చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు భారీ రాయితీ ఈ నెల 15వ తేదీ వరకు గడువు - సద్వినియోగం చేసుకోవాలి - పోలీస్ కమిషనర్
చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు భారీ రాయితీ ఈ నెల 15వ తేదీ వరకు గడువు - సద్వినియోగం చేసుకోవాలి - పోలీస్ కమిషనర్
సిద్దిపేట జిల్లా [ Crime Journalist 04-ఫిబ్రవరి-2024 ]:-
(సిద్దిపేట జిల్లా):- జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు తేదీ: 15-02-2024 లోపు సద్వినియోగం చేసుకోగలరని తెలోపిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., అధికారిణి.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు రాష్ట్ర ప్రభుత్వం భారీరాయితీ ప్రకటించడం జరిగిందని ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ చాలన్ డబ్బులు పెండింగ్ ఉన్న వాహనదారులు ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ డబ్బులు చెల్లించాలి.ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలన్ లు చెల్లించాలి.
•ఆన్లైన్ అనగా ఫోన్ పే &
పే టీం ఏం & గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చు.లేదా మీ సేవ ఈ సేవ లో చెలించవచ్చు.
తేదీ: 15-02-2024 వరుకు ట్రాఫిక్ చాలన్ లకు.రాయితీ వర్తిస్తుంది•
ద్విచక్ర వాహనలకు 80% శాతం రాయితీ,ఆర్టీసీ బస్సులు ఆటోలకు, తోపుడు బండ్లపై 90% శాతం రాయితీ,నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు 60% శాతం రాయితీ•
•చెల్లింపులు అన్ని ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి•
echallan.tspolice.gov.inతెలంగాణ ఈ చాలన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు 15-02-2024 వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వాహనాలపై ఎలాంటి జరిమానా లేకుండా చూసుకోవాలని సూచించారు.15 తారీకు తర్వాత జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ చాలన్ పెండింగ్ వాహనదారులను గుర్తించి పెండింగ్ ఉన్న మొత్తం డబ్బులను కట్టించడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Feb 04 2024, 17:09