ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె నోటీసు ను ఎంఈఓ కార్యాలయంలో ఎం ఐ ఎస్ సురెందర్ కు సమర్పించిన సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు
ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె నోటీసు ను ఎంఈఓ కార్యాలయంలో ఎం,ఐ,ఎస్ కోఆర్డినేటర్ సురెందర్ కు సమర్పించిన సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు.
•కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే కార్మిక పరిషత్తుల సమస్యలు పరిష్కరించాలి •
సిద్దిపేట జిల్లా:
[కొండపాక Crime journalist] :- కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజల ఐక్యతకు విఘాతం కలిగిస్తూ ప్రజలపై అనేక ఆంక్షలు విధించి దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తుందని బాల నర్సయ్య మండిపడ్డారు. శనివారం రోజున ఎంపీడీవో రామిరెడ్డి,ఎం ఈ ఓ ఆఫీసులో ఎం ఐ యస్ కోఆర్డినేటర్ సురేందర్ లకు ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బందులో కార్మికులు కర్షకులు పాల్గొంటున్నట్టు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల నరసయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతూ ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. సాగు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చే రైతుల భవిష్యత్తును నాశనం చేసే విధానాలు చేపట్టిందన్నారు పోరాడి సాధించుకున్న కార్మిక కర్షక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దుచేసి పెట్టుబడిదారు కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చే కార్మిక హక్కులను హరించి వేసింది అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రజలపై మోయలేని బారాలు పడుతున్నాయన్నారు .దేశంలో రోజురోజుకు ఆకలి దరిద్రం నిరుద్యోగం పేదరికం పెరిగిపోతుందన్నారు.కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు దేశ సంపదలను దోచిపెడుతున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను దివాలా తీసివేసి తీయించి ప్రైవేటీకరణ విధానాలను యదేచ్చగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. స్కీం వర్కర్ ల సమస్యలు పరిష్కరించే కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు .గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెంచాలని గ్రామపంచాయతీ కార్మికులు అందర్నీ పర్మినెంట్ చేసి కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. 51 జీవోను సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి ప్రస్తుతం కొనసాగుతున్న కేటగిరీలను కొనసాగించాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ జీతాలు బిల్లులు చెల్లించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కార్మిక పరిషత్తుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో హమాలీలు గ్రామపంచాయతీ కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు స్కీం వర్కర్లు అంగన్వాడి ఆశ వివిధ రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బర్మా కొమురయ్య, మండల మండల అధ్యక్ష కార్యదర్శులు ఆరుట్ల నరసింహులు, జాలిగామ ప్రభాకర్ ,లస్కర్ రామచంద్రం ,మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ మండల కార్యదర్శి బైరెడ్డి లీలా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాస రమేష్, కొమ్ము పద్మ ,కాసా నాగలక్ష్మి, కొమ్ము లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Feb 04 2024, 06:39