భద్రాచలం రాముడిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్ది రాజు
మాజీ మంత్రి హరీష్ రావు తో కలిసి భద్రాచలం రాముడిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు
భద్రాచలం:
[ Crime journalist ఫిబ్రవరి, 3] :-
మాజీ మంత్రి హరీష్ రావు భద్రాచలం పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. తొలుత ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు. గర్భ గుడిలో స్వామి వారి దివ్య మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హరీష్ రావు తో పాటు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, దిండిగాల రాజేందర్ తదితరులు ఉన్నారు.
Feb 03 2024, 12:22