డిగ్రీ పూర్తైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అవగాహన కరపత్రం విడుదల చేసిన కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్
డిగ్రీ పూర్తైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అవగాహన కరపత్రం విడుదల చేసిన కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్
కేయూ క్యాంపస్
[Crime journalist]
•ఈనెల 6న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కు ఆఖరి తేదీ•
డిగ్రీ పూర్తయిన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అవగాహన కరపత్రాన్ని విడుదల చేసిన కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ టిజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్.
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు కేయూ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం (టి.జి.ఫ్) అధ్యక్షులు ఎర్రం రమేష్ గారి ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ బి.విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు ఉన్నా గాని మళ్లీ కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్లకే ఓటు హక్కు ఉంటుందని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్ రాజు నోటిఫికేషన్ లో తెలిపారు, కావున ఏదైనా డిగ్రీ 2020 నవంబర్ 1 నాటికి పూర్తి చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టి.జి.ఫ్ రాష్ట్ర అధ్యక్షులు కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ మాట్లాడుతూ ఈనెల ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఆఖరి తేదీ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ఆన్లైన్ లో ceotelangana.nic.in link ద్వారా స్వయంగా మీ మొబైల్ ఫోన్లో గాని, ఇంటర్నెట్ సెంటర్లో గాని, మీ సేవలో గాని గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు చేసుకోవాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకులు ,కాకతీయ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రాంబాబు, కాకతీయ యూనివర్సిటీ పోటీ పరీక్షల సంచారకులు డాక్టర్ టి. నాగయ్య, కేయూ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కర్రే సదాశివ్, డాక్టర్ మంజుల, డాక్టర్ శ్రీలత, డాక్టర్ సంధ్య, డాక్టర్ ఆగపాటి రాజ్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Feb 03 2024, 22:29