ఎవరికి ఏమైనా మాకనవసరం - సిద్ధం సభను విజయవంతం చేయాల్సిందే
ఎవరికి ఏమైనా మాకనవసరం - సిద్ధం సభను విజయవంతం చేయాల్సిందే
చదువులు సంకనాకిపోయినా పర్లేదు
మామయ్య సభ కోసం త్యాగాలు చేయాల్సిందే
స్కూల్ బస్సులు కోసం పరీక్షలు వాయిదా
స్కూళ్ల నిర్వాహకులు నుండి బలవంతంగా బస్సులు డిమాండ్
ఎవరికేమైనా మాకనవసరం ... సిద్దం సభను విజయవంతం చేయాల్సిందే.
ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం పై అధికారుల ఒత్తిళ్లు
ఆంధ్రప్రదేశ్:
గోదావరి జిల్లా:
[Crime journalist]:- రాష్ట్రంలోని విద్యార్థులందరికి యూనివర్సల్ మేనమామ గా చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం వారి భవిష్యత్ పైనే దెబ్బ కొడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో ఈ నెల 3 న జరగనున్న సిద్దం మహా సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు స్కూల్ బస్సులను ప్రధానంగా ఎంచుకున్నారు. దీంతో అధికారులు బస్సులు ఇవ్వాలంటూ ప్రయివేటు స్కూళ్ల నిర్వాహకులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. ఓ వైపు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. మరో వైపు రాబోయే రోజుల్లో 10వ తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతి నిముషం ఎంతో విలువైందనీ స్కూళ్ల నిర్వాహకులు అధికారులకు తెలియజేసినప్పటికి, మెజారిటీ స్కూళ్ల నిర్వాహకులు బస్సులు ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేసినప్పటికి అధికారులు మాత్రం వీరి మాటలు పట్టించుకోవడం లేదు. అంతే కాదు ఏకంగా సిద్దం సభ రోజున జరగనున్న ఇంటర్ పరీక్షనే ప్రభుత్వం వాయిదా వేసింది. దీని కోసం ఓ ప్రత్యేక జీవో ను విడుదల చేస్తూ అర్ధాంతరంగా వాయిదా ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ సత్తా చాటి రాజకీయంగా మార్కులు వేసుకోవాలనేది జగన్ ఆలోచన. అయితే ఈ ఆలోచన తప్పు కాదు గానీ ఇందుకు ప్రధానంగా జన సమీకరణ కు స్కూల్ బస్సులను ఎంచుకోవడమే తప్పిదమని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు తరగతులు బోధించడం ఎంతో ముఖ్యమని ఎంత వేడుకున్నా అధికారులు మాత్రం స్కూల్ నిర్వాహకులు మాటలు వినడం లేదనిమండిపడుతున్నారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చుకునైనా సరే ఎన్ని బస్సులు వుంటే అన్ని బస్సులు సిద్దం సభకు పంపించల్సిందేనంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారనీ, ముఖ్యమంత్రి జగన్ విద్యకు అధిక పీట వేస్తున్నారని, ప్రతి విద్యార్థికి మేనమామ లా వారి భవిష్యత్ ను తన చేతుల్లోకి తీసుకున్నాడని గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకులకు ఇదేం పనికిమాలిన పని అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతగా కావాలంటే ప్రయివేటు బస్సులు కిరాయికి పెట్టుకోవాలమో గానీ విద్యార్థులను స్కూళ్ళు మానేయమని చెప్పడమెంటని మండిపడుతున్నారు. గతం లోనూ జన సమీకరణ కు బస్సులు అడిగిన సందర్భాలు వున్నప్పటికీ ఇంత దారుణంగా ఎవరూ ఇన్నిన్నిసార్లు అడగలేదని, పైగా గతం లో స్కూళ్లకు ఇబ్బంది లేకుండా సెలవు రోజుల్లో సభ నిర్వహించుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని స్కూళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా ఓ ముఖ్యమంత్రి సభ కోసం ఇంటర్ పరీక్షలనే వాయిదా వేయడం ఇదే ప్రదమమని, ఇది మంచి పద్ధతి కాదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని స్కూల్ బస్సులను వదిలేయాలనీ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Feb 02 2024, 15:54