భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ని గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-గిద్దె రాజేష్
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ని గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి-గిద్దె రాజేష్
[Crime journalist]:
[సూర్యాపేట జిల్లా 04-02-2024]:-భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యునిగా గూగుల్ శేఖర్ రెడ్డి నియమించి నియామక పత్రం అందజేసిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ .సంఘం జిల్లా అధ్యక్షులు గా కుర్ర గోపి యాదవ్ నియామకం చేసినట్లు తెలిపారు.భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి BVHPS ను గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు ఆదివారం సూర్యపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామంలో నిర్వహించిన మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సంఘం ఆత్మకూరు మండల అధ్యక్షునిగా పనిచేస్తున్న గోగుల శేఖర్ రెడ్డిని పనితీరును అభినందిస్తూ ఆయనను జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యమే లక్ష్యంగా ఏర్పడిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి BVHPS గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు సంఘం నాయకులు కృషి చేయాలని సంఘంలో నాయకులుగా బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేసే సంఘం బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన గోగుల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ గార్లకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ గార్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూర్యాపేట జిల్లాలో సంఘం బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచాల వెంకటయ్య, ఆరూరి బాబు ,నర్సిరెడ్డి ,లక్ష్మయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Feb 04 2024, 18:47