బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటీఆర్ - ఇంటికి వెళ్ళి ఆర్థికసాయం అందజేత


బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటిఆర్

ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత

కృతజ్ఞతలు చెప్పిన తల్లిదండ్రులు

[Crime journalist ఘట్ కేసర్] :-

ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆర్దిక కష్టాలపాలైనా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఆ తల్లిదండ్రులు చేయించారు.. కానీ దురదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.మరోసారి చికిత్స కోసం ఆస్పత్రిలో సంప్రదిస్తే ఆపరేషన్ కోసం ఏడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ప్రదీప్ కుటుంబం అవేదనకు గురయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి మంత్రి మల్లారెడ్డి చొరవ తీసుకుని అపరేషన్ కు అవసరం అయిన 6లక్షల సహాయాన్ని ఈఎస్ ఐ ద్వారా సాయం చేశారు. అయితే రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి మిగిలిన లక్ష రూపాయలు కూడా జమ చేయడం కష్టంగా మారింది. సమస్యను తెలుసుకున్న బీఆర్ఎస్ స్థానిక కౌన్సిలర్ ఆంజనేయులు విషయాన్ని కేటిఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో నేడు మేడ్చల్ నియోజకవర్గం కృతజ్ఞతా సభలో పాల్గొన్న కేటీఆర్ సభ ముగిసిన తరువాత మల్లారెడ్డితో కలిసి ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీలోని ప్రదీప్ ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. తాను అండగా ఉంటానని ఆ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. తమ కుమారుడి ఆపరేషన్ కు సాయం చేసిన కేటీఆర్, మల్లారెడ్డి గారికి ఎప్పుడూ ఋణపడి ఉంటామని ప్రదీప్ కుటుంబ సభ్యులు తెలిపారు. బీఅర్ ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి - ఎస్ఐ

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి - ట్రాఫిక్ ఎస్ఐ

సూర్యాపేట జిల్లా: [Crime journalist]

(సూర్యాపేట):-వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ యం. నవీన్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు చౌరస్తాల్లో ఫ్రీ లెఫ్ట్‌ బోర్డులను ఏర్పాటు చేసి మాట్లాడారు. రోజు రోజుకు ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతుండడంతో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ, రోడ్లపై సురక్షిత ప్రయాణం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌ తదితరులు ఉన్నారు.

భువనగిరి నూతన సిఐ ని సన్మానించిన పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్

టౌన్ నూతన సిఐ ని సన్మానించిన పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్*

భువనగిరి జిల్లా:[Crime journalist] :- భువనగిరి టౌన్ నూతన సీఐ సురేష్ కుమార్ ను  సిఐ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సన్మానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ . అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ,బీసీ అగ్రవర్ణ పేదలపై పై జరుగుతున్న దాడులను అరికట్టాలని, త్వరలో ఎలక్షన్స్ ఉన్నందున రాజకీయ ఒత్తులకు లోన్ అవుతున్నందున టౌన్ లో పోలీస్ పీకేట్లు ఏర్పాటు చేయాలని మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అందరికీ సమాన న్యాయం జరిగేలా చూడాలని కోరారు .ఈ సన్మాన కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, మహేష్, లింగస్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేయుత

మృతుల కుటుంబానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేయూత

ఆంధ్రప్రదేశ్:

[Crime journalist] :-

• రాష్ట్రంలో ఎక్కడ లేని విధముగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిరుపేదలు ఎవరు చనిపోయిన వారికి ₹10000 /-అందజేస్తున్న ఎమ్మెల్యే.•

•తన కుమార్తె నిశ్చితార్థం అవడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి ఇంటికి వెళ్ళకూడదు అని ఉండడంతో కర్మంత్రాలు అనంతరం నేడు మృతుని కుటుంబాలకు ₹30,000/- వేల రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి*

శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పెద్ద సింగమాల గ్రామానికి చెందిన నడిపయ్య, సుబ్బరాయులు, భాస్కర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. తన కుమార్తె నిశ్చితార్థం అవ్వడంతో నాడు ఇవ్వలేని ఆర్థిక సహాయం ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ₹30,000/- రూపాయలను నేడు వారికి అందజేసిన ఎమ్మెల్యే గారి సతీమణి బియ్యపు శ్రీవాణీ రెడ్డి.అలాగే వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

బీజేపీ ఆధ్వర్యంలో గాన్ చలో అభియాన్ కార్యాక్రమం

బీజేపీ ఆధ్వర్యంలో గావ్ చలో ఆబియాన్ కార్యాక్రమం 

నల్లగొండ జిల్లా:

[Crime journalist] :-

నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండల సమావేశం మండల అధ్యక్షులు పబ్బు వెంకన్న ఆధ్వర్యంలో గావ్ చలో ఆబియాన్ కార్యక్రమంలో బాగంగా మండల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మాతరెడ్డి శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త గ్రామ స్థాయిలో పార్టీ పథకాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు 4-8 తేదీలో జరిగే గావ్ చలో బస్తి చలో అభియాన్ కార్యక్రమం ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చెయ్యాలన్నారు.ఈకార్యక్రమంలో..బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కోమటి భాస్కర్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రబాకర్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాధురి వెంకట్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల సైదులు,మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు, కారంపూడి సాయికుమార్,బొడ్డుపల్లి ఆంజనేయులు,ముడుసు బిక్షపతి,నాగరాజు,ఐతగోని శివ,బసవోజు వినోద్,నీలం నాగరాజు,బత్తిని నాగరాజు, మల్లికార్జున్,కృష్ణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

మొట్లపల్లిలో కార్టన్ సెర్చ్

మొట్లపల్లిలో కార్డెన్ సెర్చ్ణ

-కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్న డిఎస్పీ రాములు, సీఐ వేణుచందర్, ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

[Crime journalist ]:

మొగుళ్ళపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామంలో డీఎస్పీ రాములు, సీఐ వేణు చందర్, ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ ల నేతృత్వంలో చిట్యాల సర్కిల్ పరిధిలోని స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు 60 మందితో శుక్రవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రెండున్నర లీటర్ల గుడుంబాను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలనుద్దేశించి డీఎస్పీ రాములు మాట్లాడారు. గ్రామంలో దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రముఖులు ముందుకు రావాలని కోరారు. నివాస ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల బారిన పడకుండా యువతను కాపాడుకునేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రమాదంగా ఉండాలని సూచించారు. ఇంటింటి సోదాలో కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చొరబడ్డ మావోయిస్టులను ఏరివేసేందుకు పోలీసులు కార్డెన్ సెర్చ్ చేసేవారు. కానీ ఇప్పుడు పల్లెల్లో గుడుంబా, దొంగతనాలు, మత్తు పదార్థాలు, క్రిమినల్ కేసులు పెరుగుతున్నందున ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు రమేష్, రవికుమార్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

జీవించినంత కాలం ఏ రంగంలో పనిచేసిన అంకిత భావంతో పని చేసి సమాజాభివృద్ధికి దోహదపడాలి

జీవించినంత కాలం ఏ రంగంలో పనిచేసిన అంకిత భావంతో పని చేసి సమాజాభివృద్ధికి దోహదపడాలి

సహృదయ ఆచార్యులు -బన్న అయిలయ్య.    

                           డాక్టర్ అంపశయ్య నవీన్.  

  

హన్మకొండ:[Crime journalist] :-

ఆంధ్ర దేశంలో ఎంతో మంది పరిశోధక విద్యార్థులకు దిశా నిర్దేశనం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించి వారిలో నూతన ఉత్సాహాన్నిచ్చే సహృదయ ఆచార్యులు బన్న  అయిలయ్య అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖాధిపతి గౌడ్ డాక్టర్ చిర్ర రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని బన్న అయిలయ్య చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన కవిత్వంలో మట్టిముద్దను నేను అని చెప్పుకున్నా అయిలయ్య నేడు వజ్రపు తునుక అని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం, గురువుల పట్ల విధేయత, విద్యార్థుల పట్ల ప్రేమ వాత్సల్యం కనబరిచి తనను తాను ఉన్నతీకరించుకోని ఉన్నతస్థాయికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. అనేక కష్టాల కడలి నుండి కష్టపడి ఎదిగి వచ్చిన ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రస్తుత కాలంలో పరిపాలన పదవులు ముళ్ళకీరిటం లాంటిది అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఏడు సంవత్సరాలు అప్రతిహతంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా కొనసాగడం వృత్తి పట్ల ఆయన అంకిత భావానికి నిదర్శనం అని తెలిపారు. తర్వాత కేక్ కట్ చేసి, ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆచార్య బన్న అయిలయ్య మాట్లాడుతూ..మనిషి పుట్టుక ఎవరికి తెలియదు..కానీ జీవించిన కాలం ఏ రంగంలో పని చేసిన అంకిత భావంతో పని చేసి సమాజ అభివృద్ధికి దోహదపడాలని తెలియచేస్తూ..జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ హనుమంత్, డాక్టర్ మామిడి లింగయ్య, డాక్టర్ చింతం ప్రవీణ్, డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ కనకయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ పాల్గొన్న ఎస్ఐ మాధవ్

గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ

-పాల్గొన్న మొగుళ్ళపల్లి ఎస్సై మాధవ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

[Crime journalist] :-

(మెట్టుపల్లి):- గర్భిణీ స్త్రీలు మానసిక ప్రశాంతతో పాటు తాజా పండ్లు, పౌష్టిక ఆహారం భుజించి ఆరోగ్యంగా ఉండాలని మొగుళ్లపల్లి ఎస్ఐ తీగలమాధవ్ గౌడ్ గర్భిణీలకు సూచించారు. శుక్రవారం మొగుళ్ళపల్లి మండలంలోని మెట్టుపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో గర్భిణీ మరియు బాలింత స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఎస్ఐ చేతుల మీదుగా నిర్వహించారు. మెట్టుపల్లి గ్రామానికి చెందిన గజ్జి రాజ్ కుమార్, ఏకాంబ రామారావు, తెప్పరాజు, జనగాం శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ పాల్గొని గర్భిణీ స్త్రీలతో పాటు బాలింతలకు మరియు విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ సామాజిక సేవ ద్వారా గ్రామాలలో నిరుపేదలకు సేవలందిస్తున్న గజ్జి రాజ్ కుమార్, రామారావు, జనగాo శ్రీను, తెప్పరాజులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెట్టుపల్లి ఎంపీటీసీ మంద సుధాకర్, మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు మంద స్వామి, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, స్కూల్ హెడ్మాస్టర్ విష్ణుమూర్తి, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, నాయకులు పాల్గొని మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ ను ఘనంగా శాలువాతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో కారోబార్, ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు - పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

• పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ. ఐపిఎస్ అధికారిణి సిద్దిపేట •

       

    

సిద్దిపేట జిల్లా [Crime journalist] :-  సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం తేది 03-02-2024 ఉదయం 6:00 నుండి 18-02-2024 ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుందని మీడియా ప్రకటనలో పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. మరియు శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ గారు సూచించారు.సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు తేదీ: 03-02-2024 ఉదయం 6 గంటల నుండి తేదీ: 18-02-2024 ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుందన్నారు.సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7(1) 2016, యాక్ట్, సెక్షన్ 55 db (A), 45db (A), 65db (A), 30 పోలీస్ యాక్ట్ 1861, రూల్ నెంబర్ 8 నోస్ పొల్యూషన్, (రెగ్యులేషన్ & కంట్రోల్) రూల్స్ 2000 ప్రకారం పోలీస్ కమిషనర్ గారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి అధికారుల అనుమతి పొందాలని సూచించారు. పై నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 IPC, సెక్షన్ 70(A), 70(B) 70 C, 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపిన డాక్టర్.అనురాధ, ఐపీఎస్.(కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట).

భారత్ రైస్ - కిలో బియ్యం 29 రూపాయలకే

కిలో బియ్యం 29 రూపాయలకే

భారత్ రైస్

[Crime journalist] :-

కేంద్రప్రభుత్వం హెచ్చరిక  బ్లాక్ మార్కెట్ పెట్టీనా తరలించినా ఒక్కరూపాయి ఎక్కువగా అమ్మినా కఠిన చర్యలు

బియ్యం ధరలకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేస్తూ నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంది.నేటి నుంచి మార్కెట్‌లోకి బియ్యం దిగనుంది. దీనికి భారత్ రైస్ గా నామకరణం చేసింది. కిలో 29 రూపాయల చొప్పున భారత్ రైస్ ను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.భారత్ రైస్...నేటి నుంచి మార్కెట్ లోకి వస్తున్న భారత్ రైస్ ను ఎక్కువ ధరకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇటీవల బియ్యం ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ ను అందుబాటులోకి తీసుకు రానుంది.