సర్పంచ్ ల సేవలు మరువలేనివి
సర్పంచుల సేవలు మరువలేనివి
సిద్దిపేట జిల్లా:
గజ్వేల్: [ Crime journalist 01-02-2024]
గజ్వేల్ తెలంగాణ గ్రామీణ అభివృద్ధి లో సర్పంచులు కీలక పాత్ర పోషించారని తెలంగాణ స్టేట్ బిఆర్ఎస్ యూత్ వింగ్ &ఏజెడ్ ఫౌండేషన్ జుబైర్ పాషా ప్రశంసించారు.ఐదు ఏళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో వారి వీడ్కోలు సందర్భంగా ఆయన మాట్లాడారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నూతన పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేసి గ్రామీణాభివృద్ధి కి పెద్ద పీఠ వేయడం జరిగిందన్నారు.
కేసీఆర్ గారి అడుగు జాడల్లో సర్పంచులు ముందుకు సాగడం జరిగిందన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ గ్రామాన స్మశాన వాటికలు, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ లు, డంపింగ్ షేడ్, నర్సరీలు, పార్కులు, క్రీడా మైదానాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గ్రామీణ అభివృద్ధి లో కీలకపాత్ర పాత్ర పోషించిన సర్పంచుల పాత్ర మరువలేమన్నారు.గజ్వేల్ నియోజకవర్గం లో అభివృద్ధి తో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఘన విజయం అందించడంలో ప్రత్యేక కృషి చేసిన సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉన్న వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.గజ్వేల్ నియోజకవర్గం ములుగు, వర్గల్ మండలాల పక్షన గ్రామ ప్రాంచాయతి పాలక వర్గంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .వారి సేవలు మరువలేమన్న
తెలంగాణ స్టేట్ బిఆర్ఎస్ యూత్ వింగ్&ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా.
Feb 01 2024, 20:22