని ప్రస్తుతం అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ లో రాష్ట్ర అధ్యక్షులుగా పని చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ గా నాకే పెద్దపల్లి ఎంపి టికెట్ ఈవ్వాలని గవ్వల శ్రీకాంత్ మాజి పిసిసి అధ్యక్షులు మంత్యు లు శ్రీ ఉత్తం కుమార్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించినట్లు గవ్వల శ్రీకాంత్ తెలిపారు.

అభినందనలతో 

గవ్వల శ్రీకాంత్ (నేతకాని-SC)

GP,, దేవునిగుడ మం,, జన్నారం. జి,, మంచిర్యాల 504205

రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ ఎస్ సి, ఎస్ టి, బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం (TVYS)

వంచిత్ బహుజన్ ఆఘాడి (VBA)

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI)

మరియు

తెలంగాణ ఉద్యమ నాయకులు 

సేల్ No. 9492744055

అడ్వానికీ భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన- సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు

అడ్వానికీ భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన- సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు 

సిద్దిపేట జిల్లా [ Crime Journalist ]

ఫిబ్రవరి04 (హుస్నాబాద్ నియోజకవర్గం )

[ కోహెడ ]:- రాజకీయ కుర వృద్దుడు, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వానికీ భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరించడం పట్ల ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పిడిశెట్టి రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం మాజీ హోంమంత్రి శ్రీ లాల్ కృష్ణ అడ్వాణి జీవితం చాలా గొప్పదని ఆయన పేర్కొన్నారు. హిందూ వాదిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు భారతదేశ ప్రజలకు అందించిన వారు ఆయనే ఆని కొనియాడారు. భారతరత్న రావడం శుభ సూచకమని అన్నారు. సమాజం నాకేమిచ్చింది అనీ కాకుండా సమాజానికి నేనేం చేయాలని అను నిత్యం ఆలోచించే మహానుభావుడని పేర్కొన్నారు. ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వడం పట్ల ప్రత్యేకమైన భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ కి కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అదేవిదంగా దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ భారతరత్న ఇవ్వాలనీ ప్రధాని మోడీకి ఉత్తరం(లేఖ) ద్వారా విజ్ఞప్తి చేశారు. పివికి భారతరత్న ఇవ్వాలనీ గతంలో ఆరు వేల కిలోమీటర్లు సైకిల్ యాతత్ర చేశామని రాజు గుర్తు చేశారు.

హైదరాబాద్ కల్లు సొసైటీ ల పైన ఉద్దేశపూర్వకమైన దాడులు ఆపాలని డిమాండ్ చేసిన గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అద్యక్షులు

హైద్రాబాద్ కల్లు సొసైటిల పైన ఉద్దేశపూర్వకమైన దాడులు ఆపాలని డిమాండ్- నారాయణ గౌడ్ 

గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అద్యక్షులు

పోరం పర్ గుడ్ గవర్నెన్స్ వారికి హైద్రాబాద్ లో 

గల్లీ గల్లీ లో గంజాయి; డ్రగ్ దందాలు

కనిపించడం లేదా; కేవలం కల్లుగీత వృత్తిదారుల పైన; వేలాది మంది సొసైటిల పైన ఆదరపడిన గీతన్నల పైన మీ అక్కాస్ ఎందుకు?

హైదరాబాద్:[Crime journalist]:-

 కల్తీ కల్లు పేరు చెప్పి మొత్తం వేలాది మంది ఆదరపడిన కల్లుగీత సొసైటిల పైన మీ ఆరోపనలు అర్ధ రహితం ; హైద్రాబాద్ లో అనేక ఆహార పదార్థాలు; పాలు; ఎన్నో పేరెన్నికగన్న సంస్థల పేరుతో కల్తీ జరుగుతుంటే మీకు అవి ఏవి కనిపించడం లేదా; హైద్రాబాదు కు వచ్చే అనేక ఆహార పదార్థాలు; పాలు; కూరకాయలు సుదురా ప్రాంతాల నుండి రావడం లేదా కేవలం కల్లుకు మాత్రమే యాబై కిలో మీటర్ల పరిధి Golden,కేవలం ఒక సామాజిక వర్గమైన గౌడ సమజం పైన కావాలని చేస్తున్న కుట్రగా గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటి గా మేము బావిస్తున్నాము.దీనిపైన బహిరంగ చర్చ కు మేము సిద్ధంగా ఉన్నాము; మీరు సిద్ధంగా ఉన్నారా:

కల్లుగీత వృత్తిదారుల పైన; గౌడ సామాజిక వర్గంపైన మీ ఉద్దేశ పూర్వకమైన దాడులు ఆపాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటిగా డిమాండ్ చేస్తున్నాను.