జీవించినంత కాలం ఏ రంగంలో పనిచేసిన అంకిత భావంతో పని చేసి సమాజాభివృద్ధికి దోహదపడాలి

జీవించినంత కాలం ఏ రంగంలో పనిచేసిన అంకిత భావంతో పని చేసి సమాజాభివృద్ధికి దోహదపడాలి

సహృదయ ఆచార్యులు -బన్న అయిలయ్య.    

                           డాక్టర్ అంపశయ్య నవీన్.  

  

హన్మకొండ:[Crime journalist] :-

ఆంధ్ర దేశంలో ఎంతో మంది పరిశోధక విద్యార్థులకు దిశా నిర్దేశనం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించి వారిలో నూతన ఉత్సాహాన్నిచ్చే సహృదయ ఆచార్యులు బన్న  అయిలయ్య అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖాధిపతి గౌడ్ డాక్టర్ చిర్ర రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని బన్న అయిలయ్య చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన కవిత్వంలో మట్టిముద్దను నేను అని చెప్పుకున్నా అయిలయ్య నేడు వజ్రపు తునుక అని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం, గురువుల పట్ల విధేయత, విద్యార్థుల పట్ల ప్రేమ వాత్సల్యం కనబరిచి తనను తాను ఉన్నతీకరించుకోని ఉన్నతస్థాయికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. అనేక కష్టాల కడలి నుండి కష్టపడి ఎదిగి వచ్చిన ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రస్తుత కాలంలో పరిపాలన పదవులు ముళ్ళకీరిటం లాంటిది అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఏడు సంవత్సరాలు అప్రతిహతంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా కొనసాగడం వృత్తి పట్ల ఆయన అంకిత భావానికి నిదర్శనం అని తెలిపారు. తర్వాత కేక్ కట్ చేసి, ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆచార్య బన్న అయిలయ్య మాట్లాడుతూ..మనిషి పుట్టుక ఎవరికి తెలియదు..కానీ జీవించిన కాలం ఏ రంగంలో పని చేసిన అంకిత భావంతో పని చేసి సమాజ అభివృద్ధికి దోహదపడాలని తెలియచేస్తూ..జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ హనుమంత్, డాక్టర్ మామిడి లింగయ్య, డాక్టర్ చింతం ప్రవీణ్, డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ కనకయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ పాల్గొన్న ఎస్ఐ మాధవ్

గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ

-పాల్గొన్న మొగుళ్ళపల్లి ఎస్సై మాధవ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

[Crime journalist] :-

(మెట్టుపల్లి):- గర్భిణీ స్త్రీలు మానసిక ప్రశాంతతో పాటు తాజా పండ్లు, పౌష్టిక ఆహారం భుజించి ఆరోగ్యంగా ఉండాలని మొగుళ్లపల్లి ఎస్ఐ తీగలమాధవ్ గౌడ్ గర్భిణీలకు సూచించారు. శుక్రవారం మొగుళ్ళపల్లి మండలంలోని మెట్టుపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో గర్భిణీ మరియు బాలింత స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఎస్ఐ చేతుల మీదుగా నిర్వహించారు. మెట్టుపల్లి గ్రామానికి చెందిన గజ్జి రాజ్ కుమార్, ఏకాంబ రామారావు, తెప్పరాజు, జనగాం శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ పాల్గొని గర్భిణీ స్త్రీలతో పాటు బాలింతలకు మరియు విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడుతూ సామాజిక సేవ ద్వారా గ్రామాలలో నిరుపేదలకు సేవలందిస్తున్న గజ్జి రాజ్ కుమార్, రామారావు, జనగాo శ్రీను, తెప్పరాజులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెట్టుపల్లి ఎంపీటీసీ మంద సుధాకర్, మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు మంద స్వామి, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, స్కూల్ హెడ్మాస్టర్ విష్ణుమూర్తి, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, నాయకులు పాల్గొని మొగుళ్ళపల్లి ఎస్ఐ మాధవ్ గౌడ్ ను ఘనంగా శాలువాతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో కారోబార్, ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు - పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

• పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ. ఐపిఎస్ అధికారిణి సిద్దిపేట •

       

    

సిద్దిపేట జిల్లా [Crime journalist] :-  సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం తేది 03-02-2024 ఉదయం 6:00 నుండి 18-02-2024 ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుందని మీడియా ప్రకటనలో పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. మరియు శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ గారు సూచించారు.సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు తేదీ: 03-02-2024 ఉదయం 6 గంటల నుండి తేదీ: 18-02-2024 ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుందన్నారు.సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7(1) 2016, యాక్ట్, సెక్షన్ 55 db (A), 45db (A), 65db (A), 30 పోలీస్ యాక్ట్ 1861, రూల్ నెంబర్ 8 నోస్ పొల్యూషన్, (రెగ్యులేషన్ & కంట్రోల్) రూల్స్ 2000 ప్రకారం పోలీస్ కమిషనర్ గారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి అధికారుల అనుమతి పొందాలని సూచించారు. పై నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 IPC, సెక్షన్ 70(A), 70(B) 70 C, 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపిన డాక్టర్.అనురాధ, ఐపీఎస్.(కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట).

భారత్ రైస్ - కిలో బియ్యం 29 రూపాయలకే

కిలో బియ్యం 29 రూపాయలకే

భారత్ రైస్

[Crime journalist] :-

కేంద్రప్రభుత్వం హెచ్చరిక  బ్లాక్ మార్కెట్ పెట్టీనా తరలించినా ఒక్కరూపాయి ఎక్కువగా అమ్మినా కఠిన చర్యలు

బియ్యం ధరలకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేస్తూ నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంది.నేటి నుంచి మార్కెట్‌లోకి బియ్యం దిగనుంది. దీనికి భారత్ రైస్ గా నామకరణం చేసింది. కిలో 29 రూపాయల చొప్పున భారత్ రైస్ ను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.భారత్ రైస్...నేటి నుంచి మార్కెట్ లోకి వస్తున్న భారత్ రైస్ ను ఎక్కువ ధరకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇటీవల బియ్యం ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ ను అందుబాటులోకి తీసుకు రానుంది.

ఫిబ్రవరి 16వ తేదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి - సిఐటియు

ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి - సిఐటియు

సిద్దిపేట జిల్లా:

కుకునూర్ పల్లి:

 [ Crime journalist] :- ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కుకునూర్ పల్లి తహసీల్దారు మల్లికార్జున్ రెడ్డి కి సమ్మె నోటీస్ ఇచ్చారు.ఈ. సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక నాలుగు లేబర్ కార్డులను ఉపసంహరించుకోవాలని 2022 విద్యుత్తు సవరణను మానుకోవాలని రైతు వ్యతిరేక విధానాలను దింపి కొట్టాలని కార్పొరేట్ కొమ్ముకాస్తున్న బిజెపిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల నరసయ్య, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బర్మ కొమురయ్య, ఉమ్మడి మండల అధ్యక్ష కార్యదర్శులు ఆరుట్ల నర్సింలు, జాలిగామ ప్రభాకర్ ,కుకునూర్ పల్లి మండల నాయకులు సాయిలయ్య, సాయి కుమార్ ,రవికుమార్, నరహరి,పోచయ్య,లక్ష్మణ్, లక్ష్మి, నరసవ్వ, వెంకటవ్వ,బిక్షపతి, కనకయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

420హామీలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి - బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఆరు గ్యారెంటీల అమలుపై చేతులెత్తేసిన సీఎం.రేవంత్ సర్కార్  -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

ఘట్ కేసర్:

[Crime journalist] :-

ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్‌ నియోజకవర్గ విజయోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ మరియు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ మల్లారెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని చెప్పారు. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయని తెలిపారు.కృష్ణా, గోదావరి జీవ నదులు. కృష్ణా నదిలో మన వాటాను కేంద్రం ఇంకా తేల్చలేదు. మన వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను రేవంత్‌ రెడ్డి తాకట్టు పెట్టారు. అందుకే బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ఉండాలి. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్‌ ఎంపీలే. మాయమాటలు చెప్పి రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 420 హామిలిచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి అని కేటీఆర్ అన్నారు.

ఆశాజనకంగా తెలంగాణ రాబడి మూడో ఆర్థిక త్రైమాసిక కాగ్ నివేదిక

కేసీఆర్‌ హయాంలో ప్రబల ఆర్థిక శక్తిగా రాష్ట్రం.. 

నిరుడి కంటే రూ. 24,221 కోట్లు అధికం

ఆశాజనకంగా తెలంగాణ రాబడి

మూడో ఆర్థిక త్రైమాసికంపై కాగ్‌ నివేదిక

తెలంగాణ రాష్ట్రం:

[Crime journalist] :-

అనతికాలంలోనే తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగింది. కేసీఆర్‌ పాలనలో ఆర్థిక వనరులను భారీగా పెంచడంతో పదేండ్లలోనే గణనీయ ఆర్థిక వృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఆర్థిక సంవత్సర (2014-15)లో మూడో త్రైమాసికం (క్యూ-3) చివరి నాటికి రూ.74,419 కోట్లుగా ఉన్న రాష్ట్ర రాబడి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ చివరి నాటికి 1,88,863 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలో దాదాపు 73 శాతానికి సమానం. 2014-15 క్యూ-3 చివరి నాటికి వచ్చిన రాబడి కంటే రూ.1,14,444 కోట్లు అధికం.

నిరుడు ఇదే సమయానికి వచ్చిన రాబడి కంటే రూ.24,221 కోట్లు ఎక్కువ. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి మొత్తంగా రూ.2,39,986 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా.. డిసెంబర్‌ చివరి నాటికి రూ.1,64,641 కోట్ల రాబడి వచ్చింది. ఇది బడ్జెట్‌ అంచనాలో 69 శాతానికి సమానం. ఇలా ఏటికేడు ఆర్థిక వనరులను పెంచుకుంటూ తెలంగాణ తక్కువ సమయంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని తాజా నివేదికలో కంప్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కొనియాడింది.

రూ.91,136 కోట్ల పన్ను రాబడి

పన్నుల రాబడిలోనూ తెలంగాణ గణనీయ వృద్ధి సాధించింది. ఈ ఆర్థి క సంవత్సరంలో పన్నుల రూపేణా రూ.1,43,989 కోట్లు రావచ్చని ఆర్థిక శాఖ అంచనా వేయగా.. క్యూ-3 చివరి నాటికి రూ.91,136 కోట్ల రాబడి వచ్చింది. ఇది అంచనాలో 63 శాతానికి సమానం. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి వచ్చిన 79,506 కోట్ల పన్ను రాబడి కంటే రూ.11,630 కోట్లు అధికం. ఈసారీ పన్ను రాబడుల్లో ప్రధాన వాటా వస్తు, సేవల పన్నుదే. జీఎస్టీ రూపేణా రూ.33,581 కోట్లు ఖజానాకు చేరగా.. అమ్మకం పన్ను ద్వారా రూ.13,806 కోట్లు, ఎక్సైజ్‌ సుంకాల రూపంలో రూ.11,308 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,025 కోట్లు సమకూరాయి.

ఎవరికి ఏమైనా మాకనవసరం - సిద్ధం సభను విజయవంతం చేయాల్సిందే

ఎవరికి ఏమైనా మాకనవసరం - సిద్ధం సభను విజయవంతం చేయాల్సిందే 

చదువులు సంకనాకిపోయినా పర్లేదు

మామయ్య సభ కోసం త్యాగాలు చేయాల్సిందే

స్కూల్ బస్సులు కోసం పరీక్షలు వాయిదా

స్కూళ్ల నిర్వాహకులు నుండి బలవంతంగా బస్సులు డిమాండ్

ఎవరికేమైనా మాకనవసరం ... సిద్దం సభను విజయవంతం చేయాల్సిందే.

ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం పై అధికారుల ఒత్తిళ్లు

ఆంధ్రప్రదేశ్:

గోదావరి జిల్లా:

[Crime journalist]:- రాష్ట్రంలోని విద్యార్థులందరికి యూనివర్సల్ మేనమామ గా చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం వారి భవిష్యత్ పైనే దెబ్బ కొడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో ఈ నెల 3 న జరగనున్న సిద్దం మహా సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు స్కూల్ బస్సులను ప్రధానంగా ఎంచుకున్నారు. దీంతో అధికారులు బస్సులు ఇవ్వాలంటూ ప్రయివేటు స్కూళ్ల నిర్వాహకులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. ఓ వైపు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. మరో వైపు రాబోయే రోజుల్లో 10వ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతి నిముషం ఎంతో విలువైందనీ స్కూళ్ల నిర్వాహకులు అధికారులకు తెలియజేసినప్పటికి, మెజారిటీ స్కూళ్ల నిర్వాహకులు బస్సులు ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేసినప్పటికి అధికారులు మాత్రం వీరి మాటలు పట్టించుకోవడం లేదు. అంతే కాదు ఏకంగా సిద్దం సభ రోజున జరగనున్న ఇంటర్ పరీక్షనే ప్రభుత్వం వాయిదా వేసింది. దీని కోసం ఓ ప్రత్యేక జీవో ను విడుదల చేస్తూ అర్ధాంతరంగా వాయిదా ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ సత్తా చాటి రాజకీయంగా మార్కులు వేసుకోవాలనేది జగన్ ఆలోచన. అయితే ఈ ఆలోచన తప్పు కాదు గానీ ఇందుకు ప్రధానంగా జన సమీకరణ కు స్కూల్ బస్సులను ఎంచుకోవడమే తప్పిదమని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు తరగతులు బోధించడం ఎంతో ముఖ్యమని ఎంత వేడుకున్నా అధికారులు మాత్రం స్కూల్ నిర్వాహకులు మాటలు వినడం లేదనిమండిపడుతున్నారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చుకునైనా సరే ఎన్ని బస్సులు వుంటే అన్ని బస్సులు సిద్దం సభకు పంపించల్సిందేనంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారనీ, ముఖ్యమంత్రి జగన్ విద్యకు అధిక పీట వేస్తున్నారని, ప్రతి విద్యార్థికి మేనమామ లా వారి భవిష్యత్ ను తన చేతుల్లోకి తీసుకున్నాడని గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకులకు ఇదేం పనికిమాలిన పని అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతగా కావాలంటే ప్రయివేటు బస్సులు కిరాయికి పెట్టుకోవాలమో గానీ విద్యార్థులను స్కూళ్ళు మానేయమని చెప్పడమెంటని మండిపడుతున్నారు. గతం లోనూ జన సమీకరణ కు బస్సులు అడిగిన సందర్భాలు వున్నప్పటికీ ఇంత దారుణంగా ఎవరూ ఇన్నిన్నిసార్లు అడగలేదని, పైగా గతం లో స్కూళ్లకు ఇబ్బంది లేకుండా సెలవు రోజుల్లో సభ నిర్వహించుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని స్కూళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా ఓ ముఖ్యమంత్రి సభ కోసం ఇంటర్ పరీక్షలనే వాయిదా వేయడం ఇదే ప్రదమమని, ఇది మంచి పద్ధతి కాదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని స్కూల్ బస్సులను వదిలేయాలనీ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

నిరుద్యోగ డిఎస్ సి అభ్యర్థుల ప్రతిజ్ఞ

నిరుద్యోగ డిఎస్ సి అభ్యర్థుల ప్రతిజ్ఞ

నిరుద్యోగ DSCఅభ్యర్థుల ఈ ప్రతిజ్ఞ చూస్తే వైసిపి వాళ్ళంతా నీళ్ళు లేని

బావిలో దూకనైనా దూకాలి లేదా

రాజకీయాలు వదిలేసి ఆయినా పోవాలి

•Pawan Kalyan •

•Jansenapaarty•

• JSPBJPAlliance •

•JSPTDPAlliance •

•YSJaganFailedCM •

•WhyAPHatesJagan•

•HelloAP_ByeByeYCP•

•JSPForNewAgePolitics•

•HelloAP_WelcomeJanaSena•

భారిగా నగదు పట్టివేత ₹- 5,12,91,180 నగదు స్వాధీనం - ఆరుగురు అరెస్ట్

భారీగా నగదు పట్టివేత5,12,91,180 నగదు స్వాధీనం

ఆరుగురు ముద్దాయిలు అరెస్ట్ 

గూడూరు :

[Crime journalist 01-02-2024] :- ఎలక్షన్ కోడ్‌ సమీపిస్తున్న తరుణంలోలో భాగంగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో గూడూరు రూరల్ సీఐ గూడూరు వన్ టౌన్ సి గూడూరు రూరల్ ఎస్సై మరియు చిలుకూరు ఎస్సైలు సిబ్బందితో కలిసి గురువారం వాహనాలను తనిఖీలు చేపట్టారు. నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైనఏర్పాట్లు చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా చెక్పోస్టులు పెట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లోపోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. ఐదు కోట్ల 12 లక్షల 91 వేల 180 రూపాయలను భారీ నగదును పోలీసులు సీజ్ చేశారు. ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు. గురువారం గూడూరు పట్టణంలోని గూడూరు సర్కిల్ కార్యాలయంలో గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలు పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గూడూరు రూరల్ సీఐ ఎస్సై వారి సిబ్బందితో కలిసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మూడు కోట్ల 67 లక్షల 41 వేల 180 రూపాయలను నగదును స్వాధీనం చేసుకొని ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గూడూరు రూరల్ పరిధిలోని చిలకలూరి బైపాస్ రోడ్ జంక్షన్ వరద గూడూరు రూరల్ ఎస్సై మనోజ్ కుమార్ ఇబ్బందితో కలిసి 95 లక్షల 80 వేల రూపాయలను నగదును స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గూడూరు వన్ టౌన్ పరిధిలో ముబారక్ బిర్యాని షాప్ వద్ద బిఎస్సార్ లాడ్జి ఎదురుగా గూడూరు వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి 50,00,000, నగదును స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు గుర్తుతెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అటుగా వెళ్తున్న వారిని తనిఖీ చేశారు. ఆ సంచుల్లో ఐదు కోట్ల 12 లక్షల 91 వేల 150రూపాయలను  తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆ నగదును సీజ్ చేసేమని తెలిపారు . సందర్భంగా ఆయన గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి , గూడూరు వన్ టౌన్ సిఐ పాపారావు , రూరల్ ఎస్సై మనోజ్ కుమార్, చిలుకూరు ఎస్సై అంజిరెడ్డి సిబ్బందిని డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.