భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావు తో తమ ఆవేదన చెప్పిన ఆటో డ్రైవర్ లు
భద్రాచలంలో మాజీ మంత్రి హరీశ్ రావుతో తమ ఆవేదన చెప్పుకున్న ఆటో డ్రైవర్లు
భద్రాచలం [Crime journalist]:-
ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డుమీద పడ్డామని బాధపడ్డ ఆటో డ్రైవర్లు తెలిపారు.తమను ఆదుకోవాలని, తమ పక్షాన పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావును కోరిన ఆటో డ్రైవర్లు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించి, ప్రతి నెలా ఆర్థిక సహాయం అందేలా చేస్తామని చెప్పిన హరీశ్ రావు.ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు బాధాకరమన్న హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం దిగివచ్చి న్యాయం చేసే దాకా పోరాటం చేస్తామన్నారు.
Feb 03 2024, 17:52