శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరను సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి -స్పెషల్ అధికారులకు జాతర డైరెక్టర్ల విన్నపం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
[Crime journalist]:-
(మొగుళ్ళపల్లి):- మండలంలోని మొగుళ్ళపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాతర ఉత్సవ కమిటీ డైరెక్టర్లు మొగుళ్లపల్లి, ముల్కలపల్లి గ్రామాలకు చెందిన స్పెషల్ అధికారులకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైనప్పటినుండి రాజకీయ పార్టీలకతీతంగా మొగుళ్ళపల్లి, ముల్కలపల్లి గ్రామాలకు చెందిన డైరెక్టర్లందరూ కలిసి జాతర ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని, ప్రశాంతమైన వాతావరణంలో జాతర ఉత్సవాలను నిర్వహించుకునే వారమని డైరెక్టర్లు తెలిపారు. కాగా ప్రస్తుతం జాతర ఉత్సవ కమిటీలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో..జాతర ఉత్సవ కమిటీ ఎన్నికల్లో జాప్యం జరుగుతుందన్నారు. కాగా డైరెక్టర్లమంతా కలిసి జాతర ఉత్సవాలను సజావుగా నడిపించే సమర్థత కలిగిన వారిని ఎంపిక చేసుకుందామనుకుంటే అందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడంతో..కొంతమేర జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా రెండు గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ స్పెషల్ అధికారులు, ఎండోమెంట్ అధికారులు చొరవ తీసుకొని డైరెక్టర్లమంతా కలిసి జాతర ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Feb 03 2024, 21:41