ఆలేరు లో జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం
భువనగిరి జిల్లా: [Crime journalist ]:-
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం శుక్రవారం ఆలేరు లో జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు హాజరై మహిళా కాంగ్రెస్ నాయకులకు దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గాజుల సుకన్య ( నకిరేకల్ 4 వ వార్డు కౌన్సిలర్), జిల్లా అధ్యక్షురాలు గోపగోని మాధవి గారు, జిల్లా ఉపాధ్యక్షురాలు బొడ్డుపల్లి జానకమ్మ, కట్టంగూర్ మండల మహిళా అధ్యక్షురాలు మేడి ఈశ్వరమ్మ, కట్టంగూర్ టౌన్ అధ్యక్షురాలు తండు పద్మ, ఉపాధ్యక్షురాలు ఊట్కూరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Feb 03 2024, 07:39