గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ పాల్గొన్న ఎస్ఐ మాధవ్
గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ
-పాల్గొన్న మొగుళ్ళపల్లి ఎస్సై మాధవ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
[Crime journalist] :-
(మెట్టుపల్లి):- గర్భిణీ స్త్రీలు మానసిక ప్రశాంతతో పాటు తాజా పండ్లు, పౌష్టిక ఆహారం భుజించి ఆరోగ్యంగా ఉండాలని మొగుళ్లపల్లి ఎస్ఐ తీగలమాధవ్ గౌడ్ గర్భిణీలకు సూచించారు. శుక్రవారం మొగుళ్ళపల్లి మండలంలోని మెట్టుపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో గర్భిణీ మరియు బాలింత స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఎస్ఐ చేతుల మీదుగా నిర్వహించారు. మెట్టుపల్లి గ్రామానికి చెందిన గజ్జి రాజ్ కుమార్, ఏకాంబ రామారావు, తెప్పరాజు, జనగాం శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ పాల్గొని గర్భిణీ స్త్రీలతో పాటు బాలింతలకు మరియు విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ సామాజిక సేవ ద్వారా గ్రామాలలో నిరుపేదలకు సేవలందిస్తున్న గజ్జి రాజ్ కుమార్, రామారావు, జనగాo శ్రీను, తెప్పరాజులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెట్టుపల్లి ఎంపీటీసీ మంద సుధాకర్, మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు మంద స్వామి, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, స్కూల్ హెడ్మాస్టర్ విష్ణుమూర్తి, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, నాయకులు పాల్గొని మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ ను ఘనంగా శాలువాతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో కారోబార్, ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Feb 03 2024, 07:13