గ్రామపంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళన మహోత్సవం
గ్రామపంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళన మహోత్సవం
సిద్దిపేట జిల్లా:
[Crimejournalist01-02-2024] :
కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లిలో గ్రామ పంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళనం మహోత్సవం జరిపారు.ఈ మహోత్సవం లో పాల్గొన్న స్థానిక సర్పంచ్ తోట భాగ్యలక్ష్మి ఆంజనేయులు దంపతులను, ఉపసర్పంచ్ అనుమాండ్ల శ్రీనివాస్ రెడ్డి,వార్డు మెంబర్స్, కార్యదర్శి గార్లను స్థానిక ఎంపిటిసి తరుపున శాలువాలతో సన్మానించిన కోహెడ ఎంపిటిసి ఖమ్మం స్వరూపవేంకటేశం దంపతులు. వెంకటేశ్వర్ల పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం వీడ్కోలు ఆత్మీయ సమ్మేళనం మహోత్సవం పురస్కరించుకుని స్థానిక సర్పంచ్ తోట భాగ్యలక్ష్మి , ఉపసర్పంచ్ అనుమాండ్ల శ్రీనివాస్ రెడ్డి , పంచాయితీ కార్యదర్శి ఇల్లందుల నరేష్ గౌడ్ , వార్డు మెంబర్స్ గౌవబోయిన రజిత , కంది శ్రీనివాస్ రెడ్డి , బింరెడ్డి భారతవ్వ , సాధనవేణి రాజు, సయ్యద్ ఇమాంబీ , షేక్ సజన్ బీ, గార్లను శాలువలతో సన్మానించిన Mptc ఖమ్మం స్వరూపవేంకటేశం ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది,ఆశా పిడిశెట్టి తారా , అంగన్వాడీ టీచర్లు బీ. జ్యోష్ణ , మహిళ సంఘాల వి ఏ వో జయ , మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Feb 02 2024, 06:47