అడ్వానికీ భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన- సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు
అడ్వానికీ భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన- సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు
సిద్దిపేట జిల్లా [ Crime Journalist ]
ఫిబ్రవరి04 (హుస్నాబాద్ నియోజకవర్గం )
[ కోహెడ ]:- రాజకీయ కుర వృద్దుడు, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వానికీ భారత దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న వరించడం పట్ల ప్రముఖ సామాజిక కార్యకర్త, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పిడిశెట్టి రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం మాజీ హోంమంత్రి శ్రీ లాల్ కృష్ణ అడ్వాణి జీవితం చాలా గొప్పదని ఆయన పేర్కొన్నారు. హిందూ వాదిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు భారతదేశ ప్రజలకు అందించిన వారు ఆయనే ఆని కొనియాడారు. భారతరత్న రావడం శుభ సూచకమని అన్నారు. సమాజం నాకేమిచ్చింది అనీ కాకుండా సమాజానికి నేనేం చేయాలని అను నిత్యం ఆలోచించే మహానుభావుడని పేర్కొన్నారు. ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వడం పట్ల ప్రత్యేకమైన భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ కి కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అదేవిదంగా దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీ భారతరత్న ఇవ్వాలనీ ప్రధాని మోడీకి ఉత్తరం(లేఖ) ద్వారా విజ్ఞప్తి చేశారు. పివికి భారతరత్న ఇవ్వాలనీ గతంలో ఆరు వేల కిలోమీటర్లు సైకిల్ యాతత్ర చేశామని రాజు గుర్తు చేశారు.
Feb 04 2024, 13:25